Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

సియాటెల్ లోని ఇస్కాన్ సభ్యుల అద్వర్యం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి “గీతా సత్సంగం”

సియాటెల్ లోని ఇస్కాన్ సభ్యుల అద్వర్యం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే (17.7.2023)గీతా సత్సంగం జరిగింది. లోక శ్రేయస్సును కాంక్షిస్తూ కృష్ణ మార్గాన్ని ప్రచారం చేస్తే వేదాంత ప్రభుపాద లాగా శాశ్వతులవుతారని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతే శ్రీకృష్ణ తత్వమని, లోకహితం కోసం, స్వార్ధ రహితo గా, దైవార్పణ బుద్ధి తో కర్మలు చేయాలనేదే భగవద్గీతా సారాంశమని అన్నారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ శ్రీ గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతను ఎన్నోమార్లు విన్నామని, గాన పద్ధతి లో ఆయన అందించే గీతా సందేశాన్ని విని స్ఫూర్తి పొందామని, సామాన్యుడికి అర్ధమయ్యే రీతిలో ఆయన గీతకు ఇస్తున్న వివరణ ఎంతో మందిని ప్రభావితం చేస్తోందని చెబుతూ శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఆ తర్వాత తనకు ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ నండూరి జయరాం, శ్రీమతి కళ్యాణి దంపతులను గంగాధరశాస్త్రి సత్కరించారు. సియాటెల్ వాసులు నిర్వహించిన పలు ‘గీతా’ కార్యక్రమాలలో పాల్గొన్న శ్రీ గంగాధర శాస్త్రి జులై 18 న హ్యూస్టన్ చేరుకున్నారు.

వాషింగ్టన్ లోని సియాటెల్ లో రెండవ రోజు “గీతా గాన ప్రచార శంఖారావం”

భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార నిమిత్తం అమెరికా లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగం గా వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజుల పాటు ( జులై 13,14,15 ) నిత్య జీవితానికి భగవద్గీత అనుసంధానాన్ని వివరిస్తూ చేసిన గాన ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. గీతా ప్రవచనం తో పాటు మధ్య మధ్య లో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు గానం చేస్తూ, భక్తులతో భగవద్గీత శ్లోకాలను పఠిoప చేస్తూ, భజనలు చేయించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అనేకమంది ప్రేక్షకులు ఆనందాశ్రువులతో తమ సంతోషాన్ని శ్రీ గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. గంగాధర శాస్త్రి ‘గీత’ పై ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ చేపట్టిన ప్రాజెక్టులను వివరించి చేయూత కోరారు. కొందరు భక్తులు వారి గృహాలకు ఆహ్వానించి సత్కరించారు. చివరి రోజున దేవాలయ నిర్వాహకులు శ్రీమతి సాయి, ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయ భాస్కర పరాశర దీక్షితులు, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి షీలా, మోహన్ వార్తకవి, మాధవి, రాంప్రసాద్ సుంకర, కృష్ణకుమారి,రమేష్ కొలవేను,HTCC, Bothell ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ శర్మ రావూరు తదితరులు డాII గంగాధర శాస్త్రి ని ఘనంగా సత్కరించారు.

+25

All reactions:

వాషింగ్టన్ లోని సియాటెల్ లో వైభవం గా ప్రా రంభమయిన ‘గీతా గాన ప్రచార శంఖారావం’…..

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త , భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటన చేస్తున్న నేపధ్యం లో తొలి కార్యక్రమం వాషింగ్టన్ లోని సియాటెల్ లో వైభవం గా జరిగింది. రెడ్మoడ్ లోని లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం లో ఏర్పాటైన తొలి రోజు కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి తన ప్రవచనం లో భగవద్గీత పరిచయం తో పాటు అన్నమయ్య కీర్తనలు, ఘంటసాల భక్తి గీతాలు, భజనలు ఆలపించారు. కార్యక్రమానంతరం ప్రేక్షకులు ఆనందాశృవులతో తమ ఆనందాన్ని గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. అంతకు ముందు దేవాలయ ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయభాస్కర పరాశర దీక్షితులు గంగాధర శాస్త్రిని సత్కరించి, సమున్నతమైన పరిచయ వాక్యాలతో వేదికపైకి స్వగతం పలికారు. తనకు ఆత్మీయ ఆతిథ్యం అందించిన శ్రీ నండూరి జయరాం, శ్రీమతి కళ్యాణి దంపతులకు, కార్యక్రమ ఏర్పాటుకు మూలకారకులైన శ్రీ శేఖర్ రావు బసవరాజు లకు గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

‘గీత గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటన లో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి…

ప్రసిద్ధ గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీత గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజులపాటు ( జులై 14,15,16 తేదీలలో ) గీతామృతం పంచనున్నారు.ఈ నేపధ్యం లో గంగాధర శాస్త్రి గారికి ఆతిధ్యo అందించిన శ్రీ జయరాం నండూరి ఇంట్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గళమురళి డాII ఈలపాట శివప్రసాద్, గంగాధర శాస్త్రి ల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది.. దేవాలయ సేవకులు శ్రీ రాంగోపాల్ రెడ్డి వంగపాటి, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, ఎల్ విశ్వతేజ లు తమ సంతోషాన్ని పంచుకున్నారు. శ్రీ కె.శివప్రసాద్ – గంగాధర శాస్త్రిని దుశ్శాలువా తో సత్కరించి ‘గీత ప్రచార లక్ష్యం’ సఫలీకృతం కావాలని ఆశీర్వదించారు. అమెరికా లో తన గీతా గాన ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేయదలుచుకున్న వారిని శ్రీ శేఖర్ రావు బసవ రాజు – +1(817)675-3404 ; శ్రీ ఆజాద్ బాబు +91 9866296699 లను సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.

‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించిన స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి దీపా వెంకట్…

భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు కుమార్తె, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి దీపా వెంకట్ హైదరాబాద్ లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, సేవాసంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను ఈ రోజు (25.6.2023) సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డా. ఎల్ వి గంగాధర శాస్త్రి మరియు ఫౌండేషన్ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణుని విగ్రహానికి ఆమె పుష్పమాలను సమర్పించి, శ్రీ గంగాధర శాస్త్రి ని – విశ్వరూపం తో రూపొందించిన శంఖాన్ని బహూకరిస్తూ దుశ్శాలువతో సత్కరించారు. అటుపై భగవద్గీతా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల గురించి శ్రీ గంగాధర శాస్త్రి ఆమెకు లఘుచిత్ర ప్రదర్శన ద్వారా వివరించారు. సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ సమయం లో శ్రీ వెంకయ్య నాయుడు స్టూడియో కి వచ్చి, ‘విశ్వరూపసందర్శన యోగం’ అధ్యాయం విని, తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్న అనుభూతిని తనతో పంచుకున్న విషయాన్ని శ్రీ గంగాధర శాస్త్రి దీపా వెంకట్ కు చెప్పారు. ఆమెను వేదపండితుల ఆశీస్సులతోను దుశ్శాలువతో ను, భగవద్గీత తోను సత్కరిస్తూ, స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా చేస్తున్న సేవలను ప్రశంసించారు

“పవమాన ప్రయోగ హోమం” లో పాల్గొన్న ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి…

మానవ జీవితం లో జననం నుంచి మరణం వరకు మనకు తెలియకుండా చేసే శారీరిక, వాచిక, మానసిక దోషాలతో కూడిన కర్మలనుండి, మాతృ, పితృ దోషాలనుండి విముక్తుల్ని చేయగలిగిన పవమాన ప్రయోగ హోమాన్ని ఉప్పల్, హైదరాబాద్ లోని శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్టు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి అతిథి గా హాజరయ్యారు. యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యం కార్యమేవతత్/యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషీణామ్ (గీత – 18-5) అని గీతాచార్యుడు చెప్పినట్టు మానవ జన్మను పావనం చేసే యజ్ఞము, దానము, తపస్సు అనే మూడు సత్కర్మలను ప్రతిమానవుడూ ఆచరించవలసిందేనని గంగాధర శాస్త్రి అన్నారు. మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. గో సంరక్షణ తో పాటు యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ లోకశ్రేయస్సును కాంక్షించే శ్రీ శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్టు సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కుప్పా శ్రీనివాస స్వామి ని అభినందించారు. ఈ వ్యవస్థ కు చేయూతనందించడం ద్వారా హైందవ సంస్కృతిని, ధర్మాన్నీ కాపాడవలసింది గా భక్తులను, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖను కోరారు. అనంతరం గంగాధర శాస్త్రి దంపతులు గో సేవలో పాల్గొన్నారు.

‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించిన అవధాని బ్రహ్మశ్రీ పాలడుగు శ్రీచరణ్…

అమెరికాలో నివసిస్తూ శబ్దబ్రహ్మొపాసకులు గా ప్రసిద్ధి పొందిన అవధాని బ్రహ్మశ్రీ పాలడుగు శ్రీచరణ్ హైదరాబాద్ లోని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీచరణులకు స్వాగతం పలికి ‘భగవద్గీత’ తో సత్కరించారు. అటుపై ఆధ్యాత్మిక విషయాల పైన చర్చించారు. ఈ సమావేశం లో ప్రసిద్ధ జ్యోతిష పండితులు శ్రీ దంటు శ్రీనివాస్, శ్రీ బి బి కె ప్రసాద్, ఫౌండేషన్ అడ్వొకసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు లు పాల్గొన్నారు.

+3

All reactions:

1111

గీతాగాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి కి మహర్షి పాణిని యూనివర్సిటీ “గౌరవ డాక్టరేట్ “

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది.

భారతీయ సంస్కృతి ని, సంస్కృత విద్యను పరిరక్షించడం లో భాగంగా – పరిశోధనాత్మక కృషి చేసి, భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన భాధ్యత తీరిపోయిందని భావించకుండా – స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు శ్రీ గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ ” ను ప్రకటిస్తున్నట్లు పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేసారు.

మే 24, 2023 ఉదయం 11 గంటలకు కోఠీ మార్గ్ లోని విక్రం కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్ ) లో జరిగే ‘మహర్షి పాణిని సంస్కృ త్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం’ నాల్గవ స్నాతకోత్సవం లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించనున్నట్లు రిజిస్ట్రార్ డాII దిలీప్ సోని తెలిపారు.

ఈ సందర్భం గా గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ –

మధ్యప్రదేశ్ గవర్నర్, ఆ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల కులపతి అయిన శ్రీ మంగుభాయ్ పటేల్ కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విజయ్ కుమార్ సి.జి కు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు, ఉన్నత విద్యా శాఖా మంత్రి శ్రీ మోహన్ యాదవ్ లకు వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

కాగా – ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్, తెలుగువాడైన శ్రీ పి. మురళీధరరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు.

సంస్కృత వ్యాకర్త అయిన ‘పాణిని మహర్షి ‘ పేరు తో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం సముచితంగా, అదృష్టంగా భావిస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తనకు లభించిన ఈ గౌరవం – తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, 17 ఏళ్ళ తన భగవద్గీతా ప్రయాణం లో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, సాంకేతిక నిపుణులకు, ప్రపంచం నలుమూలల నుండి చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందని, తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి అన్నారు.

స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత’ పునాదుల పై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా గీతా ప్రచారం తో పాటు –

* పేద విద్యార్థులకు, అనాధ బాలలకు, వికలాంగులకు , వృద్ధాశ్రమాలకు చేయూత

* గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ

* ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ

వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి చెప్పారు.

ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవా క్షేత్రంగా తెలుగునాట ‘ భగవద్గీతా యూనివర్సిటీ ‘ స్థాపనే పరమ లక్ష్యం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కృషి చేస్తుందని చెబుతూ – మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం ‘భగవద్గీత’ ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించాలని కోరారు.

గతం లో శ్రీ గంగాధర శాస్త్రి సినిమా జర్నలిస్టు గా, సినీ నేపధ్య గాయకుడుగా, సంగీత కార్యక్రమాల సమర్పకుడు గా, ప్రయోక్త గా కొనసాగుతున్న తరుణం లో పరివర్తన చెంది, అప్పటి వరకూ తాను చేసిన జీవిత ప్రయాణపు దిశను మార్చుకుని ఆధ్యాత్మిక మార్గం లోకి ప్రవేశించారు. తెలుగు వాడైన ఘంటసాల కొంతమేరకు గానం చేసిన భగవద్గీతను సంపూర్ణం గా గానం చేసి, ఆయనకు అంకితమిచ్చి గురు ఋణం చెల్లించుకున్నారు. ‘భగవద్గీత జీవన గీత – మరణ గీత కాదు.’అన్న నినాదం తో సాగుతున్న గంగాధర శాస్త్రి కృషిని శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామి, దివంగత రాష్ట్రపతి డా II ఏ పి జె అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్రమోడీ, శ్రీ రాంనాథ్ కోవింద్ వంటి వారు ప్రశంసించారు. గతం లో – గీత ద్వారా గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ తో సత్కరించింది.

నకిరేకల్ లో గంగాధర శాస్త్రి గారి గీతా గాన ప్రవచనం…

“మనం చేసే కర్మలు ధర్మబద్ధమైనవి అయి ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ అనుగ్రహం సంపూర్ణం గా ఉంటుంది. ధర్మ మార్గం లో ఉన్న ఏ భక్తుడు అనన్య భక్తి తో పరమాత్మ ను ధ్యానిస్తాడో అట్టి వారి యోగక్షేమాలు తానే చూసుకుంటానని పరమాత్మ చెబుతాడు. ఇక్కడ యోగం అంటే పొందని దానిని పొందుట, క్షేమం అంటే పొందినదానిని రక్షించుట అని ఆది శంకరుల భాష్యం. ఏ దేవతను ఆరాధించినా అది తనను ఆరాధించినట్టేనని చెబుతూ ఆయా దేవతలు తన అనుగ్రహం వల్లనే ఫలాలను ఇస్తారని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. తిరగలిలో దగ్గరగా ఉండే గింజలు నలగవు. అలాగే పరమాత్మకు దగ్గరగా ఉండే వానికి నాశనము లేదు. ‘న మే భక్త: ప్రణశ్యతి’ అన్నది పరమాత్మ వాక్యం… గీతను బాల్య దశనుండే పిల్లలకు నేర్పించండి. ఈ దేశం గొప్పతనం, ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత రూపం లో పిల్లలకు నేర్పించండి. ఇలా తెలియ చేయకపోవడo వల్లే పిల్లలు తల్లి తండ్రులను, ఈ దేశాన్ని వదిలేసి కేవలం డబ్బుకోసం ఇతర దేశాల వెంట పరుగెడుతున్నారు. ఉత్తమ జీవన విధానాన్ని, ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది భగవద్గీత. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం గా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది భగవద్గీత. భగవద్గీతను ప్రచారం చేయడమంటే మతాన్ని ప్రచారం చెయ్యడమని కాదు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని ప్రచారం చెయ్యడం…! మానసిక, శారీరక, వాచిక ఆరోగ్యాలను కాపాడి ఉన్నతమైన మార్గాన్ని చూపుతుంది గీత.. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి… నల్గొండ జిల్లా నకిరేకల్ లోని షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రాంగణం లో (29.4. 2023) ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. భగవద్గీత శ్లోకాలు పఠించిన చిన్నారులను, వారికి శిక్షణనిచ్చిన గురువు శ్రీమతి సుమలత ను ఆశీర్వదించారు. తమకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీ రాంబాబు, తులసి దంపతులకు, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేసారు. ట్రస్టు చైర్మన్ శ్రీ కోసం లింగయ్య, సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.

స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీతా ప్రచారమే లక్ష్యం గా భారత దేశం లోని హైదరాబాద్ లో స్థాపించిన ‘భగవద్గీతా ఫౌండేషన్’ కు అనుబంధం గా అమెరికా లోని న్యూజెర్సీ లో ‘గీతా ఫౌండేషన్’ స్థాపనకు మూల కారకుడైన శ్రీ రమేష్ అనుమోలు ను భగవద్గీతా గాన,ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి సత్కరించారు. అనంతరం అమెరికా లో భగవద్గీతా వ్యాప్తి గురించి చర్చించారు.