‘మార్గశిర శుద్ధ ఏకాదశి’ గీతా జయంతి సందర్భం గా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ హైదరాబాద్ లోని రామంతపూర్ లో అన్నదాన కార్యక్రమం (24.12.2023) నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఈ సందర్భం గా తన కుటుంబ సభ్యులతో పోచమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు జరిపి, గోసేవ నిర్వహించారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి – ఫౌండేషన్ సభ్యులు, ఫౌండేషన్ అడ్వకసి చీఫ్ శ్రీ ఆజాద్ బాబు లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.