Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

ఇది మతం కాదు ధర్మం .. మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. ధర్మం అంటే సార్వజనీనమైనది. అందుకే పాశ్చాత్యులకు సైతం గీత స్ఫూర్తినిచ్చింది…

ఇది మతం కాదు ధర్మం .. మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. ధర్మం అంటే సార్వజనీనమైనది. అందుకే పాశ్చాత్యులకు సైతం గీత స్ఫూర్తినిచ్చింది…

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

ఆయన పేరు డాక్టర్ అజీమి …. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హృద్రోగ నిపుణులు ( Cardio Vascular Specialist )..! ప్రస్తుతం అమెరికా లోని శాండియాగో లో ‘SHARP HEALTHCARE’ ద్వారా సేవలందిస్తున్నారు. తన 12 ఏళ్ల వయసులో ఆఫ్ఘనిస్తాన్ నుండి శరణార్థి గా అమెరికా కి వచ్చి స్థిరపడి స్వయం కృషి తో ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడి గా ఎదిగిన డాII నస్సీర్ అజీమీ ఇటీవల ఒకరోజు …. ( ఆగష్టు 13,2023 ) ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని శాండియాగో ( కాలిఫోర్నియా-అమెరికా) లోని ఒక కాఫీ డే లో చూడడం తటస్థించింది. ఆ సమయం లో గంగాధర శాస్త్రి తో పాటు అప్పటి ‘గీతా ఫౌండేషన్’ అధ్యక్షులు, ప్రముఖ Anaesthetist డాII రాధాకృష్ణ తమిరిసా, గంగాధర శాస్త్రి అభిమాని శ్రీ ప్రవీణ్ పురాణం ఉన్నారు. ఈలోగా తన తన సహచర వైద్యులు డా II అజీమి, మరొక phisician ఆష్ కాస్తో లను గమనించిన డాII రాధాకృష్ణ (ఈ ముగ్గురూ ఒకే ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు) శ్రీ గంగాధర శాస్త్రి ని తన గురువు గా పరిచయం చేశారు. కాసేపు గంగాధర శాస్త్రి తో మాట్లాడిన ప్రభావం తో .. ‘మీ నుంచి నా ఛానల్ కి భారతీయ ఆధ్యాత్మికత పైన ఒక ఇంటర్వ్యూ ఆశిస్తున్నాను..’ అని కోరారు డాII అజీమి…! ఆ మరురోజే ప్యాలస్ ను తలపించే అజీమి స్వగృహం లో ఇంటర్వ్యూ జరిగింది. కృష్ణ ప్రార్ధనా శ్లోక గానం తో ప్రారంభించిన శ్రీ గంగాధర శాస్త్రి – హిందూయిజం పైన, భగవద్గీత పైన అజీమి అడిగిన అనేక ప్రశ్నలకు సంతృప్తి కరమైన సమాధానాలిచ్చారు.” భగవద్గీత – మతాలు ఆవిర్భవించని కాలం లో ప్రపంచం లోని ప్రతి మానవుడినీ ఉద్దేశించి బోధించబడిన ఉత్తమ జీవన విధాన మార్గదర్శిని.. ఇది మతం కాదు ధర్మం .. మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది. ధర్మం అంటే సార్వజనీనమైనది. అందుకే పాశ్చాత్యులకు సైతం గీత స్ఫూర్తినిచ్చింది. అమెరికా లోని న్యూజెర్సీ లో ఉన్న శాటన్ హాల్ యూనివర్సిటీ లో MBA విద్యార్థులకు A JOURNEY OF TRANSFERMATION పేరుతో గీతను బోధిస్తున్నారు. గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. నువ్వు చేసే కర్మను బట్టి ఫలితం ఉంటుంది. తదుపరి జన్మ కూడా ఈ జన్మలో చేసిన కర్మ ను బట్టి ఉంటుంది.. ఏ పని చేసినా ధర్మబద్ధం గా, త్రికరణ శుద్ధి గా, నీ చేతుల్లోలేని ఫలితాన్ని – దైవానికి వదిలిపెట్టి , భవబంధాలకు అతీతంగా, నిస్వార్ధ బుద్ధితో, లోక శ్రేయస్సు కోసం చెయ్యాలని గీత చెబుతుంది. ‘ప్రాణులంతా ఒక్కటే.. ప్రాణులందరికీ ఒక్కడే..’ అన్నది గీతా సారాంశం .. భారతదేశం అన్నిమతాలనూ గౌరవించడానికి కారణం ‘గీత’ భావజాలమే… గీత సర్వ ప్రాణులనూ సమదృష్టి తో చూడమని చెబుతుంది. ఇది మానవీయ గ్రంథం .. సిద్ధాంత గ్రంథం.. గీత విషయం లో ఎవరికి ఏ సందేహం వచ్చినా వివరణాత్మకం గా, అందరికీ అంగీకారయోగ్యం గా సమాధానం చెప్పవచ్చు. ప్రపంచం లో ఇతర గ్రంథాలు దైవ దూతలు, దైవ కుమారులు గా ప్రకటించుకున్న వారి చేత చెప్పబడితే… భగవద్గీత – తానే దైవం గా ప్రకటించుకుని, అందుకు నిదర్శనం గా విశ్వరూపాన్ని దర్శింపజేసిన కృష్ణ పరమాత్మ చేత బోధించబడింది. మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ ఇందులో చర్చించబడ్డాయి. భగవద్గీత – దేశ, కాల, జాత్యాదులకు, వయో వర్గ లింగ విభేదాలకు అతీతమైన ‘కాలం చెల్లని’ ఒకే ఒక్క దైవ గ్రంథం..గీతా పఠనం, ఆచరణ మానసిక వత్తిడిని దూరం చేసి ఇతరులకు స్పూర్తిని అందించే లక్ష్యానికి చేరుస్తుంది. ప్రపంచం లో ని అన్ని మతాలూ జీవన విధాన మార్గాలే… కానీ హిందూమతం మాత్రం సర్వజనమోదయోగ్యమైన ఉత్తమజీవన విధాన మార్గం.” అంటూ అనేక విషయాలను సహేతుకం గా వివరించారు శ్రీ గంగాధర శాస్త్రి. ‘శాస్త్రీ జీ’ అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించిన డాII అజీమి – ఇంటర్వ్యూ పూర్తి అయ్యే సమయానికి ..’You are my Guruji..!’ అంటూ గంగాధర శాస్త్రి కి తన భార్యా పిల్లలను పరిచయం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఇంటర్వ్యూ తో హిందూయిజం భావజాలం పైన తన గౌరవం వెయ్యి రెట్లు పెరిగిందని, తదుపరి అమెరికా పర్యటనలో తమ సంస్థ లో పనిచేసే డాక్టర్స్ మిత్రులకు గీతా సందేశం అందించాలని అజీమీ గంగాధర శాస్త్రి ని కోరారు. మానవత్వం సేవా విశ్వరూపం ప్రదర్శించాల్సిన కరోనా సమయంలో అన్ని వ్యవస్థలూ పతనావస్థకు చేరుకోగా మెడికల్ వ్యవస్థలు, సంస్థలు, ఆసుపత్రులు మాత్రం ఈ అవకాశాన్ని వ్యాపారం గా మార్చుకోవడం అమానుషమని, దీనికి కారణం మానవీయతను పెంపొందించే ఆధ్యాత్మిక పునాది లేకపోవడమేనననీ అన్న గంగాధర శాస్త్రి అభిప్రాయం తో డాII అజీమి ఏకీభవించారు. అయితే ప్రాణాలకు తెగించి డాక్టర్లు చేసిన సేవలకు మాత్రం సకల మానవాళి ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే అని గంగాధర శాస్త్రి అన్నారు. గంగాధర శాస్త్రి తో డా ఆష్ కాస్తో (క్రిస్టియన్) డా నస్సిర్ అజీమి (ముస్లిం) ఫోటో దిగినప్పుడు ‘Now we’ll be called as RAM -ROBERT- RAHIM’ అంటూ చమత్కరించారు గంగాధర శాస్త్రి.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *