‘వంగూరి ఫౌండేషన్’ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెంరాజు, శ్రీ మల్లిక్ పుచ్చా, శ్రీ నరేంద్ర యరబర్ల ల ఆధ్వర్యం లో హ్యూస్టన్ లోని తాజ్ రెసిడెన్సీ క్లబ్ హౌస్ లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి చేత ‘భగవద్గీత- జీవన విలువలు’ అనే అంశం పై గాన ప్రవచనం ( 20.7.2023) ఏర్పాటు చేశారు. శ్రీ వంగూరి చిట్టెంరాజు స్వాగత వచనాలతో గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా, శ్రీ రవి తమిరిసా పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. శ్రీ సత్య గుమ్మడి దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన దివంగత సినీ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు తనయులు శ్రీ జయ ఎస్. గుమ్మడి, శ్రీమతి పద్మశ్రీ ముత్యాల, శ్రీ కోనేరు ఆంజనేయులు, శ్రీ శౌరి నందగిరి లతో పాటు ప్రతి ఒక్కరు శ్రీ గంగాధర శాస్త్రి గాత్రానికి, గానానికి, గీతా ప్రవచనానికి పరవశులమయ్యామంటూ
అభినందనలు తెలిపారు.ఈ సందర్భం గా తనకు భక్తి పూర్వక ఆత్మీయ ఆతిధ్యం అందించడం తో పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న శ్రీ నరేంద్ర యరబర్ల దంపతులకు గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.