భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార నిమిత్తం అమెరికా లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగం గా వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజుల పాటు ( జులై 13,14,15 ) నిత్య జీవితానికి భగవద్గీత అనుసంధానాన్ని వివరిస్తూ చేసిన గాన ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. గీతా ప్రవచనం తో పాటు మధ్య మధ్య లో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు గానం చేస్తూ, భక్తులతో భగవద్గీత శ్లోకాలను పఠిoప చేస్తూ, భజనలు చేయించడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అనేకమంది ప్రేక్షకులు ఆనందాశ్రువులతో తమ సంతోషాన్ని శ్రీ గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. గంగాధర శాస్త్రి ‘గీత’ పై ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ చేపట్టిన ప్రాజెక్టులను వివరించి చేయూత కోరారు. కొందరు భక్తులు వారి గృహాలకు ఆహ్వానించి సత్కరించారు. చివరి రోజున దేవాలయ నిర్వాహకులు శ్రీమతి సాయి, ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయ భాస్కర పరాశర దీక్షితులు, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి షీలా, మోహన్ వార్తకవి, మాధవి, రాంప్రసాద్ సుంకర, కృష్ణకుమారి,రమేష్ కొలవేను,HTCC, Bothell ప్రధాన అర్చకులు శ్రీ వాసుదేవ శర్మ రావూరు తదితరులు డాII గంగాధర శాస్త్రి ని ఘనంగా సత్కరించారు.





All reactions: