Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి – అమెరికా లోని న్యూయార్క్ రాజధాని అయిన ఆల్బని లోని తెలుగు సంఘం ( ATA ) ఆహ్వానం మేరకు వెళ్లి, కొన్ని కార్యక్రమాలలో పాల్గొని భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని వివరిస్తూ గాన ప్రసంగాలు చేశారు.

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి – అమెరికా లోని న్యూయార్క్ రాజధాని అయిన ఆల్బని లోని తెలుగు సంఘం ( ATA ) ఆహ్వానం మేరకు వెళ్లి, కొన్ని కార్యక్రమాలలో పాల్గొని భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని వివరిస్తూ గాన ప్రసంగాలు చేశారు. ఈ నేపధ్యం లో ‘వినాయక చవితి’, మరికొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా – గీతా ప్రవచన కార్యక్రమానికి ఆహ్వానించి, తనకు ఆత్మీయ ఆతిధ్యం అందించినందుకు ‘ఆల్బని తెలుగు అసోసియేషన్’ అధ్యక్షులు శ్రీ వెంకట్ జాస్తి, శ్రీమతి అనురాధ దంపతులకు కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు అందించారు. అలాగే ATA సభ్యులు శ్రీ యుగంధర్, హర్షిత దంపతులను, శ్రీ రమణ అల్లెన, శ్రీమతి నీరజ దంపతులను, శ్రీ వెంకటేశ్ చెరుకుమల్లి దంపతులను కూడా అభినందించారు.

+22

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత…..

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత మారుమ్రోగింది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కి జై, జై తెలుగు తల్లి నినాదాలు మిన్ను ముట్టాయి … ‘తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) న్యూయార్క్’ వారి ఆహ్వానం మేరకు విశిష్ట అతిథి గా హాజరై (31.8. 2024)జ్యోతి ప్రకాశనం చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి సందేశం అందిస్తూ గీతా శ్లోకాలను గానం చేశారు. భగవద్గీతను ఈ దేశపు వాసులు కూడా గౌరవించారని చెబుతూ – న్యూ జెర్సీ లోని ‘శాటన్ హాల్ యూనివర్సిటీ’ లో MBA విద్యార్థులకు A JOURNEY OF TRANSFORMATION పేరుతో భగవద్గీతను పాఠ్యాంశం గా పెట్టడం, Apple కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన మరణానంతరం తన భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చిన వారికి భగవద్గీత పంచిపెట్టమని తనవారికి చెప్పడం తనను కదిలించిన విషయాలని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సందర్భం గా గీత లోని ‘యద్యదాచరతిశ్రేష్ఠః ‘ శ్లోకం తాత్పర్యం తో సహా గానం చేసి – ఇతరులకు స్ఫూర్తినిచ్చే స్థాయిలో ప్రతి ఒక్కడూ ఉత్తముడుగా ఎదగాలని ప్రపంచం లోని మానవులందరికీ సందేశం అందించే గీత మతాలకు అతీతమైన కర్తవ్య బోధ గా గుర్తించాలని గంగాధర శాస్త్రి అన్నారు. ఇది అమెరికా లోని తెలుగుసాంస్కృతిక సంఘాల చరిత్ర లోనే ఈ కార్యక్రమం అత్యంత అరుదైన ఘట్టమని, TIME SQUARE కూడలిలో తెలుగు కార్యక్రమానికి వేదిక లభించడం చారిత్రాత్మక ఘట్టమని గంగాధర శాస్త్రి అన్నారు. “దేవనాగర భాష, భారత దేశానికి మాతృ భాష అయిన సంస్కృతాన్ని అంతే స్పష్టం గా ఉచ్ఛరించగలిగే వాడు తెలుగు వాడొక్కడే… భారత దేశం లో పుట్టినందుకు కృష్ణ గీత, తెలుగు వాడిగా పుట్టినందుకు పోతన పద్యం మీ పిల్లలకు నేర్పించి మన ఉనికిని చాటుకోండి… కూటి కోసం బయట ఇంగ్లిష్ మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం మాతృభాష లోనే సంభాషించండి. కేవలం సాంస్కృతిక ప్రదర్శనల కే తెలుగుని పరిమితం చేయకండి. మీ పిల్లలకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పించి మన వారసత్వ సంపదను కాపాడండి. తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు వాడే మెచ్చుకుంటే అది గొప్పవిషయం కాకపోవచ్చు. కానీ కన్నడ సుష్పష్టం గా తెలిసిన శ్రీకృష్ణ దేవరాయలు సైతం తన ‘ఆముక్తమాల్యద’ గ్రంథం లో ‘దేశభాషలందు తెలుగు లెస్స…’ అని తెలుగు భాషను కీర్తించడం గొప్పవిషయo ..” అని చెబుతూ గంగాధర శాస్త్రి ‘తెలుగదేలయన్న’ పద్యాన్ని గానం చేశారు. తనను ఆహ్వానించిన TLCA అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్, ‘పద్మశ్రీ’ పురస్కృత డాII నోరి దత్తాత్రేయుడు, శ్రీ ఉదయ్ దొమ్మరాజు, శ్రీ సుమంత్ రామ్, డాII పూర్ణ ప్రసాద్ అట్లూరి, శ్రీ నెహ్రు, ఆల్బని తెలుగు సంఘం’ అధ్యక్షులు శ్రీ వెంకట్ జాస్తి తదితరులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసారు. పిన్నలు, పెద్దలు ఆంధ్ర, తెలంగాణ కు చెందిన వివిధ కళా రూపాలతో ప్రదర్శించిన నృత్యాలను అభినందిస్తూ, భారత దేశం నుండి తీసుకు రావలసిన అవసరం లేనంత గా స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. మాతృదేశానికి దూరమైనా మాతృ సంస్కృతి ని కాపాడుతున్నందుకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భం గా TLCA సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రిని సత్కరించారు.

0:00 / 6:50

+28

దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ లు ఆయన అవతార పరమార్ధం. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడుంటాడు…. గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి.

“చైత్ర శుద్ధ నవమి – శ్రీరాముడు పుట్టిన రోజు..!

శ్రావణ బహుళ అష్టమి- శ్రీకృష్ణ భగవానుని పుట్టిన రోజు ..!

మార్గశిర శుద్ధ ఏకాదశి – శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకొని ప్రపంచ మానవాళికి గీతను బోధించిన రోజు…

ఈ తిథుల ప్రాముఖ్యత పిల్లలకు చెప్పండి. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8 వ సంతానం .. జగద్గురువుగా మానవాళికి ‘ధర్మమార్గం’ అనే పాఠం బోధించడానికి విష్ణువు ఎత్తిన 8 వ అవతారం.. ఆయన ఎంటర్ టైనర్ కాదు. ఎన్లైటనర్ … కృష్ణాష్టమి నాడు కేవలం కృష్ణుడి గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకోవడం తో మన బాధ్యత తీరిపోదు.. ఆయన తత్త్వం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించాలి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ లు ఆయన అవతార పరమార్ధం. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడుంటాడు. కాబట్టి ఆయనను చేరుకోడానికి మార్గం ధర్మ మార్గం…! ఆ ధర్మాన్ని, మానవులు ఆచరించవలసిన కర్తవ్యాన్ని విశేషం గా వివరించి బోధించినదే భగవద్గీత… కృషుని తత్త్వం, ఆయన ఆలోచనా విధానం, ఆయన భావజాలం, ఆయన అవతార పరమార్ధం తెలుసుకుని ఆయన అనుగ్రహం పొందాలంటే భగవద్గీత చదవండి. అర్ధం చేసుకోండి.. ఆచరించండి…! శ్రీకృష్ణుడు..సర్వ ప్రాణులను సమదృష్టితో చూడమని చెప్పిన నిజమైన సోషలిస్టు… ఆత్మానందస్థితిని పొందడం ఎలాగో చెప్పిన యోగేశ్వరుడు… తన గురువైన సాందీపుని కుమారుడు మరణిస్తే, యమధర్మరాజు ని శాసించి, గురుపుత్రునికి ఆయుష్షుని ప్రసాదించి, గురుదక్షిణ చెల్లించిన కృతజ్ఞుడు ! జరాసంధుడి బారినుండి తన ప్రజలను రక్షించడానికి ద్వారకా నగరాన్ని నిర్మించిన రక్షకుడు… గీతోపదేశం ద్వారా ప్రపంచమానవాళి కి ఉత్తమ జీవన మార్గాన్ని బోధించిన జగద్గురువు..” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి. అమెరికా లోని న్యూయార్క్ రాజధాని ఆల్బని నగరం లోని హిందూ టెంపుల్ సొసైటీ లో జరిగిన శ్రీకృష్ణాష్టమి ( 26.8.2024 ) వేడుకలకు హాజరై ఆయన శ్రీకృష్ణ వైభవాన్ని వివరిస్తూ భక్తుల చేత కృష్ణ భజనలు చేయించారు. ఆలయo చైర్మన్ శ్రీ రమణ అల్లెన, శ్రీమతి నీరజ దంపతులు శ్రీ గంగాధర శాస్త్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు.

0:00 / 1:14

+32

‘దేవుడు దేవాలయం లో ఉన్నాడనుకోవడం – భక్తి.! ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం…! -గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి…

‘దేవుడు దేవాలయం లో ఉన్నాడనుకోవడం – భక్తి.! ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానం…! ఆ జ్ఞానాన్ని గీత ద్వారా తెలియజేస్తూ భక్తి, జ్ఞానాలను వివరిస్తాడు కృష్ణ పరమాత్మ..! ఆ పరమాత్మ కి ఎలాంటి వారంటే ఇష్టమో తెలుసుకోవాలంటే 12వ అధ్యయమైన భక్తి యోగం చదవండి. ధర్మ మార్గం లో నడిచేవాడు పరమాత్మకు ప్రీతిపాత్రుడు. ముఖ్యం గా ‘అద్వేష్టా సర్వ భూతానాం…, సంతుష్టస్సతతం యోగీ..’. అనే జంట శ్లోకాల ద్వారా – ఏ ప్రాణి పట్లా ద్వేషభావం ఉండకూడదనీ, మమతాహంకారాలు ఉండకూడదని, మైత్రి, కరుణ ఉండాలని, సుఖ దుఃఖాలలో సమబుద్ధి కలిగి ఉండాలని, క్షమ కలిగి ఉండాలని, ఉన్నదానీతో సంతోషం గా ఉండాలని, పరమాత్మ చింతన ఉండాలని, మనో నిగ్రహం, దృఢ నిశ్చయం కలిగి ఉండి మనోబుద్ధులు పరమాత్మకు అర్పించిన భక్తుడే ఆయనకు ప్రీతి పాత్రుడని పరమాత్మ చెబుతాడు. అడిగినవన్నీ ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి ఏమి అడగాలో చెబుతాడు గురువు. దేవుడు, గురువు ఇద్దరూ కలిస్తే – జగద్గురువైన కృష్ణపరమాత్మ…! భగవద్గీత హిందువులను మాత్రమే ఉద్ధరించడానికి చేసిన ఉపదేశం కాదు. యావత్ మానవాళి కి ఉపయోగపడే జీవన సందేశం.’ అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి… అమెరికా లో, న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బని లోని ఆల్బని తెలుగు అసోసియేషన్ (ATA ), హిందూ టెంపుల్ సొసైటీ సంయుక్త నిర్వహణలో- తమ సాంస్కృతిక కార్యక్రమాల చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేవిధంగా, హిందూ టెంపుల్ సభాసదనం లో ఏర్పాటు చేసిన ( 24. 8. 2024) తొలి సంపూర్ణ ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి పాల్గొని స్ఫూర్తి దాయకం గా గీతా గాన ప్రవచనం చేశారు. సాక్షాత్తు తాను దైవం గా ప్రకటించుకుని, దాన్ని విశ్వరూప ప్రదర్శన ద్వారా నిరూపించుకుని కర్తవ్యోప దేశం చేసినందువల్ల ‘భగవద్గీత’ ప్రపంచం లోనే ఏకైక దైవగ్రంథం గా పేరుగాంచిందనీ, ఇది మతాలకు అతీతమైన జీవితపాఠమని, గీత నేర్చుకునే రాత మార్చుకున్నట్టేనని గంగాధర శాస్త్రి అన్నారు. గీతను retirement గ్రంథం గా చూడవద్దని, దీనిని పఠనా గ్రంథం గా కాక ఆచరణ గ్రంథం గా భావించాలని, బాల్యదశనుండే తల్లి తండ్రులు పిల్లలకు నేర్పించాలని, దీనివల్ల స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చని, మానసిక వత్తిడి లేని, ఆరోగ్యకరమైన ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని అన్నారు.కర్మ మాత్రమే మనచేతులలో ఉందని, ఫలితం పరమాత్మ చేతిలో ఉందని భావిస్తే మానసిక వత్తిడి కి తావుండదని గంగాధర శాస్త్రి అన్నారు. బహిర్ముఖుడికి సుఖం, అంతర్ముఖుడికి శాంతి లభిస్తాయని అన్నారు. ఆయన విశ్వరూప సందర్శన యోగ ఘట్టాన్ని తాత్పర్య సహితం గా కనులకుకట్టినట్టుగా గానం చేస్తున్నప్పుడు ప్రేక్షకులు లేచినిలబడి కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు, భక్తిప్రపత్తులతో తనకు ఆతిధ్యం ఇచ్చినందుకు శ్రీ వెంకట్ జాస్తి , శ్రీమతి అనురాధ దంపతులకు గంగాధర శాస్త్రి దుశ్శాలువతో సత్కరించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ATA సభ్యులు శ్రీ యుగంధర్ రెడ్డి, శ్రీ నారాయణ గడ్డం, శ్రీ సత్య, శ్రీ కమల్ గోవిందరాజులు, శ్రీ రాజశేఖర్, హిందూ టెంపుల్ సొసైటీ సభ్యులు శ్రీ రమణ ఆకెళ్ళ, శ్రీమతి నీరజ, శ్రీ శివ బండారు,శ్రీ శ్రీనివాస్ ఉప్పుటూరి, శ్రీ శ్రీనివాస్ మంగ, శ్రీ రామిరెడ్డి, కార్యక్రమ సమన్వయ కర్త ఎల్. విశ్వతేజ లకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. కార్యక్రమ ఏర్పాటుకు ముఖ్య కారకుడైన శ్రీ ఉదయ్ దొమ్మరాజు ను దుశ్శాలువా తో సత్కరించారు. ఈ సందర్భం గా ‘ఆల్బని తెలుగు అసోసియేషన్’, హిందూ టెంపుల్ సభ్యులంతా శ్రీ గంగాధర శాస్త్రి ని ‘జీవన సాఫల్య పురస్కారం ‘( Life Time Achievement Award ) తో సత్కరించారు. Salvatore Labaro అనే అమెరికన్ హిందూయిజం పట్ల అభిమానాన్ని పెంచుకుని తన పేరును అనంత దీక్షిత్ గా మార్చుకుని సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న నేపథ్యం లో – ఈ కార్యక్రమానికి హిందూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి గీతా గాన ప్రవచనాన్ని 3 గంటలపాటు విని బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకోవడo విశేషం….!

+77

అమెరికా లోని సిన్సినాటి లో శ్రీమాన్ డాII వేదాంతం రామానుజాచారి గృహం లో (18.8.2024) ఏర్పాటుచేసిన గీతా సత్సంగం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం….

‘కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః I అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతిః II’ అనిచెబుతూ కృష్ణ పరమాత్మ కర్మను ఎలా ఆచరించాలో చెప్పాడు. వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడుతున్నాయని, చేయదగిన కర్మను విహిత కర్మ అని, చేయరాని కర్మను వికర్మ లేదా నిషిద్ధ కర్మ అని, ఏ పని చేయకుండా ఉండే సోమరిపోతు స్థితిని అకర్మ అని పరమాత్మ చెబుతూ, ఏ పని చేసినా త్రికరణ శుద్ధి గా చేయాలనీ, ధర్మబద్ధంగా చేయాలని, ఫలితం దైవానిదని భావించి చేయాలనీ, నిస్వార్ధం తో, లోకహితం కోసం కర్మలనాచరించాలని, నైపుణ్యం తో చెయ్యాలని ఉపదేశిస్తాడు. భగవద్గీత మతాలకు అతీతమైన కర్తవ్య బోధ, సర్వమానవాళికీ ఆచరణీయ గ్రంథం..” అన్నారు గీతా, గాన, ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాII ఎల్.వి.గంగాధర శాస్త్రి. అమెరికా లోని సిన్సినాటి లో శ్రీమాన్ డాII వేదాంతం రామానుజాచారి గృహం లో (18.8.2024) ఏర్పాటుచేసిన గీతా సత్సంగం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం చేశారు. ‘పాశ్చాత్యులను సైతం విశేషం గా ప్రభావితం చేసిన దైవ గ్రంథం భగవద్గీత … ఇది రిటైర్మెంట్ గ్రంథం కాదు. వైరాగ్య గ్రంధమూ కాదు. ఇది దేశకాలజాత్యాదులకు, కులమత వర్గవిభేదాలకు తావులేకుండా, సర్వకాల సర్వావస్థలలోను పఠించి, అర్ధం చేసుకుని, ఆచరించి తరించవలసిన జీవన గీత. భారత దేశానికి దూరమైనా భారతీయతకు దూరం కాకండి. భారత దేశ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించండి. పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యం తో, లక్ష్యం వైపునకు సాగమనే సందేశాన్ని భగవద్గీత ఇస్తుంది. నువ్వు చేసే పాప పుణ్యాలతో పరమాత్మ కు సంబంధం లేదు. ఆ రెండూ నువ్వే అనుభవించాలని, సర్వ ప్రాణులయందు సమదృష్టి కలవాడే పండితుడని గీత చెబుతుంది. ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టి ధర్మ మార్గం లో కర్మలను ఆచరించే వానికి పాపపుణ్యాలు అంటవని పరమాత్ముడు ఉపదేశిస్తాడు. కృష్ణుడు బోధించిన గీతను అర్జునుడు అర్ధం చేసుకుని, ఆచరించి, యుద్ధం లో విజయుడైనప్పుడు – ఆ గీత మనకీ విజయం చేకూరుస్తుందనడం లో సందేహం లేదు.మానసిక వత్తిడి లేని ప్రశాంత జీవనానికి భగవద్గీత దోహదం చేస్తుంది.” అన్నారు గంగాధర శాస్త్రి. ఈ సందర్భం గా విశ్వరూప సందర్శన ఘట్టాన్ని తన గాత్రం లో గీతా బంధువుల కళ్లముందుంచి, వారి హృదయాలను చెమరింపజేశారు. తమ భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా చేస్తున్న గీతా ప్రచార యజ్ఞం లో అందరూ పాల్గొని, చేయూతనివ్వాల్సిందిగా అభ్యర్ధించారు. ఈ సందర్భం గా డాII వేదాంతం రామానుజాచార్యులను బ్రహ్మశ్రీ డా ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీత గ్రంథం బహూకరిoచి, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సత్సంగం లో పాల్గొన్న కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సుహాసిని, శ్రీ కృష్ణచైతన్య దంపతులను గంగాధర శాస్త్రి సత్కరించారు. తొలుత శ్రీ చంద్రశేఖర్ దీనన్, శ్రీమతి సునీత, శ్రీ శ్రీనివాస్ వేదాంతం లు శ్రీ గంగాధర శాస్త్రి ని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి ఆహ్వానించారు.

+57

ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలుగుతూ, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడమే వైవాహిక జీవిత పరమార్థం…గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి.

“వివాహాలు అందరూ చేసుకుంటారు. కానీ వైవాహిక జీవితాన్ని ఆదర్శవంతం గా సాధించేవారు అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. వారిలో మీరుండాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలుగుతూ, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడమే వైవాహిక జీవిత పరమార్థం.. ప్రపంచం లోనే హిందూ కల్యాణ సంస్కృతి అత్యుత్తమమైనది. ఆదర్శవంతమైనది. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో పంచభూతాల సాక్షిగా జరుగుతున్న ఈ నిశ్చితార్ధ కార్యక్రమం – సాంప్రదాయ విలువలను రామినేని కుటుంబo ఎంత గౌరవిస్తుందో తెలియ జేస్తోంది. భవిష్యత్తులో మీ దంపతులు కూడా ఈ విలువలను కాపాడుతూ సీతారాముల అనుగ్రహం తో ఆదర్శదంపతులై చరింతురు గాక ..!” అంటూ కాబోయే దంపతులను ఆశీర్వదించారు గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. అమెరికా లోని సిన్సినాటి లో జరిగిన (17.8.2024) చిII లII సౌII శ్రియ, చిII సంతోష్ ల నిశ్చితార్ధ కార్యక్రమానికి ఆయన హాజరై – గీతా గాన ప్రవచనం ద్వారా ఉత్తమ జీవితాన్ని వివరించారు. దంపతులు కాబోతున్న జంటకు భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని వివరించే కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం పట్ల అతిథులందరూ హర్షం వ్యక్తం చేశారు. “గీతలో ‘యద్యదాచరతిశ్రేష్ఠః’ అని పరమాత్మ చెప్పినట్టు – తరువాత తరాలవారికి ‘ఆదర్శవంతమైన దాంపత్యజీవితమంటే ఇది’ అనే సందేశాన్ని మీ దంపతులు ఇవ్వాలి. ‘సఖ్యం సాప్తపదీనాం’ – ఏడడుగులు కలిసి నడిచినా, ఏడూ మాటలు కలిసి మాట్లాడుకున్నా విడదీయరాని అనుబంధం ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు. ఆ అనుబంధమే ఈ జన్మలో మీ ఇద్దరినీ ఒకటి చేయబోతోంది. ప్రేమ అయినా, స్నేహం అయినా, దాంపత్యం అయినా ‘అహం’ చొరబడకుండా ఉంటేనే నిలబడుతుంది. సీతా రాములనుంచి ఏ దంపతులైనా తెలుసుకోవలసింది ఒక్కటే….. అధిక దుఃఖమైన ఆనందమైన / కలసి చెమ్మగిల్లు కనులు రెండు / ఆలుమగల జంట అట్లున్నయప్పుడే / సౌఖ్య జీవనమ్ము సాధ్యమగును.. పెళ్లి జరుగుతున్నప్పుడు మిగతా విషయాల పైన దృష్టి పెట్టకుండా వేదజ్ఞులు చెప్పే మంత్రాల పైన దృష్టి పెడితే జీవిత పరమార్థం అర్ధమవుతుంది. వివాహం సామాజిక శ్రేయస్సుకై చేసే ఒక మహా యజ్ఞం. జీవితానికి పూర్ణత్వం లభించేది పెళ్లిపేరుతో స్త్రీపురుషులు ఒకరి జీవితం లోకి ఒకరు అడుగుపెట్టాకే.. కన్యాదాత వరుడిచేత – ‘ధర్మార్ధకామమోక్షాలలో నేను ఈమెను అతిచరించను’ అని చేయించే వాగ్దానాన్ని వరుడు ఎన్నటికీ మరువకూడదు. ‘వాగర్థావివసంపృక్తౌ’ అన్నట్టు దంపతులు వాక్కు అర్ధాల వలే కలిసి కలిసి ఉండి మీ కుటుంబ ప్రతిష్ఠ ను నిలబెట్టoడి. మీ సంతానాన్ని కూడా ఆధ్యాత్మిక సంస్కారం తో పెంచండి. భారతీయ సనాతన ధర్మాన్ని, సంసృతిని కాపాడండి. భవిష్యత్తులో మీ బిడ్డలతో మీ విలువైన సమయాన్ని వీలైనంతసేపు గడిపి మీ ఆలోచనల సంస్కారాన్ని వారికి తెలియజేయండి. ఆ లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణి హిరణ్యగర్భులు, శచీపురందరులు, అరుంధతీ వశిష్టు లు, సీతారాములు మీ జీవితాన్ని ఎల్లప్పుడూ రక్షింతురు గాక…! ఆదర్శవంతమైన జీవితం గడిపి కీ.శే డాII రామినేని అయ్యన్న చౌదరి గారు గొప్ప పేర్లు పెట్టి సమాజానికి అందించిన పంచపాండవుల్లాంటి కుమారులు శ్రీ ధర్మప్రచారక్, శ్రీ సత్యవాది, శ్రీ బ్రహ్మానంద, శ్రీ వేదాచార్య, శ్రీ హరిశ్చoద్ర, కుమార్తె శ్రీమతి శారద లను వారు చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవను హృదయపూర్తి గా శత నమస్సులతో అభినందిస్తున్నాను.” అంటూ ఆశీర్వదించారు శ్రీ గంగాధర శాస్త్రి. అతిథుల కోరికపై ఆయన ‘పిడికిట తలంబ్రాల పెళ్లికూతురు’ అనే అన్నమయ్య కీర్తనను ఆలపించారు. అనంతరం రామినేని కుటుంబం బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ని పట్టు వస్త్రాలతో ఘనం గా సత్కరించారు.

+39

‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సినారే 93 వ జన్మదినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో (23.7.2024)ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి…

“తెలుగు భాష అభ్యున్నతికే తన జీవితాన్ని అంకితం చేసి, తన రచనల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి, తన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేనంత శిఖర స్థాయి లో అక్షరానికి సేవలందించిన మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య డాII సి. నారాయణ రెడ్డి గారు… ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమను పంచేదే తల్లి అయితే – జ్ఞాన దృష్టి తో చూడగలిగితే అటువంటి తల్లులు ప్రకృతి నిండా ఉన్నాయని చెబుతూ అందుకు ఉదాహరణగా – కణ కణ లాడే ఎండకు శిరసుమాడినా మనకు తన నీడను అందించే చేట్టే అమ్మ / చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ … అంటూ ‘ప్రేమించు’ సినిమాకి పాట రాస్తూ అమ్మ విలువ తెలియజేశార” ని గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి అన్నారు. ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సినారే 93 వ జన్మదినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో (23.7.2024)ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొని ఆయన గాన ప్రసంగం చేశారు. సినారే రాసిన ఖండ కావ్యాలు, తెలుగు గజళ్ళు, ద్విపదలు, ప్రపంచపదులు, సినిమా పాటలు, లలిత గీతాలతో సమాజం పైన ‘ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం’ లాంటి పరిమళాలు జల్లిన మహాకవి సినారె – అని అన్నారు. ఆయనను ఈనాటి కవులు స్ఫూర్తి గా తీసుకోవాలని, ధనం సంపాదించుకునే అవకాశం ఉన్నా ద్వంద్వార్థాల సాహిత్యం జోలికి ఎన్నడూ పోని, ధర్మం తెలిసిన నిష్కామ కర్మయోగి అని, విలువలతో కూడిన, స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపారని అన్నారు. సినారే ఎంతటి కవో అంతటి సంగీతజ్ఞుడు కూడా అన్నారు. కాబట్టి ఆయన పేరుతో శ్రీ ఓలేటి పార్వతీశం కు, శ్రీమతి ఎం. ఎం. శ్రీలేఖకు అవార్డు ఇవ్వడం సముచితమని అందుకు సంస్థ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ సుధాకర్ ను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాననీ గంగాధర శాస్త్రి అన్నారు. భారత దేశం లో ఏ మహిళా సంగీత దర్శకురాలూ చేయనివిధం గా 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఎం. ఎం. శ్రీలేఖ పద్మశ్రీ పురస్కారానికి అర్హురాలని ఆయన అన్నారు. సంగీత దర్శకురాలిగా ఆమె, నేపధ్య గాయకుడిగా తాను ‘నాన్నగారు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యామని గంగాధర శాస్త్రి అన్నారు.

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే…

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే… ఇదే భగవద్గీతా ఆచరణ ఫలితం …! ఇస్తే వద్దన్న వాడు శ్రీరాముడు… నాకివ్వమని అడిగిన వాడు శ్రీకృష్ణుడు… యత్కరోషి యదశ్నాసి (9-27) అంటూ నువ్వు చేసే కర్మము, తినే ఆహారము, హోమము చేసే హవ్యము, అర్పించే దానము ఆచరించే తపస్సు, సర్వ కర్మల ఫలితం నాకే సమర్పిస్తే మోక్షం పేరుతో నన్నే చేరతావు.. అంటాడు కృష్ణ పరమాత్మ .. ఇక్కడ అడగడం అంటే ఆయనకు అవసరమై కాదు. మనలోని అహంకారాన్ని దునుమాడి మోక్షం ఇవ్వడానికి !!! వామనుడు బలిచక్రవర్తి అహంకారాన్ని అడిగాడు … మోక్షం ఇవ్వడానికి … అలాగే శ్రీకృష్ణుడు సమస్త కర్మఫలాన్ని తనకు సమర్పించమని అడుగుతాడు ఇదీ మోక్షం ఇవ్వడానికే… !!! ” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి..

గురుపౌర్ణమి సందర్భం గా (21.7. 2024) మణికొండ (హైదరాబాద్) లోని కోదండ రామస్వామి దేవాలయం లో ‘గీతా సద్గురు’ శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యం లో జరిగిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి పాల్గొని నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకతపై గాన ప్రవచనం చేశారు. గీత మతాలకు అతీతమైన గ్రంథమని, ఇది మత గ్రంథం కాదనీ, మానవీయ గ్రంథమనీ ఆయన అన్నారు. గీతను బాల్య దశ నుండే నేర్పించాలని, భగవద్గీతను చదివి అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేస్తే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని చూడవచ్చని అన్నారు. “ఇది ధర్మ ప్రబోధ గీత, కర్తవ్య బోధ, వ్యక్తిత్వ వికాస గ్రంథం, నైతిక విలువలను పెంపొందించే ఉపదేశం…. సర్వమానవులకు ఆశాదీపం… సాధకులకు కల్పవృక్షం … గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే … తల్లి తండ్రులారా … బాల్యదశనుంచే మీ పిల్లలకు ఆధ్యాత్మికతను పరిచయం చేయండి.రామాయణ, మహాభారతాలు వారికి పరిచయం చేయండి. ఇవి వారికి కొండంత మానసిక స్థైర్యాన్నిస్తాయి. నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి.ఇవాళ సోషల్ మీడియా లో కనిపించే అనేక అనారోగ్యకరమైన వీడియోలకు, ఆ వీడియోల కింద సంస్కారం లేని కామెంట్లకు కారణం … వారి తల్లితండ్రులు విలువలు చెప్పి పెంచకపోవడమే… జీవితం కేవలం ధనార్జకోసమే అన్నట్టు గడుపరాదు… డబ్బు సుఖాన్నిస్తుంది కానీ శాంతినివ్వదు. సత్కర్మ, దుష్కర్మ, పాపం,పుణ్యం, ధర్మo,అధర్మం, దైవం, మోక్షం, జ్ఞానం, అజ్ఞానం, ఇంద్రియాల వ్యాపారం, త్రిగుణాలు, యజ్ఞం, దానం, తపస్సు, ధ్యానం, యోగం… ఇలాంటి పదాలన్నిటి అర్ధాలను బాల్యదశనుండే పిల్లలకు చెప్పండి… ముఖ్యం గా ఈ బాధ్యత తల్లులదే.. ఎందుకంటే బిడ్డకి తల్లే మొదటి గురువు కాబట్టి…. కేనోపనిషత్తు చెప్పినట్టు – న చేదిహావేదీన్మహతీ వినష్టిః … ఏది ఈ జన్మలో తెలుసుకొనకపోతే గొప్ప నష్టం జరుగుతుందో అదే ఉపనిషత్తు వివరిస్తుంది … ఆ సర్వోపనిషత్తుల సారమే భగవద్గీత …! ” అన్నారు గంగాధర శాస్త్రి. భారత దేశం లో హిందువులు 85 శాతం ఉన్నప్పటికీ వారిలోని హిందుత్వం బలం గా లేకపోవడం దురదృష్టం అని అన్నారు. క్రైస్తవ పాఠశాలల్లో బైబిల్ నేర్పుతున్నప్పుడు… హిందువులు స్థాపించే విద్యాలయాలలో భగవద్గీత ను నేర్పించక పోవడం అత్యంత దురదృష్టం అన్నారు. హిందువులలో బలమైన ఐక్యత ఉండివుంటె ఈ పాటికే గీత జాతీయ గ్రంథం అయ్యుండేదని, ప్రతి పాఠశాలలోనూ పాఠ్యాంశం గా అయ్యుండేదని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి హిందువూ గీతా ప్రచారకులు కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి గా నియమితులైన సందర్భం గా శ్రీ జి. కిషన్ రెడ్డి ని – గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, శ్రీ ఆజాద్ బాబు తో మర్యాదపూర్వకం గా కలిసి అభినందించారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి గా నియమితులైన సందర్భం గా శ్రీ జి. కిషన్ రెడ్డి ని – గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, శ్రీ ఆజాద్ బాబు తో మర్యాదపూర్వకం గా కలిసి అభినందించారు. భగవద్గీత ను ప్రపంచవ్యాప్తం గా గాన ప్రవచనాల రూపం లో విస్తృత ప్రచారం చేస్తున్నందుకు శ్రీ కిషన్ రెడ్డి శ్రీ గంగాధర శాస్త్రి కి అభినందనలు తెలియ జేశారు. భగవద్గీతా ఫౌండేషన్ అనేక భాషలలోకి భగవద్గీతను గాన పద్ధతి లో రికార్డు చేసి ప్రచారం చేసే ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం తరఫున సహకారం అందేలా చూడాలని గంగాధర శాస్త్రి కిషన్ రెడ్డి ని కోరగా, తప్పకుండా తనవంతు సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ ను (16.5. 2024) సందర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ ను (16.5. 2024) సందర్శించారు. గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌంయేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకేసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలిసి శ్రీకాంత్ కు స్వాగతం పలికి సత్కరించారు. భగవద్గీతా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల తో రూపొందించిన లఘు చిత్రాన్ని శ్రీ శ్రీ కాంత్ వీక్షించారు. అటు పై సంస్కృత పండితుల పరిష్కరణ లో, ప్రామాణిక స్థాయిలో, తెలుగు తాత్పర్యం తో రూపొందిన, భారత దేశపు మొట్టమొదటి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ను ఉభయ తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నింటిలోనూ ప్రదర్శించే విషయమై చర్చించారు. ఇటీవల కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందినందుకు శ్రీ గంగాధర శాస్త్రిని అభినందిస్తూ – ప్రపంచం లో – భగవద్గీతను ఆరాధించే ప్రతి ఒక్కరికీ ఆయా భాషల్లో తాత్పర్యాలతో రికార్డు చేసి విశ్వవ్యాప్తం చేసే విషయమై, ఫౌండేషన్ లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్లే విషయమై సుదీర్ఘం గా చర్చించి, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతా వ్యాప్తికి దేవాదాయ శాఖ తరఫున కృషి చేస్తానని శ్రీ శ్రీకాంత్ అన్నారు.