భగవద్గీతా ఫౌండేషన్’ గీతా జయంతి పర్వదినాన్ని డిసెంబర్ 18 న వైభవం గా నిర్వహించింది.. ఇందులో భాగం గా హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని బాలాజీ భవన్ నుండి వందలాది మంది విద్యార్థులు, భగవద్గీత అభిమానులు, అనుచరులతో ‘గీతా రథ యాత్ర’ ప్రారంభమై రామకృష్ణా మఠం వరకూ భగవద్గీతా పారాయణం తో… గీతా సూక్తుల నినాదాలతో సాగింది.. గీతా రథం లో శ్రీకృష్ణార్జునులు కొలువై ఉండగా … గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతా గానం సౌండ్ సిస్టం లో వినిపిస్తుండగా … ఈ రథ యాత్ర ఆధ్యాత్మిక వైభవం గా సాగింది.. అనంతరం రామకృష్ణా మఠం లో గోపూజ నిర్వహించి అటు పై.. వివేకానంద హాల్ లో గీతా జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి… సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ బి కే శర్మ దంపతులు శ్రీ కృష్ణార్చన లో పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కూచిపూడి నర్తకీమణి ‘పద్మశ్రీ’ శోభానాయుడు ఆధ్యాత్మిక పారవశ్యం తో శ్రీ కృష్ణ నృత్యాంజలి చేశారు.. శ్రీ. గంగాధర శాస్త్రి స్వాగత ఉపన్యాసం చేస్తూ, నిత్య జీవితం లో భగవద్గీత పఠన ఆవశ్యకత ను స్ఫూర్తి దాయకం గా వివరిస్తూ , కృష్ణ గీతాలను ఆలపిస్తూ .. భగవద్గీతా ఫౌండేషన్ ప్రగతి నివేదన చేశారు. శ్రీ శ్రీ శ్రీ అవధూత గిరి మహారాజ్ , శ్రీ స్వామి శితి కంఠానంద ఆశీస్సులు అందజేశారు.. ఈ సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ శ్రీ ఓగేటి కృపాలు కు ‘గీతాచార్య ‘ పురస్కారం, చిII కల్యాణరామ స్వరూప్ కు ‘పార్థ’ పురస్కారం కు అందజేసింది. ప్రస్తుతం భగవద్గీతా ఫౌండేషన్ రూపొందిస్తున్న ఆంగ్ల భగవద్గీత పోస్టర్ ను ఎక్స్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ శ్రీ వి వి లక్ష్మీ నారాయణ ఆవిష్కరించారు. రిటైర్డ్ డీజీపీ శ్రీ కరణం అరవిందరావు భగవద్గీత సిద్ధాంతాన్ని వివరించారు. పురస్కారాల కమిటీ అధ్యక్షులు డా II ఆర్ వి ఎస్ ఎస్ అవధానులు ఆశీస్సులు అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన భగవద్గీతాభిమానులతో గంగాధర శాస్త్రి చేయించిన కృష్ణ భజన తో గీతా జయంతి వేడుకలు ఘనం గా ముగిశాయ