Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

భగవద్గీతలోని ఒక్కో అధ్యాయ సారాల సి.డి.,

భగవద్గీత లోని ఒక్కో అధ్యాయం సారాంశాన్ని ఒక్కో పాట గా రచించి, దానిని ఒక్కో రాగం లో స్వరపరచి, గానం చేసి, రికార్డు చేసి సీడి లుగా తయారుచేసి విడుదల చేసిన విశిష్టమైన కార్యక్రమం కాకినాడ లోని సూర్యకళామందిరం లో అత్యంత వైభవం గా జరిగింది. రచయిత్రి, గాయని, స్వరకర్త శ్రీమతి ముసునూరి అన్నపూర్ణ, శ్రీ ముసునూరి రవికుమార్, ముసునూరి రామవర్ధన్ లు ఈ 18 గేయాల ప్రాజెక్ట్ ను వెలువరించారు. అక్టోబర్ 20 వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రణవ ఆశ్రమం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్థైర్యానంద స్వామి ఆసీహ్పూర్వక అభినందనలు అందించారు. ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ప్రధాన వక్తగా – భగవద్గీత పట్ల ప్రాధమిక అవగాహన కలిగించే దిశగా, ఆకట్టుకునే రీతిలో గాన ప్రసంగం చేశారు.

 

రాజమండ్రి వైఎస్సార్సిపి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా

“రాజమండ్రి వైఎస్సార్సిపి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ మార్గాని భరత్ రామ్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని ఆదివారం (9-6-2019) సందర్శించారు. ఫౌండేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఫౌండేషన్ చేసిన, చేస్తున్న కార్యక్రమాలను డాక్యూమెంటరీ రూపం లో భరత్ రామ్ తెలుసుకుని అభినందించారు. ఈ సందర్భం గా తనకూ ఆధ్యాత్మిక ఆసక్తి ఉందని చెబుతూ శ్రీ సూక్తాన్ని స్వరితం గా పఠించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ద్వారకా తిరుమల లో- ప్రపంచం దర్శించి పునీతులయ్యే స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించాలనే తమ సంకల్పాన్ని గంగాధరశాస్త్రి కి వివరించి, భగవద్గీతా ఫౌండేషన్ త్వరలో నిర్మించబోతున్న ఆధ్యాత్మిక కేంద్రం “గీతా సంస్థాన్ ” తో అనుసంధానమయ్యేందుకు సహకారాన్ని కోరారు భరత్ రామ్. ఈ సందర్భం గా భరత్ రామ్ ను ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీ బీకే శర్మ దుశ్శాలువాతో సత్కరించారు. ప్రపంచం లో అత్యాధునిక సాంకేతిక విలువలతో తాము రూపొందించిన సంగీతభరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీత ఆడియో ప్యాక్ ను సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి – భరత్ రామ్ కు అందజేశారు. ఈ కార్యక్రమం లో భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులతో పాటు చైనా మూర్తి , మహమ్మద్ అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు..”

 

ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ ‘ శోభానాయుడు

ప్రసిద్ధ నాట్యాచారిణి ‘పద్మశ్రీ ‘ శోభానాయుడు తన శిష్యబృందం తో ‘విప్రనారాయణ’ నృత్యరూపకాన్ని మంగళవారం (30.7. 2018) నాడు హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో అత్యంత రసార్ద్రం గా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. శోభానాయుడు ప్రదర్శనలను తిలకించి స్ఫూర్తి పొందిన అనేకమంది లో తానూ ఒకడినని గంగాధర శాస్త్రి అన్నారు. సిద్ధేంద్ర యోగి అంశతో ఉద్భవించి కూచిపూడి నాట్య ఔన్నత్యాన్ని ప్రచారం చేయడానికే తన జీవితం అంకితం చేసిన తపస్వి శోభానాయుడు అని అన్నారు. సినిమాలలో వచ్చిన అవకాశాల్ని కాదని, కూచిపూడి సంప్రదాయాన్ని కాపాడడానికే తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించడం శోభానాయుడు అంకితభావానికి నిదర్శనమని అన్నారు.

ఆమెను స్ఫూర్తి గా తీసుకుని కూచిపూడి నాట్య కళను కాపాడవలసిన బాధ్యతను ఈ తరం వారు స్వీకరించాలని పిలుపునిచ్చారు. పాటంటే సినిమా పాటే అనీ, డాన్స్ అంటే సినిమా డాన్సే అనుకునే వారికి – అంతకు మించిన దివ్యానుభూతి సంప్రదాయ కళల్లో ఉంటుందని ఈ రోజు ప్రదర్శించిన విప్రనారాయణ నృత్య రూపకం చెబుతుందని, ఇలాంటి ప్రదర్శనలను విద్యార్థులు,యువతీ యువకులకు చూపించడం ద్వారా భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చెప్పవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని గంగాధర శాస్త్రి అన్నారు. శ్రీమతి శోభానాయుడు కూచిపూడి నాట్య కళకు నాలుగున్నర దశాబ్దాలుగా నిస్వార్ధంగా చేస్తున్న సేవలను గుర్తించి ఆమెను “భారత రత్న ” తో గౌరవించాల్సిoదిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి జయ జయ శంకర టీవీ ఛానెల్ సి ఈ ఓ శ్రీ ఓలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించారు..

 

దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రివర్యులు

ఈ రోజు (26-6-2019) తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రివర్యులు శ్రీ ఏ. ఇంద్రకరణ్ రెడ్డి – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. ఫౌండేషన్సభ్యులు మంత్రి కి పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అటుపై ఆయన ఫౌండేషన్ కార్యాలయం లోని శ్రీకృష్ణుడి కి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీతా ఫౌండషన్ చేసిన, చేస్తున్న కార్యక్రమాల సమాహారం గా రూపొందించిన లఘు చిత్రాన్ని ఇంద్రకరణ్ రెడ్డి కి చూపించారు. ఈ సందర్భం గా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి – ఇంద్రకరణ్ రెడ్డి ని తులసిమాల తో, దుశ్శాలువతో, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతతో సత్కరించారు. అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ నిర్మించ సంకల్పించిన “గీతా సంస్థాన్” కి సంబంధించిన వివరాలను ఇంద్రకరణ్ రెడ్డి కి వివరించగా – ఈ ఆధ్యాత్మిక వ్యవస్థ కి ప్రభుత్వ సహకారం ఉంటుందని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి గీతా మూర్తి, శ్రీయుతులు బి కె శర్మ , బి ఎస్ శర్మ, గిరిధరన్, చలపతి రాజు, ఎం రఘు, ఎల్ వేణుగోపాల్ ,లింగమూర్తి, వెంకట రమణ, దంటు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు..

 

నర్సరావుపేట ఛాంబర్ అఫ్ కామర్స్

భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి – మహా నటులు “పద్మశ్రీ” కోట శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. గంగాధర శాస్త్రి పాత్రికేయుడి గా ఉన్నప్పుడు ఆయనతో తనకి ఉన్న అనుబంధాన్ని, సంఘటనలను, తన కుమారుడి వివాహానికి ఏర్పాటు చేసిన గంగాధర శాస్త్రి సంగీత కచేరి ని కోట గుర్తుచేసుకున్నారు. భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు నాలుగు దశాబ్దాలపాటు ఎన్నో విశిష్టమైన పాత్రలను పోషించే ప్రాప్తం లభించిందని అన్నారు. ఎంత సాధించినా, తన కుమారుడు భౌతికం గా తమకు దూరం కావడం మాత్రం, ఈ ఏడు పదుల వయస్సులో తట్టులోలేని బాధను మిగిల్చిందని కంట తడి పెట్టుకున్నారు.. తాను పోషించిన విశిష్టమైన పాత్రల ఫోటోలను సేకరించి తన కుమారుడు తయారు చేసిన పోస్టర్ ను గంగాధర శాస్త్రి కి చూపించారు. భగవద్గీత కు సంబంధించిన అనేక విశేషాలను, భగవద్గీతా ఫౌండేషన్ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఒకప్పటి గంగాధర శాస్త్రిలో కమిట్మెంట్ ఉన్న ఉత్తమ జర్నలిస్టు ని చూశాననీ, ఇప్పటి గంగాధర శాస్త్రి లో ఆధ్యాత్మికవేత్తని చూస్తున్నాని కోట అన్నారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – కోట శ్రీనివాసరావు నుదుట కస్తూరి తిలకాన్ని దిద్ది, భగవద్గీత గ్రంధాన్ని అందిస్తూ – ‘మత్తహ్ పరతరం నాన్యత్’ ( గీత -7. 7) అనే ఆరోగ్య సిద్ధి మంత్రాన్ని ఆయనతో చెప్పించారు. కోట శ్రీనివాసరావు – గంగాధర శాస్త్రి ని నూతన వస్త్రాలతో, ఫలాలతో సత్కరించారు. భగవద్గీతా ఫౌండేషన్ మేనేజర్ శ్రీ యుగంధర్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన గంగాధరశాస్త్రి

భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి – మహా నటులు “పద్మశ్రీ” కోట శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి కాసేపు ఆధ్యాత్మికం గా గడిపారు. గంగాధర శాస్త్రి పాత్రికేయుడి గా ఉన్నప్పుడు ఆయనతో తనకి ఉన్న అనుబంధాన్ని, సంఘటనలను, తన కుమారుడి వివాహానికి ఏర్పాటు చేసిన గంగాధర శాస్త్రి సంగీత కచేరి ని కోట గుర్తుచేసుకున్నారు. భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు నాలుగు దశాబ్దాలపాటు ఎన్నో విశిష్టమైన పాత్రలను పోషించే ప్రాప్తం లభించిందని అన్నారు. ఎంత సాధించినా, తన కుమారుడు భౌతికం గా తమకు దూరం కావడం మాత్రం, ఈ ఏడు పదుల వయస్సులో తట్టులోలేని బాధను మిగిల్చిందని కంట తడి పెట్టుకున్నారు.. తాను పోషించిన విశిష్టమైన పాత్రల ఫోటోలను సేకరించి తన కుమారుడు తయారు చేసిన పోస్టర్ ను గంగాధర శాస్త్రి కి చూపించారు. భగవద్గీత కు సంబంధించిన అనేక విశేషాలను, భగవద్గీతా ఫౌండేషన్ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఒకప్పటి గంగాధర శాస్త్రిలో కమిట్మెంట్ ఉన్న ఉత్తమ జర్నలిస్టు ని చూశాననీ, ఇప్పటి గంగాధర శాస్త్రి లో ఆధ్యాత్మికవేత్తని చూస్తున్నాని కోట అన్నారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – కోట శ్రీనివాసరావు నుదుట కస్తూరి తిలకాన్ని దిద్ది, భగవద్గీత గ్రంధాన్ని అందిస్తూ – ‘మత్తహ్ పరతరం నాన్యత్’ ( గీత -7. 7) అనే ఆరోగ్య సిద్ధి మంత్రాన్ని ఆయనతో చెప్పించారు. కోట శ్రీనివాసరావు – గంగాధర శాస్త్రి ని నూతన వస్త్రాలతో, ఫలాలతో సత్కరించారు. భగవద్గీతా ఫౌండేషన్ మేనేజర్ శ్రీ యుగంధర్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

కోటి లలితాసహస్రనామ పారాయణ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎం ఎల్ ఏ శ్రీ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ రామంతాపూర్, హైదరాబాద్ లోని తన స్వగృహం లో కోటి లలితాసహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని పది రోజుల పాటు అత్యంత ఘనం గా నిర్వహించారు. ఈ పారాయణ కార్యక్రమం లో వందలాది మంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని మూడు కోట్ల లలితా సహస్రనామ పారాయణ చేసారు. ఈ కార్యక్రమం లో 9 వ రోజు, ఫిబ్రవరి 3, 2020 న ముఖ్య అతిధి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై గీతా వైభవం గురించి ప్రసంగించారు. ప్రభుత్వాల పైన, పాఠశాలల్లో అధ్యాపకుల పైనా నిందలు వేయకుండా భగవద్గీతను తమ బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత తల్లులే స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. హిందూ సమాజం పటిష్టం కావాలంటే భగవద్గీతను అధ్యయనం చేయాలని సూచిస్తూ , మహిళలు రోజుకొక్క శ్లోకం అర్థం తో సహా తాము చదువుకుని పిల్లలకు నేర్పించగలిగితే, మానసికవత్తిడి, స్వార్థమూ లేని ఉత్తమమైన సమాజాన్ని నిర్మించవచ్చునని అన్నారు. తాను పరమాత్మగా ప్రకటించుకుని ప్రవచించడం వల్ల భగవద్గీతలోని ప్రతిశోకమూ మంత్రతుల్యమైనదని, గీతాపఠనం కార్యసిద్ధికి సోపానమనీ తెలిపారు.

గీతలో కొన్ని శ్లోకాలను తాత్పర్య సహితంగా వివరిస్తూ, అవి నిత్యా జీవన విధానం లో సర్వ మానవాళికి ఎలా ఉపయోగిస్తాయో గంగాధర శాస్త్రి తెలిపారు. ఇతరమతాల దాడికి హిందూధర్మానికి కలుగుతున్న హాని కి తాజా ఉదాహరణే పిఠాపురం లో ఇటీవల 24 హిందూ దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో స్వామి పరిపూర్ణానంద శ్రీ లలితా వైభవాన్ని హృద్యం గా ప్రవచించారు.  ..  

ముంబాయి లో నివసిస్తున్న తెలుగు వారికి..

ముంబాయి లో నివసిస్తున్న తెలుగు వారికి భగవద్గీత పట్ల విశేషమైన అభిమానమూ భక్తి ఉన్నాయని వివరిస్తూ – తాము భగవద్గీతా ప్రవచనాన్ని వినగోరుతున్నామని – శ్రీ నాగరాజ్, శ్రీ సిద్ధారెడ్డి ప్రభృతులు నిన్న హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కి విచ్చేసి శ్రీ గంగాధరశాస్త్రి ని సత్కరించి అభ్యర్ధించారు..  

 

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -II రీజన్ మీట్ – కరీంనగర్

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -II రీజన్ మీట్ – కరీంనగర్ లో వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు. ఆయనకు లయన్స్ క్లబ్ ఘన స్వాగతం పలికింది.. భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని బోధిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వవికాస ప్రసంగం చేశారు. అనంతరం ఆయనను లయన్స్ క్లబ్ సభ్యులు గౌరవ సత్కారం చేసారు. సెల్ఫీ లతో పాటు ఆశీస్సులు తీసుకున్నారు.

గుంటూరు జిల్లా జగ్గాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు

గుంటూరు జిల్లా జగ్గాపురం గ్రామం లో జనవరి 14న సంక్రాంతి సంబరాలు వైభవం గా జరిగాయి… ఈ సందర్భంగా జాగర్లమూడి ఆదియ్య భవనం లో కళారత్న, ‘గీతాగాన గంధర్వ’ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిచే భగవద్గీతా గాన ప్రవచనం ఏర్పాటు చేశారు. రెండున్నర గంటల పాటు జగ్గాపురం గ్రామ ప్రజలు శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన వాహినిలో తేలియాడారు. అనంతరం పోపూరి వెంకటేశ్వర్లు మరియు జగ్గాపురం గ్రామ ప్రజలు గంగాధర శాస్త్రి గారిని సత్కరించారు.