ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ పథకానికి సంబంధించిన ‘స్పందన ‘ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో 16. 11. 2019 న A1 కన్వెన్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ IAS ఆహ్వానం మేరకు నేపధ్య గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా శిక్షణ పూర్తి చేసుకుని గ్రామ సచివాలయ ఉద్యోగాలు పొంది విధులలోకి అడుగుపెడుతున్న యువతరం ఉద్యోగులను ఉద్దేశించి గంగాధర శాస్త్రి ఉద్యోగ ధర్మాలను ఆసక్తి దాయకంగా వివరిస్తూ, మధ్య మధ్య ఛలోక్తులతో , పాటలతో ,స్ఫూర్తిదాయకమైన గాన ప్రసంగం చేశారు. కార్యక్రమ అనంతరం శ్రీ పోల భాస్కర్ IAS, శ్రీ ఎం గిరిజా శంకర్ IAS, కమీషనర్ ( P.R & R.D ) లు గంగాధర శాస్త్రి ని సత్కరించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A