Latest News

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

హ్యూస్టన్, అమెరికా ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘ గారి ని LIFETIME ACHIEVEMENT’ అవార్డు తో ఘనం గా సత్కరించింది.

హ్యూస్టన్, అమెరికా ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘ గారి ని LIFETIME ACHIEVEMENT’ అవార్డు తో ఘనం గా సత్కరించింది.

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని హ్యూస్టన్, అమెరికా ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ (TCA) ‘LIFETIME ACHIEVEMENT’ అవార్డు తో ఘనం గా సత్కరించింది. అష్టలక్ష్మి దేవాలయం లో ‘భగవద్గీత-జీవన గీత’ అనే అంశం పై శ్రీ గంగాధర శాస్త్రి ఆసాంతం ఆకట్టుకునే గాన ప్రసంగం చేశారు. తొలుత ఆలయ మర్యాదలతో శ్రీ గంగాధర శాస్త్రి కి పూర్ణకుంభ స్వాగతం పలికి, అష్టలక్ష్మి కి ప్రత్యేక పూజలు చేశారు. TCA అధ్యక్షురాలు శ్రీమతి ఆశాజ్యోతి సుమధుర గాత్రం తో స్వాగత వచనాలు పలికి గంగాధర శాస్త్రి ‘గీతా’ ప్రయాణం పై లఘు చిత్రాన్ని ప్రదర్శించగా ప్రేక్షకులు కరతాళధ్వనులు సలిపారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీ వంగూరి చిట్టెంరాజు, శ్రీ జితేందర్ రెడ్డి, శ్రీ నరేంద్ర యరబర్ల, శ్రీమతి ఆశాజ్యోతి లు జ్యోతి ప్రకాశనం చేశారు. శ్రీ నరేంద్ర యరబర్ల – శ్రీ గంగాధర శాస్త్రి ని వేదికపైకి స్వాగతం పలికారు. గంగాధర శాస్త్రి తన ప్రసంగం లో భగవద్గీత ను తరువాత తరం వారికి చేర్చే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని కోరారు. తల్లితండ్రులు తమ బిడ్డలను సర్వస్వం గా భావించి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పెంచి పెద్ద వాళ్ళను చేస్తే – జీవితం విలువ తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అమెరికా లో భారతీయుల పిల్లలు కొందరు – తల్లి తండ్రులకి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయి తల్లి తండ్రుల పట్ల గౌరవ భావం లేక, క్షోభకు గురిచేస్తున్నారని, పిల్లలకు 18 ఏళ్ళు దాటగానే తల్లి తండ్రులను లెక్కచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితులను ‘ చర్చి’ లలో ప్రార్ధనలు చేస్తామంటూ ఇతర మతాలు ఉపయోగించుకుంటున్నాయని, ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే తల్లి తండ్రులు తమ బిడ్డలతో వీలైనంత సమయం గడపాలనీ, బాల్యం లోనే తమ బిడ్డలకు భారతీయ ఆధ్యాత్మికత ను పరిచయం చేయాలనీ, భగవద్గీత ను సాధన చేస్తే స్థితప్రజ్ఞత అలవడుతుందని, ప్రతి ఒక్కరూ మానసిక వత్తిడి నుంచి బయట పడవచ్చని, ఎటువంటి సంక్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం గీత ఇస్తుందని, స్వార్ధం లేని, లోకహితం కోసం కర్మలను ఆచరించే ఆనందకరమైన జీవితం గడపవచ్చని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రారంభం లో కార్యక్రమ వ్యాఖ్యాత శ్రీ గంగాధర శాస్త్రిని ‘పద్మశ్రీ’ అని సంబోధించగా – ‘నేను ‘పద్మశ్రీ’ ని కాదు ‘బ్రహ్మశ్రీ’ ని… పద్మశ్రీ మానవులు ఇచ్చేది. అందులో రికమండేషన్స్ కూడా ఉంటాయి. ‘బ్రహ్మశ్రీ’ పరమాత్మ ఇచ్చేది. ఇందులో నో రికమెండేషన్స్ …’ అంటూ చమత్కరించారు. స్వ ప్రయత్నం తో కాక పరమాత్మ అనుగ్రహంతోనే తాను ఈ గీతా మార్గం లోకి వచ్చానన్నారు. శ్రీ వంగూరి చిట్టెంరాజు, శ్రీ జితేందర్ రెడ్డి, శ్రీమతి ఆశాజ్యోతి, శ్రీ నరేంద్ర యరబర్ల లు గంగాధర శాస్త్రిని ‘లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు’ తోను, శ్రీ నరేంద్ర యరబర్ల దంపతులు పట్టుబట్టలతోను సత్కరించారు. ఈ కార్యక్రమానికి రథసారధి, తనకు ఆత్మబంధువైన శ్రీ నరేంద్ర యరబర్ల కు గంగాధర శాస్త్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భగవద్గీతా ఫౌండేషన్ తలపెట్టిన కార్యక్రమాలకు చేయూతను అందించవలసింది గా ప్రేక్షకులను కోరారు. కార్యక్రమ ప్రారంభం లో భగవద్గీత లో ‘భక్తి యోగం’ పఠించిన బాల బాలికలకు, ఈ కార్యక్రమానికి సౌండ్ ఇంజనీర్స్ గా వ్యవహరించిన అమెరికన్స్ కు, కార్యక్రమానికి సాంకేతిక సమన్వయకర్త గా వ్యవహరించిన ఎల్ విశ్వతేజ కు గంగాధర శాస్త్రి ఆశీరభినందనలు తెలిపారు.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *