సియాటెల్ లోని ఇస్కాన్ సభ్యుల అద్వర్యం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే (17.7.2023)గీతా సత్సంగం జరిగింది. లోక శ్రేయస్సును కాంక్షిస్తూ కృష్ణ మార్గాన్ని ప్రచారం చేస్తే వేదాంత ప్రభుపాద లాగా శాశ్వతులవుతారని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతే శ్రీకృష్ణ తత్వమని, లోకహితం కోసం, స్వార్ధ రహితo గా, దైవార్పణ బుద్ధి తో కర్మలు చేయాలనేదే భగవద్గీతా సారాంశమని అన్నారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ శ్రీ గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతను ఎన్నోమార్లు విన్నామని, గాన పద్ధతి లో ఆయన అందించే గీతా సందేశాన్ని విని స్ఫూర్తి పొందామని, సామాన్యుడికి అర్ధమయ్యే రీతిలో ఆయన గీతకు ఇస్తున్న వివరణ ఎంతో మందిని ప్రభావితం చేస్తోందని చెబుతూ శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. ఆ తర్వాత తనకు ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ నండూరి జయరాం, శ్రీమతి కళ్యాణి దంపతులను గంగాధరశాస్త్రి సత్కరించారు. సియాటెల్ వాసులు నిర్వహించిన పలు ‘గీతా’ కార్యక్రమాలలో పాల్గొన్న శ్రీ గంగాధర శాస్త్రి జులై 18 న హ్యూస్టన్ చేరుకున్నారు.














