‘కనిపించనంత మాత్రాన దేవుడు లేడనుకోకు. యోగమాయ ఆవరించబడి ఉండడం వల్ల దేవుడు కనిపించడు. అనన్య భక్తి చేతనే యోగమాయ ను దాటి పరమాత్మను చేరవచ్చు. దేవాలయం లో దేవుడున్నాడనుకోవడం భక్తి. పరమాత్మ సర్వత్రా వ్యాపించియున్నాడని తెలుసుకోవడం జ్ఞానం… ఈ జ్ఞానం పొందాలనుకునే వాడికి ఉండాల్సిన అర్హతలను కృష్ణ పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం లో 7 – 11 శ్లోకాలలో వివరిస్తాడు. జీవితం లో తలెత్తే ఎన్నో సందేహాలకు సమాధానం, మానసిక వత్తిడులను దూరం చేసే దివ్యఔషధం భగవద్గీత ! కాబట్టి భగవద్గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించండి. భారతీయ సంస్కృతిని కాపాడండి. ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన ఉపదేశం కాదు. సర్వ మానవాళికీ ఉపయుక్తమైనది. ” అన్నారు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. విస్కాన్సిన్ రాష్ట్రం (అమెరికా) లోని మిల్వాకి నగరం లోని హిందూ దేవాలయం లో, గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘భగవద్గీత-జీవన గీత’ అనే అంశం పై ప్రవచనం చేశారు. (29.9.2023) ఈ దేవాలయ పూర్వాధ్యక్షులు శ్రీ వెంకట్ కొడాలి శ్రీ గంగాధర శాస్త్రి ని ఆహ్వానిస్తూ – పూర్వాశ్రమo లో సినీ గాయకుడు గా ఉండి, గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఒకే ఒక్క తెలుగు గాయకుడు అన్నారు. ఆనంద్ అడవి భగవద్గీతా ప్రచారం కోసమే ఆవిర్భవించిన భగవద్గీతా ఫౌండేషన్ ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టిందని, ఈ ఆధ్యాత్మిక, సామాజిక సేవాసంస్థ కు అందరూ చేయూతను అందించాలని కోరారు. కార్యక్రమానికి ముందు శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రయాణం పైన రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A