ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త , భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటన చేస్తున్న నేపధ్యం లో తొలి కార్యక్రమం వాషింగ్టన్ లోని సియాటెల్ లో వైభవం గా జరిగింది. రెడ్మoడ్ లోని లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం లో ఏర్పాటైన తొలి రోజు కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి తన ప్రవచనం లో భగవద్గీత పరిచయం తో పాటు అన్నమయ్య కీర్తనలు, ఘంటసాల భక్తి గీతాలు, భజనలు ఆలపించారు. కార్యక్రమానంతరం ప్రేక్షకులు ఆనందాశృవులతో తమ ఆనందాన్ని గంగాధర శాస్త్రి తో పంచుకున్నారు. అంతకు ముందు దేవాలయ ప్రధానార్చకులు శ్రీమాన్ ఉదయభాస్కర పరాశర దీక్షితులు గంగాధర శాస్త్రిని సత్కరించి, సమున్నతమైన పరిచయ వాక్యాలతో వేదికపైకి స్వగతం పలికారు. తనకు ఆత్మీయ ఆతిథ్యం అందించిన శ్రీ నండూరి జయరాం, శ్రీమతి కళ్యాణి దంపతులకు, కార్యక్రమ ఏర్పాటుకు మూలకారకులైన శ్రీ శేఖర్ రావు బసవరాజు లకు గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






