'రామాయణం మన జీవన పారాయణం.. మానవ జాతికి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం రామాయణం. ఉత్తమోత్తమమైన మానవ జీవిత మార్గదర్శక గ్రంథం రామాయణం ... సకల మానవాళిని ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి రామాయణం. నిజం గా బతకడమంటే మరణించాక కీర్తి కాయం తో బతకడమే అని ఆచరించి చెప్పిన తండ్రి రామయ్య తండ్రి. జీవితమంటే సుఖం గా బతకడం కాదు. ధర్మం గా బతకడమని తాను ఆచరించి చెప్పిన ధర్మ మూర్తి శ్రీరామ చంద్రుడు.కాబట్టే మారీచుడు అనే రాక్షసుడు సైతం 'రామోవిగ్రహవాన్ ధర్మః ' అని శ్రీరాముణ్ణి కొనియాడాడు. విశేషమైన ఫలితాలనిచ్చే గురు సేవ చేసిన వాడు శ్రీరాముడు. చిన్న చిన్న పాత్రలు కూడా గొప్ప గొప్ప సందేశాలను ఇచ్చే మహాద్భుతమైన మహాకావ్యం శ్రీ రామాయణం. ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకోవాలంటే, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ధైర్యం గా ఎదుర్కోవాలంటే... రామాయణం చదివి పిల్లలకు చెప్పండి. విశ్వామిత్రుడు గంగావతరణం శ్రీరామునికి చెప్పడానికి కారణం - తమ పూర్వికులు ఎంత గొప్పవారో తెలుసుకుని తదనుగుణం గా ప్రవర్తించమని చెప్పడమే. తన వనవాసం గురించి శ్రీరాముడు సీతకు చెప్పినప్పుడు - ' నేను మీ వెంటే వస్తాను. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం.' అన్నది సీతమ్మ. ఇది ఇవాళ్టికీ దంపతులకు శిరోధార్యం. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా మరల ప్రయత్నిస్తే ఫలితం ఉంది తీరుతుంది అని రామ కథ చెబుతుంది. చీటికీ మాటికీ ఆత్మహత్యల ఆలోచన చేసే మానసిక దుర్బలులకు రామాయణ మహాభారతాలు గొప్ప ఆత్మ స్థైర్యాన్నిస్తాయి.'వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరం.. ఆ తర్వాత దాన్ని వదిలివేయాలి.' అంటాడు శ్రీరాముడు - రావణుని దహన సంస్కారాలు నిర్వహించే విషయం లో విభీషణునికి చెబుతూ. అదీ రాముని ధర్మ తత్వం... ! ఇచ్చినపనిని సాధించడమే కాక, అసలుపనికి భంగం కలగకుండా దానికి అనుబంధంగా ఇతర కార్యాలను కూడా సాధించేవాడు ఉత్తమమైన సేవకుడు అని హనుమంతుడి పాత్ర చెబుతుంది. మోడీ అనే మహాత్ముడి వల్ల రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరించుకుని రామాలయ నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఇక మిగిలింది రామరాజ్య స్థాపన. ఇందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. అందుకోసం స్వార్ధం విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరూ స్వకళ్యాణం కోసం కాక లోకకల్యాణం కోసం ఆలోచించాలి. ' జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ..' అనే రామ వాక్యాన్ని పాటించి ప్రతిఒక్కరూ దేశభక్తులు కావాలి. భారతo లో భగవద్గీత రామాయణo లో సుందరకాండ అత్యంత శక్తివంతమైనవి. ఆపదలు కలిగినప్పుడు 'ఆపదామపహర్తారం...' శ్లోకాన్ని, సర్వకార్యసిద్ధికి 'సర్వధర్మాన్ పరిత్యజ్య" శ్లోకాన్ని పఠించండి. దైవం ధర్మజ్ఞులను మాత్రమే కరుణిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మదినం. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతోపదేశ దినం. అని పిల్లలకు తెలియజేయండి. 11 వేల సంవత్సరాలు శ్రీరాముడు ఆదర్శ పరిపాలన సాగిస్తే, నేడు 5 సంవత్సరాల తరువాత ఆ ప్రభుత్వo కొనసాగుతుందో లేదో అనే సందేహం రావడానికి కారణం ప్రభుత్వాలపైన ప్రజలకు, ప్రజలపైన ప్రభుత్వాలకు గౌరవం లేకపోవడమే. అన్ని పండగలు మొక్కుబడిగా జరుపుకునే హిందువులు పండగల పరమార్ధాన్ని తెలుసుకుని హిందుత్వాన్ని కాపాడుకోవడం లో మాత్రం అత్యంత బలహీనం గా ఉన్నారు. కాబట్టే ఎవడు పడితే వాడు హిందువులను, హిందూ దేవతలను, దేవాలయాలను అవమానించి కూడా ధైర్యం గా మన మధ్యనే తిరగగలుగుతున్నారు. సనాతన ధర్మానికి పునాది అయిన భగవద్గీతను తాత్పర్యసహితం గా అధ్యయనం చేయండి. పిల్లలకు నేర్పించండి. తద్వారా హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందువులను అవమానించే వారికి బలం గా బుద్ధి చెప్పండి." అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యం లో మెదక్ జిల్లా లోని రామాయంపేట లో ప్రభుత్వ కళాశాల మైదానం లో (28. 3.2023) జరిగిన సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ పబ్బ సత్యనారాయణ నిర్వహణలో ఘనం గా జరింగింది.
Share:
Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp
Most Popular
‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా
‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ
“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ