‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి స్వచ్ఛ రాంశంకరనగర్ (రామంతాపూర్, హైదరాబాద్-) కార్యక్రమం లో (1.2.2024) పాల్గొన్నారు. ఈ సందర్భం గా మొక్కలు నాటి, నిత్యం ప్రజల కు సేవ చేసే జి హెచ్ ఎం సి అధికారులను, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోకపోతే రోగాలు ప్రబలుతాయని తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం గా వ్యవహరించడంపై గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నవారుకూడా నిరక్షరాస్యులాగా, బాధ్యతరహితం గా, సంస్కారహీనం గా ప్రవర్తిస్తూ – తిని వదిలేసిన వ్యర్ధ పదార్ధాలను, చెత్తను, రోడ్ల పై మూటలు కట్టి పడేసి వెళ్లిపోవడాన్ని మున్సిపల్ వారు సీరియస్ గా తీసుకుని, సి సి కెమెరాల ద్వారా వారిని గమనించి కఠినం గా శిక్షించాలని అన్నారు. దశాబ్ద కాలం గా తమ కాలనీ లో చుట్టు పక్కల వాళ్ళు వ్యర్ధ పదార్ధాలను తమ ఇంటి పక్కనే పడవేయడం వల్ల, ఈగలూ దోమలతో తాము తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని ఆయన అన్నారు. ఈ విషయం లో ఎన్ని సార్లు అవగాహన కల్పించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. దేవాలయ పరిసరాలను కూడా ప్రజలు శుభ్రం గా ఉంచడం లేదని, వ్యర్ధ పదార్ధాలను మున్సిపల్ వారు ఇంటింటికీ పంపించే వాహనాలకే అందించాలనే కనీస జ్ఞానం కూడా లేని సమాజం లో బతకాల్సి రావడం దురదృష్టకరమని, దీనికి కఠినమైన చర్యలు చేబట్టడమే పరిష్కారమని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన బి జె పి కార్పొరేటర్ శ్రీమతి శ్రీవాణిని, మున్సిపల్ అధికారులు శ్రీ సుదర్శన్, శ్రీ బాబురావు తదితరులను శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సత్కరించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A