సియాటెల్, అమెరికా లో నివసిస్తూ ఇన్ఫోసిస్ లో ఉన్నత పదవిలో పనిచేస్తున్న శ్రీ రామ్ నాథ్ సూర్యప్రకాశ్ ఆయన సతీమణి శ్రీమతి నేత్రావతి – గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఫౌండేషన్ కార్యాలయం లో ఆ దంపతులు కాసేపు గడిపారు. సియాటెల్ లో శ్రీ గంగాధర శాస్త్రి గీతా గానప్రవచనాన్ని విని స్ఫూర్తి పొందామని, ఆ స్ఫూర్తి తో తాము ప్రతి రోజూ భగవద్గీతను పఠిస్తున్నామని అన్నారు. ‘భగవద్గీత ను ఏ వయస్సునుండి పఠించాలో గురువు గారు చెబుతూ తల్లి గర్భం లో ఉన్నప్పుడే బిడ్డలకు భగవద్గీత, విష్ణు సహస్రనామం వినిపించాలన్నారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను అలాగే చేసేదాన్ని.. మా అమ్మాయికి అలాగే గర్భం లో ఉన్నప్పుడే భగవద్గీత, విష్ణుసహస్రనామం వినిపించాను. అది పుట్టాక ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేది. చదువులో చాలా తెలివైనది అయ్యింది. సంస్కారవంతురాలు కూడా.. ఏ సమస్య వచ్చినా తనకు తానే ధైర్యం గా పరిష్కరించుకుంటుంది. ఆధ్యాత్మిక బలం అలాంటిది. గీత లో చెప్పినట్టు సకల ప్రాణులను ప్రేమించగలగాలి. మా దొడ్లో పెంచే మొక్కలను మా బిడ్డల్లాగే చూసుకుంటూంటాను. గురువు గారు గంగాధర శాస్త్రి గారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు దొడ్లో పెంచిన ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో పాటు, కూరగాయల మొక్కల్ని కూడా చూపించాను.” అంటూ శ్రీమతి నేత్రావతి గుర్తు చేసుకున్నారు. రాంనాథ్ సూర్యప్రకాష్, నేత్రావతి దంపతులను శ్రీ గంగాధర శాస్త్రి, విశ్వతేజ లు సత్కరించారు.