కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ( VEDA TEMPLE ) ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన ప్రచారకర్త డా. ఎల్. వి. గంగాధర శాస్త్రి ని అయన రెండు రోజుల గీతా గాన ప్రవచనం అనంతరం ‘భగవద్రత్న భగవద్గీతర్షి’ బిరుదుతోను, ప్రశంసా పత్రం తోను, స్వర్ణకంకణం తోను ఘనo గా సత్కరించింది. VEDA TEMPLE వ్యవస్థాపకులు, ప్రసిద్ధ వేద పండితులు, జ్యోతిష శాస్త్రజ్ఞులు, సుకవి బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి శ్రీ గంగాధర శాస్త్రిని – ప్రశంసా పత్రం చదివి, వేద ఆశీర్వచనo తోను పట్టు వస్త్రాలతోనూ సత్కరించారు. ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ చేత శ్రీ గంగాధర శాస్త్రి కి స్వర్ణ కంకణ ధారణ చేయించారు. సంస్కృతాంధ్రాలలో అపారమైన విద్వత్సంపన్నుడు అమెరికా లో స్థిరపడిన ద్విసహస్రాధాని బ్రహ్మశ్రీ పాలడుగు శ్రీచరణ్ ఈ రెండు రోజుల కార్యక్రమానికి విశిష్ఠ అతిధి గా హాజరై గీతాప్రచారం కోసం శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని కొనియాడుతూ … ఆనయాతాద్యశోదాత్మ / గోవిందోయం జనార్దనః / లక్కావఝల వంశాబ్ధి / గ్లౌ గంగాధర శాస్త్రిణమ్ / వంటి పద్యరత్నాలతో ఆశీర్వదించారు. శ్రీ గంగాధర శాస్త్రి నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకత గురించి స్ఫూర్తిదాయకం గా వివరిస్తూ, గీతా గానం చేస్తూ, మధ్య మధ్యలో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు, భజనలు గానం చేశారు. విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలను గానం చేస్తూ తాత్పర్యం చెబుతున్నప్పుడు ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయం గా తాము చేస్తున్న భగవద్గీతా ప్రచారానికి, భగవద్గీతా ఫౌండేషన్ కి చేయూతనందించవలసిందిగా శ్రీ గంగాధర శాస్త్రి కోరుతూ, తనకు ఉత్తమమైన వేదిక, ఆత్మీయ ఆతిధ్యం అందించడం తో పాటు ఫౌండేషన్ కు చేయూతనందించడం లో కృషి చేసిన బ్రహ్మశ్రీ నాగ వెంకట శాస్త్రి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తన కార్యక్రమం గురించి తెలుసుకుని విచ్చేసిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఉపాధ్యాయుల రాధాకృష్ణ, శ్రీ శ్రీనివాస మూర్తి, కతార్ దేశ వాస్తవ్యలు శ్రీ ఆదిత్య దంపతుల కు గంగాధర శాస్త్రి ధన్యవాదాలు తెలియజేసారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A