ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్య్వవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారు తన జన్మ దినం సందర్భంగా – విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని హైదరాబాద్ ఫిలిం నగర్ లోని దైవసన్నిధానం ఆలయం లో సందర్శించి వారి ఆశీస్సులు పొందారు. స్వామి కోరిక మేరకు గంగాధర శాస్త్రి కొన్ని భక్తి గీతాలను ఆలపించారు. తనకు గంగాధరశాస్త్రి అన్నా ఆయన గాత్రమన్నా అభిమానమని స్వరూపానంద అన్నారు. ఘంటసాల గీతాలకూ, శ్రీకృష్ణ గీత కూ ప్రచారం కల్పించడానికే భగవంతుడు గంగాధర శాస్త్రి ని ఎంచుకున్నట్టుగా తాను భావిస్తానని, సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ కు తాను ముహూర్తం నిర్ణయించగా, తన జన్మ చరితార్ధమయ్యేలా గంగాధర శాస్త్రి గీతను గానం చేశారని స్వరూపానంద అన్నారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులతో కలసి – తాము చేయబోతున్న ప్రాజెక్ట్ వివరాలను – స్వరూపానంద కు అందజేయగా -ఇవన్నీ సఫలీకృతం కావాలని స్వామి ఆశీర్వదించారు. త్వరలో తాను హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శిస్తానని అన్నారు. ఫౌండేషన్ సభ్యులు శ్రీయుతులు చలపతి రాజు, చక్రవర్తి , కృష్ణమాచార్యులు స్వామి ఆశీస్సులు పొందారు..