Latest News

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం…..

నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం…..

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

“భారతదేశం లో తొలిసారిగా – వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, మా “భగవద్గీతా ఫౌండేషన్’ రూపొందించిన తెలుగు తాత్పర్య సహిత, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ప్రతి తెలుగు వాడి ఇంట్లోనూ, ప్రతి దేవాలయం లోనూ మ్రోగాలని ఆకాంక్షిస్తున్నాం. దాదాపు 150 మంది సాంకేతిక నిపుణులు, పండితులు 7 సంవత్సరాలపాటు పరిశోధనాత్మక కృషి చేసి, తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ఆశీస్సులతో విడుదలైన భగవద్గీత ఇది. దీని ద్వారా భగవద్గీత సారాన్ని అర్ధం చేసుకుని, ఆచరించి, జన్మలను చరితార్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే భగవద్గీత – మతాలకు అతీతమైన సార్వజనీన బోధ ! మనం చేసే కర్మల తాలూకు ఫలితాలే మనం అనుభవించే సుఖ దుఃఖాలు ! ‘జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషా ను దర్శనమ్’ (13-9) అని పరమాత్మ చెప్పినట్టుగా జనన, మరణ, వార్ధక్య, వ్యాధుల వలన కలిగే దుఃఖాన్ని దోషాన్ని గుర్తించడమే జ్ఞానము. ఆ జ్ఞానం భగవద్గీతా పఠనం వల్ల మనకు లభిస్తుంది. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఫలితం పరమాత్మకు అర్పించి, నిస్వార్ధం గా, లోక హితం కోసం, బంధాలకు అతీతం గా ఆచరించమని గీత చెబుతుంది. భగవద్గీత వైరాగ్యాన్ని బోధించే వృద్ధాప్యపు గ్రంథం కాదు. బాల్య దశ నుండే అభ్యసించవలసిన ఉత్తమ జీవనవిధాన గ్రంథం. మీ ఫోన్లలో రింగ్ టోన్ గా, కాలర్ ట్యూన్ గా భగవద్గీతా శ్లోకాలను పెట్టుకోండి. తల్లులారా.. భగవద్గీత మీరు నేర్చుకుని రోజుకో శ్లోకాన్ని మీ పిల్లలకు నేర్పించండి. సత్ఫలితాలను పొందండి. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. శ్రీ సత్యసాయి జిల్లా లోని నీలకంఠాపురం గ్రామం లో, ఆంధ్రప్రదేశ్ పూర్వ మంత్రివర్యులు డాII రఘువీరారెడ్డి అత్యద్భుతం గా పునర్నిర్మించిన నీలకంఠాపురం దేవస్థానం లో గంగాధర శాస్త్రి గీత వైభవ గాన ప్రవచనం చేశారు. శ్రీ రఘువీరారెడ్డి లోని నిస్వార్ధ సేవ, ఆధ్యాత్మిక తత్పరతలను కొనియాడుతూ, రాజకీయ నాయకుడి గా ఆయన ప్రజలకు నిరంతర సేవలందించే స్థితిని పరమాత్ముడు అందించాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. రాష్ట్రం లోని ప్రతి దేవాలయం లోనూ భగవద్గీత వినిపించేట్టు గా చర్యలు గైకొనాలని, అలాగే భగవద్గీత ప్రచారమే లక్ష్యం గా స్థాపించిన తమ భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనివ్వాలని – ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆం.ప్ర. ఎండోమెంట్స్ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ కు సూచించారు. ఆనంతరం లేపాక్షి ఆలయ సందర్శనార్ధం వెళ్లిన శ్రీ గంగాధర శాస్త్రి కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చక స్వామి శ్రీమాన్ లక్ష్మి నృసింహ నిర్వహణలో శ్రీ వీరభద్ర స్వామికి, దుర్గామాత కు, హనుమంతుడు ప్రతిష్టించిన సైకత లింగానికి శ్రీ గంగాధర శాస్త్రి పూజలు నిర్వహించారు. దేవతా స్తుతి చేస్తూ ‘స్వర’ పుష్పాలు సమర్పించారు.em ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Share:

Facebook
Twitter
LinkedIn
Telegram
WhatsApp

Most Popular

‘ఏ పని చేసినా – ధర్మబద్ధం గా

‘హనుమంతుడా! నా కథలు లోకములో ప్రచారములో ఉన్నంతవరకూ

“భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *