హైదరాబాద్, బంజారా హిల్స్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో సంస్థ వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి – సంగీత భరిత సంపూర్ణ ఆంగ్ల భగవద్గీత ఎడిటింగ్ కార్యక్రమం లో ఉన్నారు. ఆ సమయం లో ఓ జంట – తమ ఐదేళ్ల పిల్లవాడితో ఫౌండేషన్ కార్యాలయం లోకి అడుగు పెట్టారు. ఒక చోట కుదురుగా కూర్చోవడంకూడా తెలియని ఆ పిల్ల వాడి పేరు అచ్యుత్ ! కృష్ణ పరమాత్ముడి పేరే.. !
విచిత్రం ఏమిటంటే – వీడికి మాట్లాడడం ఇంకా పూర్తి గా రాకపోయినా ( ఈ విషయమై ఈ పిల్లవాడి తల్లి తండ్రులు శైలజ, కామేశ్వర రావులు అనేక మంది డాక్టర్లను సంప్రదించామని ఆవేదనతో చెప్పారు ) భగవద్గీత లోని 700 శ్లోకాలూ కంఠతా పట్టేసాడు. దీనిని పరమాత్మ అనుగ్రహం, పూర్వ జన్మ వాసన అనక ఇంకేమి అనగలం ? ఈ పిల్లవాడి వృత్తాంతం పునర్జన్మ ను ధ్రువీకరించడం లేదూ..! పైగా ఈ భగవద్గీత ను తల్లి తండ్రులు నేర్పించలేదట. వాడంతట వాడే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాడట.. ఇది ఇంకా అద్భుతం. ఆ రోజు పనులన్నీ ఆపేసి.. ఈ అచ్యుతుడి తోనే ఆనందం గా గడిపేశారు గంగాధర శాస్త్రి… ఏ శ్లోకం అడిగినా అత్యద్భుతమైన, పరిణతితో కూడిన, స్పష్టమైన ఉచ్చారణతో ఆ పిల్ల వాడు శ్లోకాలను చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు గంగాధర శాస్త్రి… భగవద్గీతను ఏ వయస్సు పిల్లలకు నేర్పించాలి అని చాలామంది అడిగే ప్రశ్నకు ఈ పిల్లవాడే ఉదాహరణ అని, యంయం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం I తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః II (8-6) అని గీతాచార్యుడు చెప్పినట్టు – ‘అంత్య కాలం లో మనుజుడు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో మరు జన్మలో అతడు ఆయా భావాలనే పొందుతాడు.’ అనడానికి ఈ పిల్లవాడే ఒక ఉదాహరణ అని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ పిల్ల వాడు భవిష్యత్తులో ‘గీతాచార్యుడు’ గా లోకానికి మార్గదర్శి కాగలడని ఆశీర్వదించారు. మనం పోయేటప్పుడు – లౌకికం గా సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి పోతామని .. జీవుడు ఒక దేహం విడిచి మరొక దేహం పొందేటప్పుడు తన వెంట ఇంద్రియాలు, మనస్సు తీసుకు వెళతాడని, మనం చేసే కర్మల ఫలితం ఇంద్రియాలకు, మనస్సుకు అంటుకుని ఉంటుందని … ఈ కర్మలే జీవుల ఉత్తమ, అధమ జన్మలను నిర్ణయిస్తాయని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే మంచి పనులు, మంచి ఆలోచనలు చేయాలనీ, స్వార్ధ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, మతాలకు అతీతమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ పఠించి, ఆచరించాలని పిలుపునిచ్చారు.