Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

Gangadhara Sastry Bhagavadgita

  1. Home
  2. »
  3. Gangadhara Sastry Bhagavadgita

Gangadhara Sastry Bhagavadgita

  • Inspired by the Bhagavadgita rendering in part by Sri Ghantasala, the renowned Film Playback Singer and Music Director Gangadhara Sastry sang all the 700 verses of Bhagavadgita with meaning, recorded them and successfully completed the project in his own musical style, except for the 106 verses, where the style of Ghantasala is retained as a mark of respect.
  • This sacred project of musical rendering of Bhagavadgita in full commenced on 25th June, 2006 through auspicious hands of Sarada Peethadhipathi Sri Sri Sri Swaroopanandendra Saraswathi Mahaswami at Anna Audio Lab, Hyderabad.
  • This recording which commenced in 2006 has been completed in 2012 after six years of tenacious effort.
  • Nearly 100 scholars, musicians, technical experts and enthusiastic believers extended their cooperation.
  • Under the able supervision and guidance of Mahamahopadhyaya, ‘Padmasri’ Acharya, Sri Pullela Sriramachandrudu, ‘Samskritamitra’ Dr.R.V.S.S.Avadhanulu and Prof.Korada Subrahmanyam this project attained a high degree of excellence.
  • The honorary service extended by ‘Sitar maestro’ Sri Janardan and sound engineer HMV Raghu & Music Director Sri Sangeeta Rao whom had the distinction of having worked for Ghantasala Bhagavadgita is a matter of special significance.
  • The speciality of this Bhagavadgita recording lies in mixing digital stereo recording with latest technical know how in the world and in Dolby digital 5.1 channel.
  • This Bhagavadgita rendering which is a harmonious blend of Karnatic and Hindusthani classical music, light, folk and western music proceeds to transport the listeners into a spiritual musical trance.
  • The special attraction of this Bhagavadgita is adoption of music capable of making the dialogue between Sri Krishna and Arjuna sound as if it is taking place before the listeners. Similarly singing the verses and reading the meanings with appropriate articulation to reflect the intent of the diverse characters appearing in the Bhagavadgita Sri Krishna, Arjuna, Sanjaya, Dhritarashtra, is another speciality.
  • Other Special Characteristics of this Bhagavadgita are – introduction before the commencement of singing Bhagavadgita, briefly touching upon the core concepts contained at the beginning of each of the 18 chapters and Sri Krishna bhajan at the end of each chapter.
  • In the musical history of India this is the first time that a singer sang and recorded an outstanding philosophical treatise full and with meanings, with world class technical excellence.
  • Long Term action plan has been drawn to include translation of Bhagavadgita into Hindi, English, German, Russian, French, Japanese and other Foreign Languages, and propagate the same through recorded audio CDs world wide to promote world peace and universal brotherhood.

గంగాధర శాస్త్రి 'భగవద్గీత'

  • ‘భగవద్గీత’కు భారతదేశంలో, గాన పద్ధతిలో ప్రచారం కల్పించినవాడు తెలుగువాడు (ఘంటసాల) కాబట్టి, భగవద్గీతను సంపూర్ణంగా గానం చేసేవాడు కూడా తెలుగువాడే కావాలన్న లక్ష్యంతో ఘంటసాల భగవద్గీత స్ఫూర్తితోప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకులు గంగాధర శాస్త్రి– భగవద్గీతలోని 700 శ్లోకాలనూ తాత్పర్య సహితంగా గానం చేయడానికి సంకల్పించారు.
  • ఈ సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం 2006 జూన్ 25న, శారదా పీఠాధిపతిశ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామికరకమలాల మీదుగా హైదరాబాదులోని అన్నా ఆడియో లాబ్‍లో ప్రారంభమై, 6 సంవత్సరాల కృషి అనంతరం , 2012లో పూర్తి అయింది.
  • శ్రీ ఘంటసాల గౌరవార్థం, ఆయన పాడిన 106 శ్లోకాలను యథాతథంగా గానం చేస్తూ, మిగిలిన శ్లోకాలను గంగాధర శాస్ర్తి స్వీయ సంగీతంలో గానం చేసి 700 శ్లోకాల ’భగవద్గీత’ను సంపూర్ణంగా రికార్డు చేసారు.
  • దాదాపు 100 మంది పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, భగవద్భంధువులు ఈ ప్రాజెక్టుకు సహకారం అందించారు.
  • మహామహోపాధ్యాయ,’పద్మశ్రీ’ ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, ’సంస్కృతమిత్ర’ డా|| ఆర్.వి.ఎస్.ఎస్.అవధానులుమరియుఆచార్య శ్రీ కోరాడ సుబ్రహ్మణ్యంగార్ల పర్యవేక్షణలో ప్రామాణిక స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
  • ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక విలువలతో డిజిటల్ స్టీరియో రికార్డింగ్‍లోను, ’డాల్బీ డిజిటల్ 5.1’ ఛానల్‍లోను మిక్సింగ్ చేయడం ఈ ’భగవద్గీత’ ప్రత్యేకత.
  • ఘంటసాల గారి ’భగవద్గీత’కు పనిచేసిన ’సితార్’ వాద్యకాళాకారుడుశ్రీ జనార్దన్,సౌండ్ ఇంజనీర్’హెచ్.ఎమ్.వి’.రఘు, సంగీత దర్శకులుశ్రీ సంగీతరావుగార్లు ఈ ప్రాజెక్టుకు కూడా గౌరవహోదాల్లో పనిచేయడం విశేషం.
  • కర్నాటక శాస్ర్తీయ, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ ’భగవద్గీత’ శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్ళేట్టుగా సాగుతుంది.
  • శ్రీ కృష్టార్జున సంవాదాన్ని కళ్ళకు కట్టినట్టుగా వినిపించేందుకు అనుగుణమైన సంగీతం, సౌండ్ఎఫెక్ట్స్ ఈ ’భగవద్గీత’లో ప్రత్యేక ఆకర్షణ. అలాగే ’భగవద్గీత’లో కనిపించే శ్రీకృష్టుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్టుడు పాత్రలకు తగినట్టుగా శ్లోకాలను, తాత్పర్యాలను భావప్రధానంగా పాడుతూ పఠించడం మరో విశేషం.
  • ’భగవద్గీతా’ గానానికి ప్రారంభంలో ఉపోద్ఘాతము, 18 అధ్యాయాలకు ముందు ఆయా అధ్యాయాలలోని ప్రధానాంశాల ప్రస్తావన, అధ్యాయం ప్రారంభంలో థీమ్ మ్యూజిక్, ప్రతి అధ్యాయం చివరన’కృష్టభజన’ఈ ’భగవద్గీత’లోని ప్రత్యేకతలు.
  • ఒక గాయకుడు స్వీయ సంగీతంలో ఒక ప్రామాణిక గ్రంథాన్ని తాత్పర్య సహితంగా, సంపూర్ణంగా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం.
  • ’భగవద్గీత’ను తెలుగు భాషతో పాటుహింది, ఇంగ్లీషు, జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, జపనీస్మొదలైన అంతర్జాతీయ భాషలలో కూడా అనువదించి, ఆడియో సీడీలుగా విడుదల చేయడానికి, విస్తృత ప్రచారం చేయడానికి సంకల్పించాము.