Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

ఈ నెల 7వ తేదీన దుబాయ్ లోని – అల్ జుర్ఫ్, అజ్మాన్ లోని..

ఫిబ్రవరి 7వ తేదీన దుబాయ్ లోని – అల్ జుర్ఫ్, అజ్మాన్ లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ అత్యంత వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమం లో భాగం గా – భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే గీతా గాన ప్రవచనం జరిగింది. గత దశాబ్ద కాలం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా వీక్షించిన వందలాదిమంది అభిమానులు గంగాధర శాస్త్రి ప్రవచనానికి తరలివచ్చారు. భగవద్గీత గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సెల్ఫీ లు తీసుకున్నారు. గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ఆడియో సిడి లను పొందారు. ప్రపంచం లో మిగతా మత గ్రంథాలు మానవుల చేత రచించబడినవనీ, భగవద్గీత – సాక్షాత్తూ పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడి ప్రపంచ మానవాళికి అందిన మహోత్కృష్టమైన దివ్య సందేశమని, దీనిని ప్రతి ఒక్కరూ విని, ఆచరించి, ప్రచారం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని స్థాపించవచ్చని, మానసిక వత్తిడి లేని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీ గంగాధర శాస్త్రి చెప్పారు.

ఫిబ్రవరి 8,9,10 తేదీలలో దుబాయ్ పరిసరాల లోని అబు ధాబి, రాస్ ఆల్ ఖైమా, షార్జా ల లో కూడా శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం తో నిత్య జీవన మార్గం లో భగవద్గీత ఆవశ్యకతను తెలియజేశారు

మహాత్ములు మానవ జాతికి లభించడం మిక్కిలి అరుదు

హైదరాబాద్, బంజారా హిల్స్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో సంస్థ వ్యవస్థాపకులు, గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి – సంగీత భరిత సంపూర్ణ ఆంగ్ల భగవద్గీత ఎడిటింగ్ కార్యక్రమం లో ఉన్నారు. ఆ సమయం లో ఓ జంట – తమ ఐదేళ్ల పిల్లవాడితో ఫౌండేషన్ కార్యాలయం లోకి అడుగు పెట్టారు. ఒక చోట కుదురుగా కూర్చోవడంకూడా తెలియని ఆ పిల్ల వాడి పేరు అచ్యుత్ ! కృష్ణ పరమాత్ముడి పేరే.. !
విచిత్రం ఏమిటంటే – వీడికి మాట్లాడడం ఇంకా పూర్తి గా రాకపోయినా ( ఈ విషయమై ఈ పిల్లవాడి తల్లి తండ్రులు శైలజ, కామేశ్వర రావులు అనేక మంది డాక్టర్లను సంప్రదించామని ఆవేదనతో చెప్పారు ) భగవద్గీత లోని 700 శ్లోకాలూ కంఠతా పట్టేసాడు. దీనిని పరమాత్మ అనుగ్రహం, పూర్వ జన్మ వాసన అనక ఇంకేమి అనగలం ? ఈ పిల్లవాడి వృత్తాంతం పునర్జన్మ ను ధ్రువీకరించడం లేదూ..! పైగా ఈ భగవద్గీత ను తల్లి తండ్రులు నేర్పించలేదట. వాడంతట వాడే యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాడట.. ఇది ఇంకా అద్భుతం. ఆ రోజు పనులన్నీ ఆపేసి.. ఈ అచ్యుతుడి తోనే ఆనందం గా గడిపేశారు గంగాధర శాస్త్రి… ఏ శ్లోకం అడిగినా అత్యద్భుతమైన, పరిణతితో కూడిన, స్పష్టమైన ఉచ్చారణతో ఆ పిల్ల వాడు శ్లోకాలను చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు గంగాధర శాస్త్రి… భగవద్గీతను ఏ వయస్సు పిల్లలకు నేర్పించాలి అని చాలామంది అడిగే ప్రశ్నకు ఈ పిల్లవాడే ఉదాహరణ అని, యంయం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం I తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః II (8-6) అని గీతాచార్యుడు చెప్పినట్టు – ‘అంత్య కాలం లో మనుజుడు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో మరు జన్మలో అతడు ఆయా భావాలనే పొందుతాడు.’ అనడానికి ఈ పిల్లవాడే ఒక ఉదాహరణ అని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ పిల్ల వాడు భవిష్యత్తులో ‘గీతాచార్యుడు’ గా లోకానికి మార్గదర్శి కాగలడని ఆశీర్వదించారు. మనం పోయేటప్పుడు – లౌకికం గా సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి పోతామని .. జీవుడు ఒక దేహం విడిచి మరొక దేహం పొందేటప్పుడు తన వెంట ఇంద్రియాలు, మనస్సు తీసుకు వెళతాడని, మనం చేసే కర్మల ఫలితం ఇంద్రియాలకు, మనస్సుకు అంటుకుని ఉంటుందని … ఈ కర్మలే జీవుల ఉత్తమ, అధమ జన్మలను నిర్ణయిస్తాయని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే మంచి పనులు, మంచి ఆలోచనలు చేయాలనీ, స్వార్ధ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, మతాలకు అతీతమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ పఠించి, ఆచరించాలని పిలుపునిచ్చారు.
 

అది 2006 వ సంవత్సరం … TAMA

శ్రీ శ్రీ శ్రీ చిద్రూపానంద స్వామి, చిన్మయ మిషన్ ( ఢిల్లీ శాఖ అధిపతి ) తన హైదరాబాద్ పర్యటనలో భాగం గా – భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, గీతాగాన ప్రవచన కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, సంస్థ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, డాII పద్మ వీరపనేని, సభ్యులు శ్రీ బి ఎస్ శర్మ , శ్రీ ఎం రఘు తదితరులు చిద్రూపానంద కు ఘన స్వాగతం పలికారు. వారిని ఫల పుష్ప వస్త్రాలతొ సత్కరించి, సంపూర్ణ భగవద్గీత ఆడియో సి డి ని అందించారు. ఈ సందర్భం గా ప్రదర్శించిన The Making of Bhagavadgita – Documentrary ని తిలకించి శ్రీ చిద్రూపానంద – భగవద్గీతా ఫౌండేషన్ కి ఆశీస్సులు అందజేశారు. భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందిస్తూ, ఫౌండేషన్ తలపెట్టిన భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని అందుకు తమ గురుదేవులు శ్రీ చిన్మయానంద ఆశీస్సులు తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. విచ్చేసిన భక్తులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు చెప్పారు…
 

శ్రీ శ్రీ శ్రీ చిద్రూపానంద స్వామి, చిన్మయ మిషన్ ( ఢిల్లీ శాఖ అధిపతి ) తన హైదరాబాద్

శ్రీ శ్రీ శ్రీ చిద్రూపానంద స్వామి, చిన్మయ మిషన్ ( ఢిల్లీ శాఖ అధిపతి ) తన హైదరాబాద్ పర్యటనలో భాగం గా – భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, గీతాగాన ప్రవచన కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, సంస్థ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, డాII పద్మ వీరపనేని, సభ్యులు శ్రీ బి ఎస్ శర్మ , శ్రీ ఎం రఘు తదితరులు చిద్రూపానంద కు ఘన స్వాగతం పలికారు. వారిని ఫల పుష్ప వస్త్రాలతొ సత్కరించి, సంపూర్ణ భగవద్గీత ఆడియో సి డి ని అందించారు. ఈ సందర్భం గా ప్రదర్శించిన The Making of Bhagavadgita – Documentrary ని తిలకించి శ్రీ చిద్రూపానంద – భగవద్గీతా ఫౌండేషన్ కి ఆశీస్సులు అందజేశారు. భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందిస్తూ, ఫౌండేషన్ తలపెట్టిన భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని అందుకు తమ గురుదేవులు శ్రీ చిన్మయానంద ఆశీస్సులు తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. విచ్చేసిన భక్తులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు చెప్పారు…
 

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త శ్రీ అడుసుమిల్లి కృష్ణమూర్తి సతీమణి శ్రీమతి అడుసుమిల్లి రమాదేవి

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త శ్రీ అడుసుమిల్లి కృష్ణమూర్తి సతీమణి శ్రీమతి అడుసుమిల్లి రమాదేవి (శ్రీమతి బేబమ్మ) దివంగతురాలైన నేపథ్యం లో ఆమె స్మృత్యర్థం శ్రీ అడుసుమిల్లి వెంకట్, కుమార్తె శ్రీమతి ప్రభ, మనుమరాలు శ్రీమతి వాసుకి సుంకవల్లి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. జూబిలీ హిల్స్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిధి గా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని ఆహ్వానించగా – ‘భగవద్గీత – ఉత్తమ జీవితం’ అనే అంశం పై ఆయన గాన ప్రసంగం చేశారు.
 

తెలంగాణ ట్రాన్స్ కో & జెన్ కో సి.ఎం.డి శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు – హైదరాబాద్

తెలంగాణ ట్రాన్స్ కో  & జెన్ కో  సి.ఎం.డి  శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు ‘గీతాచార్య’ శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కార్యాలయం లోని శ్రీ కృష్ణ విగ్రహానికి శ్రీ ప్రభాకర రావు తులసిమాల వేసి నమస్కరించి, అటుపై గీతా గాన రికార్డింగు ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రదర్శించిన లఘుచిత్రాన్ని తిలకించి, పులకించి గంగాధర శాస్త్రిని అభినందించారు. పరమాత్ముని అనుగ్రహం చేతనే ఇంతటి మహత్కార్యాన్ని గంగాధర శాస్త్రి సాధించగలిగారని అన్నారు. ఈ సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ భవిష్యత్తు ప్రణాళికలను శ్రీ గంగాధర శాస్త్రి వివరించగా , ఈ గీతా యజ్ఞం లో  తానూ ఒక సమిధగా ఉపయోగపడతానని శ్రీ ప్రభాకరరావు అన్నారు.  ఈ కార్యక్రమం లో శ్రీ ప్రభాకర రావు, శ్రీ  వై. రామారావు, Advocate, Telangana HighCourt, డాII హెచ్.ఆర్.వి. రాజ్ కుమార్, Dr. H.R.V. Rajkumar, Professor and Head of the Department of Microbiology and Infectious Diseases, Kamineni Academy of Medical Sciences and Research Centre, శ్రీ  మంతెన శ్రీనివాస రాజు, Chairman, Nalanda Group of Colleges లను శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీ అజాద్ బాబు లు సత్కరించారు..
 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, పూర్వ శాసన ఉపసభాపతి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, పూర్వ శాసన ఉపసభాపతి, పూర్వ అధికార భాషాసంఘం అధ్యక్షులు, తెలుగు భాషకు ప్రాచీన హోదాను సాధించిన సాంస్కృతిక బంధువు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్… వారి కుమారుడు చిII వెంకట రామ్ ను చిIIలIIసౌ సాయి సుప్రియ కు ఇచ్చి హైదరాబాద్ లోని జలవిహార్ లో ఘనం గా వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతాఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరై వధూవరులకు భగవద్గీత గ్రంధాన్ని బహూకరించి, వారిచేత ఒక గీతా శ్లోకం చెప్పించి ఆశీర్వదించారు. ఆ సందర్భం లోని కొన్ని చిత్రాలు ఇక్కడ….
 

హైదరాబాద్ లోని పాతబస్తీ కార్వాన్ లో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళ్

“నహి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిమ్ తాత గచ్ఛతి … అనే గీతా వాక్యాన్ని అనుసరించి.. లోక కల్యాణం కోసం ఎవరైతే నిస్వార్ధం గా పనులు చేస్తారో వారు లోకం దృష్టిలో మరణాన్ని జయించిన చిరంజీవులే… కాబట్టి దేహం కోసం కాక -దేశం కోసం, ధర్మం కోసం, హిందూ మత పరిరక్షణ కోసం అంకితమైన మహనీయుడు ఛత్రపతి శివాజీ ..” అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. హైదరాబాద్ లోని పాతబస్తీ కార్వాన్ లో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళ్’ వారు అత్యంత ఘనం గా నిర్వహించిన ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై యువతను చైతన్య పరుస్తూ ఉత్తేజపూర్వక గాన ప్రసంగం చేశారు. శివాజీ జీవితం లోని ప్రతి అడుగూ భారతజాతికి స్ఫూర్తి దాయకమని, శివాజీ తన తండ్రి షాహాజి నుంచి దేశభక్తిని, తల్లి జిజాబాయి నుంచి దేశభక్తులు, దైవభక్తుల కథలు నేర్చుకుని దేశానికి అంకితమైన దేశభక్తుడని, కాబట్టి నేటి సమాజం లో తల్లి తండ్రులు వారి బిడ్డలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యం తో పెంచాలని గంగాధర శాస్త్రి అన్నారు. శివాజీ -మొఘల్ సామ్రాజ్యాన్ని, బీజాపూర్, గోల్కొండ సుల్తాను లను వణికించినవాడని చెప్పారు. ఓటమి తప్పనప్పుడు యుద్ధం నుంచి తప్పుకుని, అనువైన సమయం చూసుకుని దాడిచేసే గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యూహాత్మకమైన నాయకుడని అన్నారు. శివాజీకి 12 సంవత్సరాల వయసప్పుడు అతని తండ్రి తాను పనిచేసే బీజాపూర్ సుల్తాన్ కి పరిచయం చేస్తూ సలాం చేయమన్నప్పుడు ‘ఈ దేశాన్ని గౌరవించని పరాయి రాజు ముందు వంగి సలాం చేయను’ అని చెప్పిన ధైర్యవంతుడు శివాజీ అన్నారు. శివాజీ అన్ని మతాలనూ గౌరవిస్తూ గుళ్ళతో పాటు మసీదులను కూడాకట్టించాడని అన్నారు. ఒకసారి శివాజీ సైనికులు ఒక అందమైన ముస్లిం యువతిని బంధించి శివాజీ ముందు హాజరు పరచి బహుమానం ఆశించగా…శివాజీ వారిని మందలించి – ఆమె కాళ్లపై పడి, తన సైనికులు చేసిన పనికి క్షమించమని కోరుతూ ‘నా తల్లి కూడా నీ అంత అందగత్తె అయ్యుంటే నేను ఇంకెంత అందం గా పుట్టి ఉండేవాడినో …” అని ప్రశంసించి ఆమె ను ఇంటికి క్షేమం గా పంపించాడని … ఈ సంఘటన శివాజీ సంస్కారాన్ని చాటిచెబుతుందని గంగాధర శాస్త్రి అన్నారు. సతీ సహగమనాన్ని నిషేధించాడని, ధర్మ రక్షణకై నిలబడ్డాడని, జమిందారీ వ్యవస్థను రద్దు చేసాడని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసాడని అన్నారు. శివాజీ ముస్లిం లకు వ్యతిరేకి కాదనీ, ఆయన సైన్యం లో ముస్లిం లకు కూడా స్థానం కల్పించాడని, అయితే హిందూ సంస్కృతిని గౌరవించని ముస్లిం లకు మాత్రమే ఆయన సింహ స్వప్నం గా నిలిచాడని గంగాధర శాస్త్రి అన్నారు. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదని, ఎంతమంది హృదయాలలో జీవించామన్నది ముఖ్యమని శివాజీ జీవితం చెబుతుందని అన్నారు. 50 ఏళ్ళు మాత్రమే జీవించిన శివాజీ 392 ఏళ్ల తర్వాత కూడా భారతీయుల గుండెల్లో ఆరాధ్యుడు గా ఉండడమే గమనించవలసిన విశేషమని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతా మార్గం లో నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ, ప్రచారం చేస్తూ, కాపాడుకుంటూ, తర్వాత తరాల వారికి అందజేయవలసిన బాధ్యత ప్రతిఒక్క హిందువు పైన ఉందని అన్నారు. మహాత్ముల జయంతులు ఒక్కరోజు పండగ కాకూడదని, వారి ఆశయాలను ఆచరించిన్నప్పుడే వారికి ఘనమైన నివాళి అర్పించినవారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో – దేశ దారుఢ్యము పెరగాలంటే అందుకు దేహ దారుఢ్యమూ అవసరమని చెబుతూ బాలల చేత సాము గారడీ విన్యాసాలు చేయించారు. ఛత్రపతి శివాజీ మజరాజ్ సేవాదళ్ అధ్యక్షులు జి శంకర్ – శ్రీ గంగాధర శాస్త్రి ని, మరో విశేష అతిథి శ్రీ మామిడి గిరిధర్ ను సత్కరించారు.

 

ఇండస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి పార్టీ నేత శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యం లో హ

ప్రపంచం లో అత్యంత బలమైన మతం హిందూమతమని, కానీ దురదృష్టవశాత్తు హిందువులే అత్యంత బలహీనం గా ఉన్నారని, తమ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం లో వెనకబడి ఉన్నారనీ, అందుకే హిందువుల పైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయని, ఇతర మతస్థులు కన్వర్షన్స్ పేరుతో హిందువుల ఉనికి ని నాశనం చేస్తున్నారని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి పార్టీ నేత శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యం లో హన్మకొండ లో జరిగిన మహాశివరాత్రి వేడుకలలో ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. హిందూమతం పట్ల ప్రతి ఒక్క హిందువూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఇటు హిందూయిజం, అటు హిందువూ ఇద్దరూ బలోపేతం అవుతారని, ఇందులో భాగం గా బాల్యదశ నుండే భగవవద్గీతాధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. మన తల్లితండ్రులను, ఆరోగ్యాన్ని , ఆస్తులను కాపాడుకున్నట్టే హిందూధర్మాన్ని కాపాడుకోవాలని, ఇది ఒక్కటే సార్వజనీనమైన, ఉత్తమజీవనవిధాన మార్గమని గంగాధర శాస్త్రి అన్నారు. స్వార్థరహిత ఉత్తమసమాజ నిర్మాణం కోసం మన బిడ్డలను గీతా సైనికులుగా తయారుచేయాలని, సర్వ శాస్త్రాల సమాహారమే గీత అని, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టేనని … సమాజం చేయూతతో ఎదిగి తిరిగి సమాజానికి ఇవ్వగలిగినప్పుడే దైవానుగ్రహానికి పాత్రులం కాగలమని అన్నారు. మనం ఆరాధించే దైవాలలో ప్రతి దైవానికి ఒక తత్వం ఉందని, దాన్ని అర్ధం చేసుకోగలిగినప్పుడే మానవ జీవితం సార్ధకమవుతుందని, నిరాడంబరత్వం, సర్వప్రాణులపట్ల సమానత్వం, లోకహితం కోసం కర్మలనాచరించడం, అధర్మాన్ని మసిచేయడం, అనన్య భక్తి కి వశుడు కావడమే శివతత్వమని అన్నారు. మతం తల్లి లాంటిదని, మతమార్పిడి అంటే తల్లిని మార్చడమనే నీచమైన సంస్కృతికి నిదర్శమని గమనించి మాతృ మూర్తిని, మాతృ భూమిని, మాతృ భాషను, మాతృ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రపంచం లోని సర్వమానవులను, సర్వప్రాణులను, సర్వ మతాలను సమానం గా చూసే భారతీయుల సంస్కారానికి స్ఫూర్తి భగవద్గీత లోని ‘ఆత్మౌపమ్యేన సర్వత్ర’ ( 6-32 ) శ్లోకమేనని అన్నారు.ప్రతి హిందువూ ఏ దేవాలయానికి వెళుతున్నాడో ఆ దేవతా ప్రార్థన ఒక్క శ్లోకమైనా నేర్చుకుని తమ బిడ్డలకు నేర్పించడం ద్వారా హిందువుగా తమ ఉనికిని పటిష్టం చేసుకోవాలని పిలుపునిచ్చారు..

మనిషి మరణించే వరకు జీవించడం గొప్పవిషయం కాదని

పమనిషి మరణించే వరకు జీవించడం గొప్పవిషయం కాదని, సమాజానికి తాను చేసిన మంచి పనులద్వారా మరణించాక కూడాజీవించడమే గొప్పవిషయమని, దీనినే మరణాన్ని జయించడమని, ఆవిధం గా ఉత్తమ జీవితాన్ని గడిపి తద్వారా కీర్తిని శేషం గా మిగుల్చుకుని వెళ్లిపోయిన గొప్ప వ్యక్తే దివంగత శ్రీ సిద్ధారెడ్డి జనార్దన రెడ్డి అని – భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి అన్నారు. నెల్లూరు సమీపం లోని గూడూరు కు చెందిన ‘సంస్కృతి సమ్మేళనం’ పూర్వ అధ్యక్షులు కీIIశేII సిద్ధారెడ్డి సంస్మరణార్ధం ఆయన సతీమణి శ్రీమతి ఇంద్రసేనమ్మ, ఆమె సోదరుడు శ్రీ ధనంజయ రెడ్డి, ఆమె కుమారుడు శ్రీ సుధీర్ రెడ్డి, కోడలు శ్రీమతి ప్రణతి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం చేస్తూ – నైతిక విలువలతో కూడిన, ధర్మబద్ధమైన, స్వార్ధ రహిత జీవితం ఎలా గడపాలో భగవద్గీత తెలియ జేస్తుందని అన్నారు. జీవులకు జనన మరణ రూప సంసార చక్రాన్ని తప్పించుకోలేమని, దానిని మనం తప్పించుకోలేమని, ఆ మధ్యలో ఉన్న జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉందని, దానిని ఆదర్శవంతం గా, స్ఫూర్తిదాయకం గా, నిస్వార్ధం గా, లోకహితం కోసం గడపాలని అన్నారు. ఇది మతగ్రంధం కాదని, జీవితం ఎలా గడపలో తెలియజేసే నిఘంటువుని, కాబట్టి బాల్యదశ నుండే భగవద్గీతను నేర్చుకుని, ఇతరులకు నేర్పించే బాధ్యత మనపై ఉందని అన్నారు. భగవద్గీత జీవన గీత అని- దానిని వ్యక్తుల మరణ సమయాలలో ప్రదర్శించి ‘మరణ గీత’ అనే భావనను కలగజేయరాదని గంగాధర శాస్త్రి అన్నారు. అనంతరం సిద్ధారెడ్డి కుటుంబం శ్రీ గంగాధర శాస్త్రి ని ఘనం గా సత్కరించి ఆశీస్సులు పొందింది.