Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ని ‘గీతా గాంధర్వ సుధార్ణవ’ బిరుదుతో సత్కారం…

‘మోహన్ ట్రస్ట్’ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ వ్యాఖ్యాత శ్రీ పి ఎం కె గాంధి ‘తెలుగు కళా వైభవం’ పేరుతో హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో నిర్వహించిన (10.11.2023) కార్యక్రమం లో – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ని ‘గీతా గాంధర్వ సుధార్ణవ’ బిరుదుతో సత్కరించారు. తెలంగాణ బి సి కమిషన్ చైర్మన్ డాII వకుళాభరణం కృష్ణమోహన్ చేతులమీదుగా ఈ సత్కారం జరిగింది. అమెరికాలో ఇటీవల మూడు నెలల పాటు విజయవంతం గా అనేక నగరాలలో తన గీతాగాన ప్రవచనం తో హిందువులను చైతన్య పరచి స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరిస్తున్నట్టు శ్రీ గాంధీ తెలియజేసారు. సత్కారానంతరం శ్రీ గంగాధర శాస్త్రి తన స్పందనను తెలియజేస్తూ – నేటి తరం శారీరకం గా, ప్రతిభ పరం గా, తెలివితేటల పరం గా చాల బలం గా ఉన్నారని మానసికం గా మాత్రం చాలా బలహీనం గా ఉన్నారని, మానసిక వత్తిడులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు సుఖదుఃఖాలను, జయాపజయాలను, లాభాలాభాలను సమం గా తీసుకునే స్థితప్రజ్ఞత్వ లక్షణాన్ని నేర్పగలిగే భగవద్గీత ను భవరోగాలకు దివ్యఔషధం లా భావించి అధ్యయనం చేయగలిగితే ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించవచ్చని అన్నారు. భారత దేశం లో పుట్టిన, మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం భగవద్గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని, పాఠ్యాంశం గా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. గీత లోని విశ్వరూప సందర్శనయోగ ఘట్టాన్ని తాత్పర్యం తో పాడుతూ కళ్ళకు కట్టినట్టు గా వివరించి ప్రేక్షకులను కదిలించారు. నిరు పేదలకు లక్ష కిలోల బియ్యాన్ని పంపిణి చెయ్యాలనే తమ లక్ష్యాన్ని మోహన్ గాంధి వ్యక్తం చేస్తూ వేదికపైన గంగాధర శాస్త్రి చేతుల మీదుగా పేదలకు బియ్యం పంపిణీ చేసినప్పుడు – శ్రీ గంగాధర శాస్త్రి తమ భగవద్గీతా ఫౌండేషన్ తరఫున 25 వేల విరాళాన్ని మోహన్ ట్రస్ట్ కు అందించారు. సమర్ధవంతమైన వ్యాఖ్యానం తో సభలను రంజింపజేస్తూ తెలుగుభాషను కాపాడుతున్నందుకు గాంధీని ప్రశంసించారు.

తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.

తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.

హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.

హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.

శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.

న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.

విస్కాన్సిన్ రాష్ట్రం (అమెరికా) లోని మిల్వాకి నగరం లోని హిందూ దేవాలయం లో, గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘భగవద్గీత-జీవన గీత’ అనే అంశం పై ప్రవచనం…..

‘కనిపించనంత మాత్రాన దేవుడు లేడనుకోకు. యోగమాయ ఆవరించబడి ఉండడం వల్ల దేవుడు కనిపించడు. అనన్య భక్తి చేతనే యోగమాయ ను దాటి పరమాత్మను చేరవచ్చు. దేవాలయం లో దేవుడున్నాడనుకోవడం భక్తి. పరమాత్మ సర్వత్రా వ్యాపించియున్నాడని తెలుసుకోవడం జ్ఞానం… ఈ జ్ఞానం పొందాలనుకునే వాడికి ఉండాల్సిన అర్హతలను కృష్ణ పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం లో 7 – 11 శ్లోకాలలో వివరిస్తాడు. జీవితం లో తలెత్తే ఎన్నో సందేహాలకు సమాధానం, మానసిక వత్తిడులను దూరం చేసే దివ్యఔషధం భగవద్గీత ! కాబట్టి భగవద్గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించండి. భారతీయ సంస్కృతిని కాపాడండి. ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన ఉపదేశం కాదు. సర్వ మానవాళికీ ఉపయుక్తమైనది. ” అన్నారు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. విస్కాన్సిన్ రాష్ట్రం (అమెరికా) లోని మిల్వాకి నగరం లోని హిందూ దేవాలయం లో, గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘భగవద్గీత-జీవన గీత’ అనే అంశం పై ప్రవచనం చేశారు. (29.9.2023) ఈ దేవాలయ పూర్వాధ్యక్షులు శ్రీ వెంకట్ కొడాలి శ్రీ గంగాధర శాస్త్రి ని ఆహ్వానిస్తూ – పూర్వాశ్రమo లో సినీ గాయకుడు గా ఉండి, గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఒకే ఒక్క తెలుగు గాయకుడు అన్నారు. ఆనంద్ అడవి భగవద్గీతా ప్రచారం కోసమే ఆవిర్భవించిన భగవద్గీతా ఫౌండేషన్ ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టిందని, ఈ ఆధ్యాత్మిక, సామాజిక సేవాసంస్థ కు అందరూ చేయూతను అందించాలని కోరారు. కార్యక్రమానికి ముందు శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రయాణం పైన రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చెప్పిన గీతాశ్లోకాలను మోరిస్విల్ మేయర్ శ్రీ టి జె కాలి తిరిగి ఉచ్చరించారు. గంగాధర శాస్త్రి ఆయనకు కుంకుమ తిలకం దిద్ది, తాను గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన పేటికను జ్ఞాపిక గా అందించగా, టి జె కాలి శ్రీ గంగాధర శాస్త్రి కి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు….

గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చెప్పిన గీతాశ్లోకాలను మోరిస్విల్ మేయర్ శ్రీ టి జె కాలి తిరిగి ఉచ్చరించారు. గంగాధర శాస్త్రి ఆయనకు కుంకుమ తిలకం దిద్ది, తాను గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన పేటికను జ్ఞాపిక గా అందించగా, టి జె కాలి శ్రీ గంగాధర శాస్త్రి కి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రం లో, కారీ పట్టణం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో (23.9. 2023) శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. నిత్య జీవితం లో భగవద్గీత ను అన్వయించుకుని ఎలా ఆచరించాలో, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని సర్వ మానవాళిని సన్మార్గం లో నడిపించడం కోసం చేసిన కర్తవ్య బోధా రహస్యాన్ని శ్రీ గంగాధర శాస్త్రి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రేక్షకులు ఆసాంతం గీత ను భక్తి శ్రద్ధలతో విని పులకించారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయాన్ని SV TEMPLE గా పిలువ వద్దని, పూర్తి పేరుతో పిలవాలని సూచించారు. వేంకటేశ్వర నామం బాధలను హరించే ఈశ్వర నామం గా గుర్తెరగాలని అన్నారు. అలాగే కృష్ణ అనే నామం కూడా అత్యంత శక్తివంతమైనదని, దానిని పూర్తి గా పలకాలని, సౌలభ్యం కోసం ‘క్రిష్’ గా కత్తిరించి పలకడo ద్వారా కృష్ణ నామ ఫలితాన్ని పొందజాలమని అన్నారు. క్రిష్ అనే ధాతువునకు ఆకర్షించుట అని అర్ధమని, ‘ణ’ అనేది ఆనంద వాచకమని, అందరిని ఆకర్షించే నిత్యానంద స్వరూపుడు కాబట్టి ఆయన కృష్ణుడయ్యాడని గంగాధర శాస్త్రి అన్నారు. మానవ జన్మను పవిత్రం చేసే పుణ్య కర్మలైన యజ్ఞ దాన తపస్సులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గీత చెబుతోందని అన్నారు. శ్రీ గంగాధర శాస్త్రి విశ్వరూప సందర్శన యోగాన్ని తాత్పర్యం తో గానం చేస్తున్నప్పుడు ఆర్ద్రత నిండిన హృదయాలతో చెమర్చిన కళ్ళతో ప్రేక్షకులు కరతాళధ్వనులు సలిపారు. తల్లి తండ్రులు ‘గీత’ను బాల్య దశనుండే తమ పిల్లలకు నేర్పించడం ద్వారా సనాతన ధర్మాన్ని తరువాత తరాలకు అందించాలని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీత కేవలం పఠనా గ్రంథం కాదని, అర్ధం చేసుకుని ఆచరించి తరించవలసిన గ్రంథమని అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ చైర్మన్ డాII రాజ్ పోలవరం కు గంగాధర శాస్త్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పవన్ ఎర్రంశెట్టి, డా. వల్లి కొడాలి, శ్రీ సతీష్ గరిమెళ్ళ ల సహకారాన్ని ప్రశంసించారు. భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనందించడం తో పాటు తనకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీమతి లావణ్య, శ్రీ గోపాల్ కేతముక్కల దంపతులకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతం గా నిర్వహించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయo పాలక మండలి అధ్యక్షులు శ్రీ సునిల్ కొల్లూరు ను అభినందించారు. శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనం ద్వారా తమను మరో లోకానికి తీసుకు వెళ్లి మరిచిపోలేని దివ్యమైన అనుభూతి ని పంచిపెట్టారని శ్రీ సునీల్ కొల్లూరు అన్నారు. ఈ కార్యక్రమం లో తానా, టాటా, ట్యూటా, టి టి జి ఏ, హెచ్ ఎస్ ఎన్ సి సంస్థలు తమ సహకారం అందించాయి. ఈ సందర్భం గా బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు ఘనం గా సత్కరించారు.

‘మానవ జాతి కి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం, ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి, తరింపజేసే కర్తవ్య బోధ భగవద్గీత. మనిషి మరణించాక కూడా కీర్తి కాయం తో బ్రతక గలిగే కర్మలను ఆచరించే స్ఫూర్తినివ్వగలిగే దివ్య సందేశం భగవద్గీత…

‘మానవ జాతి కి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే మంత్రపుష్పం, ధర్మ మార్గం లో నడిపించే జ్ఞానజ్యోతి, తరింపజేసే కర్తవ్య బోధ భగవద్గీత. మనిషి మరణించాక కూడా కీర్తి కాయం తో బ్రతక గలిగే కర్మలను ఆచరించే స్ఫూర్తినివ్వగలిగే దివ్య సందేశం భగవద్గీత.. దీని విలువ తెలుసుకోండి.. చదివి అర్ధం చేసుకుని ఆచరించి తరించండి. కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల గురించి శ్రీ రామునితో చెప్పినప్పుడు రాముని ముఖం లో ఎలాంటి మార్పు లేకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణాన్ని సూచిస్తుంది. ఆతర్వాత యుగం లో శ్రీకృష్ణుడు కూడా ‘గీత’ ద్వారా మానవుడు ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞుని లక్షణాలను కలిగి ఉండాలని చెబుతాడు. అందుచేత గీత నేర్చుకుంటే మన రాత మార్చుకున్నట్టే .. గీత గొప్పతనాన్ని తెలుసుకుని న్యూ జెర్సీ లో ఉన్న శాటన్ హాల్ యూనివర్సిటీ వారు తమ యూనివర్సిటీ లో MBA చదివే విద్యార్థులకు భగవద్గీతను ‘A JOURNEY TRANSFERMATION’ పేరుతో బోధిస్తున్నారు. ఇందుకు భారతీయులమైన మనం గర్వించాలి ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ..! ఆయనను – న్యూజెర్సీ, అమెరికా లోని ‘సాయి దత్త పీఠం కల్చరల్ సెంటర్’, ‘మన అమెరికా తెలుగు అసోసియేషన్’ (MATA), తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (TFAS) సంస్థలు ‘గీతారత్న’ బిరుదుతో ఘనం గా సత్కరించాయి.(16.9.2023 ) ఈ మూడు సంస్థలను కలుపుకుంటూ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారధి గా దశాబ్దాలుగా కళారంగానికి, ఆధ్యాత్మిక రంగానికి సేవలందిస్తున్న శ్రీ ఊటుకూరి ప్రసాద్ శ్రీ గంగాధర శాస్త్రి చే ‘గీతా గాన ప్రవచన’ కార్యక్రమాన్ని అత్యంత ఘనం గా నిర్వహించారు. ఈ మూడు సంస్థల అధ్యక్షులైన బ్రహ్మశ్రీ రఘు శర్మ, శ్రీ శ్రీనివాస్ గనగోని, శ్రీ మధు రాచకుళ్ల లు శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన వైభవాన్ని ప్రస్తుతించారు. ఆయన గాత్రం లో శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శించామని అన్నారు. భగవద్గీతను ప్రతి ఒక్కరి చేతా చదివించే స్ఫూర్తి తో సాగిన అయన ప్రవచనం గతం లో ఎక్కడా తాము వినలేదని అన్నారు. మూడు గంటల పాటు సాగిన గీతా గాన గంగాప్రవాహం లో తాము ఓలలాడామని, ప్రవచనం ప్రారంభం నుంచి చివరి వరకూ, రాత్రి గం.10.30 దాటినా ఒక్కరు కూడా కదలకుండా ఆసక్తి గా వినడం తాము ఏ కార్యక్రమం లోనూ చూడలేదని అభిప్రాయపడ్డారు. ఇది తాము పొందిన ఒక దివ్యానుభూతి గా భావిస్తున్నామని అన్నారు. ఇందుకు నిర్వాహకుడైన శ్రీ ఊటుకూరి ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. శ్రీ దాము గేదల అభ్యర్ధన మేరకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ సినీ గీయ రచయిత శ్రీ చంద్రబోస్, శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రయాణ విశిష్ఠతను కొనియాడుతూ ప్రత్యేకం గా రాసి ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని శ్రీ మధు రాచకుల్ల చదివి వినిపించగా మూడు సంస్థల ప్రతినిధులూ కలిసి శ్రీ గంగాధర శాస్త్రి కి బహూకరించారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి -శ్రీ చంద్రబోస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రఘు శర్మ తమ దేవస్థానం లో కొలువై ఉన్న దేవి దేవతలకు గంగాధర శాస్త్రి చేత ప్రత్యేక పూజలు చేయించి, శ్రీ వేంకటేశ్వరుని శేష వస్త్రాలతో సత్కరించారు.

అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనం….

‘గర్భం లో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు.. తల్లిగర్భంలోనే విష్ణు తత్వం విని ప్రహ్లాదుడు పరమ వైష్ణవ భక్తుడైనట్టు … తల్లి గర్భం లో ఉన్నప్పుడే శిశువుకు భగవద్గీతను వినిపిస్తే – ఈ లోకం లోకి వచ్చాక లౌకిక మైన కర్మలను ఆచరిస్తూనే ఆధ్యాత్మ జ్ఞాని అవుతాడు. భవబంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించ గలుగుతాడు. మానసిక వత్తిడి లేని ఆరోగ్యవంతుడు గా జీవితం కొనసాగిస్తాడు. నిస్వార్ధం గా లోకహితం కోసం కర్మలను ఆచరిస్తాడు. తనని శాశ్వతుడిని చేసే కర్మల పట్ల ఆసక్తి చూపుతాడు. లక్ష్యం చేరుకోవడం కోసం చేసే ప్రయాణాన్ని అనుక్షణం ఆస్వాదించగలుగుతాడు. భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడి కి ఉపదేశించిన ప్రతీ శ్లోకమూ సకల మానవాళి కి ఉపయోగపడే ఒక్కో జీవిత పాఠం … ! అందుకే కనీసం బాల్యదశ నుండైనా మీ పిల్లలకు భగవద్గీతామృతాన్ని రుచి చూపించండి.. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. సందేహం లేదు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అద్దం ముందు నిలబడితే మనం భౌతికం గా ఎలా ఉంటామో మాత్రమే తెలుస్తుంది. భగవద్గీత అనే అద్దం ముందు నిలబడితే మన తత్త్వ మేమిటో తెలుస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి, చేసే కర్మలను బట్టి మనం సాత్త్వికులమో, రాజసికులమో, తామసికులమో అర్ధమవుతుంది. మన తప్పుటడుగుల్ని సరిచేసి, మనల్ని మనం ఉద్ధరించుకునే అవకాశం కల్పిస్తుంది గీత..!’ అన్నారు గంగాధర శాస్త్రి. నిత్యజీవితానికి భగవద్గీత ను అన్వయిస్తూ సాగిన ప్రవచనం ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై విన్నారు. ఈ సందర్భం గా అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి గాన ప్రవచనా సరళి పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ”గీతా గాన కౌస్తుభ” బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమానికి రూపకల్పన చేసి, నడిపించిన తీరు అద్వితీయమని శ్రీ గంగాధర శాస్త్రి అసోసియేషన్ సభ్యులను ప్రశంసిస్తూ – బోర్డు చైర్ పర్సన్, శ్రీ అమ్మిరెడ్డి శ్రీధర్, ప్రెసిడెంట్ శ్రీ నరేంద్ర దుద్దెల, వైస్ ప్రెసిడెంట్ శ్రీ చంద్ర శేఖర్ యక్కలి, బోర్డు సభ్యులు శ్రీ శ్రీనివాస్ పెనుగొండ, శ్రీ శివ తియ్యగూర, కోశాధికారులు శ్రీ ఫణి కుమార్, శ్రీ ఉదయ్, శ్రీమతి శ్రావణి మేక, శ్రీ విశేష్ రేపల్లె, శ్రీమతి సరిత, పాండురంగ, శ్రీమతి రాధికా గాదిరాజు, శ్రీనుకుమార్, లకు కృతజ్ఞతలు తెలియజేసారు. తమ తెలుగు భగవద్గీత కు చేయూత నందించడమే గాక, ఆత్మీయ ఆతిధ్యం అందిస్తూ ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తలు గా వ్యవహరించి, ఘన విజయం చేకూర్చిన వదాన్యులు శ్రీ రాజగోపాల్, శ్రీమతి అరుణ రంగినేని లకు డా గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు. కార్యక్రమానికి ముందు హిందూ దేవాలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు మహేంద్రాడ నిర్వహణలో హిందూ దేవాలయం లోని శ్రీవెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై గణపతి కీర్తన తో పాటు, భగవద్గీత శ్లోకాలు గానం చేసిన చిII శ్రీనిధి ని గంగాధర శాస్త్రి అభినందన పూర్వక ఆశీస్సులందించారు.