Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

Blogs

  1. Home
  2. »
  3. Blogs

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి – అమెరికా లోని న్యూయార్క్ రాజధాని అయిన ఆల్బని లోని తెలుగు సంఘం ( ATA ) ఆహ్వానం మేరకు వెళ్లి, కొన్ని కార్యక్రమాలలో పాల్గొని భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని వివరిస్తూ గాన ప్రసంగాలు చేశారు.

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి....

Read More

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా కనిపించే ‘THE CROSS ROADS OF THE WORLD’ గా ప్రసిద్ధిగాంచిన TIME SQUARE కూడలిలో, తెలుగు వారు మరియు విదేశ పర్యాటకుల కరతాళ ధ్వనుల నడుమ -‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గాత్రం లో, భగవద్గీత…..

అమెరికా లోని న్యూ యార్క్ మహానగరం లో, నిత్యం మహా రద్దీ గా...

Read More

దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ లు ఆయన అవతార పరమార్ధం. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడుంటాడు…. గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి.

“చైత్ర శుద్ధ నవమి – శ్రీరాముడు పుట్టిన రోజు..! శ్రావణ బహుళ అష్టమి-...

Read More

అమెరికా లోని సిన్సినాటి లో శ్రీమాన్ డాII వేదాంతం రామానుజాచారి గృహం లో (18.8.2024) ఏర్పాటుచేసిన గీతా సత్సంగం లో శ్రీ గంగాధర శాస్త్రి గీతాగాన ప్రవచనం….

‘కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః I అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతిః...

Read More

ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలుగుతూ, ఉత్తమ సంతానాన్ని ప్రపంచానికి అందించడమే వైవాహిక జీవిత పరమార్థం…గీతా గాన ప్రవచన, ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి.

“వివాహాలు అందరూ చేసుకుంటారు. కానీ వైవాహిక జీవితాన్ని ఆదర్శవంతం గా సాధించేవారు అతి...

Read More

‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సినారే 93 వ జన్మదినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో (23.7.2024)ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి…

“తెలుగు భాష అభ్యున్నతికే తన జీవితాన్ని అంకితం చేసి, తన రచనల ద్వారా...

Read More

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే…

“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం …...

Read More

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి గా నియమితులైన సందర్భం గా శ్రీ జి. కిషన్ రెడ్డి ని – గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ అధ్యక్షులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, శ్రీ ఆజాద్ బాబు తో మర్యాదపూర్వకం గా కలిసి అభినందించారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖామంత్రి గా నియమితులైన సందర్భం గా శ్రీ జి....

Read More

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్ – హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ ను (16.5. 2024) సందర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారులు శ్రీమాన్ జ్వాలాపురం శీకాంత్...

Read More

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా-భగవద్గీతా ప్రచార యాత్ర లో భాగం గా ముగింపు కార్యక్రమాన్ని – మెల్బోర్న్ లోని TAAI (ఆస్ట్రేలియా తెలుగు సంఘం) సంస్థ అత్యంత వైభవం గా, ప్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకునే విధం గా ( 6.4.2024-మౌంట్ వేవర్లీ కమ్మ్యూనిటీ సెంటర్ )నిర్వహించింది.

‘విశ్వశాంతి’ ని, శ్రేయస్సునూ కాంక్షిస్తూ – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్...

Read More

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన...

Read More

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా ద్వితీయ కార్యక్రమం – గోల్డ్ కోస్ట్ లోని, రోబినా కమ్యూనిటీ సెంటర్ లో, ‘గోల్డ్ కోస్ట్ తెలుగు సంఘం (TAG)’ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది.

‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన...

Read More