Latest News

FCRA Regn. No. 010220252,

Approval U/S 80G (5) (VI) of I.T Act,

PAN No. AAAAB5882A

  • ABOUT

Ghantasala Bhagavadgita

Though several singers in India sang Bhagavadgita and brought out recordings, the rendering of Gita by the South Indian Singer ‘Padmasri’ Ghantasala Venkateswara Rao with a rare touch of devotion and appeal, acquiring an unrivalled popularity. The famous recording firm HMV got 106 of the 700 slokas of Bhagavadgita set to melodious music by Sri Ghantasala and recorded them with meaning. It was released as a set of two Gramophone records on the 21st April, 1974 at Vijayawada through the hands of that legendary Telugu actor ‘Padmasri’ N.T.Rama Rao.

ఘంటసాల 'భగవద్గీత'

భారతదేశంలో గతంలో అనేక మంది గాయకులు ’భగవద్గీత’ను పాడి, రికార్డులుగా వెలువరించినప్పటికీ – దక్షిణ భారతీయ గాయకుడైన ‛పద్మశ్రీ’ ఘంటసాల వేంకటేశ్వరరావు భక్తి, భావ రంజకంగా పాడిన ’భగవద్గీత’ ప్రత్యేకతను, విశేష ప్రాచుర్యాన్నీ పొందింది. ’భగవద్గీత’లోని 700 శ్లోకాలలో ఎంపిక చేసిన 106 శ్లోకాలను ప్రముఖ రికార్డింగ్ కంపెనీ హెచ్.ఎమ్.వి. సంస్థ ఘంటసాల చేత స్వరబద్ధం చేయించి, తాత్పర్య సహితంగా గానం చేయించి, రికార్డు చేసింది. 1974 ఎప్రిల్ 21న విజయవాడలో దివంగత మహానటుడు ’పద్మశ్రీ’ ఎన్.టి.రామారావు చేతుల మీదుగా ఈ ’భగవద్గీత’ జంట రికార్డులుగా విడుదలై శాశ్వతమైన కీర్తిని ఆర్జించుకుంది.