“సనాతనమంటే – ఎవ్వరూ నశింపజేలేని శాశ్వతమైనది…. ధర్మమంటే – సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మ…! ఇదే సనాతన ధర్మమంటే. జీవరాశులన్నింటిలోనూ మానవ జన్మ అత్యున్నతమైనది కాబట్టి ఈ మానవులు సక్రమమార్గం లో ప్రవర్తించడానికి పరమేశ్వరుడు ఏర్పాటు చేసిందే – ధర్మం…! ఈ సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరి లోనూ అవగాహన పెరగాలి. ముఖ్యం గా తల్లి తండ్రులు ప్రతి రోజూ తమ బిడ్డలతో కాసేపు దేశము, దైవము, ధర్మము గురించి మాట్లాడాలి. తమ లోకానుభవాలను, ఆలోచనలను, ఆదర్శాలను, సంస్కారాలను, జ్ఞానవిజ్ఞానాలను బిడ్డలతో పంచుకోవడం కోసం సమయం కేటాయించాలి. అలా చేయకపోతే జీవితానికి అర్ధం పరమార్ధం పిల్లలకు బోధపడదు. వారు యాంత్రిక జీవితం గడుపుతారు. డబ్బుకోసమే జీవిస్తారు. మానసిక వత్తిడులను అధిగమించలేరు. దేనినీ గుడ్డి గా, యాంతికం గా అనుసరించరాదు. అర్ధం, పరమార్ధం తెలుసుకుని ఆచరించాలి. హిందూయిజం అత్యంత బలమైనది. అయితే దీనిగు యదార్థ తత్త్వం తెలుసుకోవడం లో హిందువులు అత్యంత బలహీనం గా ఉన్నారు. అందుకే మన హిందూ దేశం లో హిందువులను మతమార్పిడి చేసేందుకు ఒక మతం, లవ్ జీహాద్ పేరుతో మరొక మతం ఒక దుర్మార్గపు లక్ష్యం తో కృషి చేస్తున్నాయి. మతం మార్చేవాడూ, మారేవాడూ ఇద్దరూ దేశద్రోహులే. మన మతాన్ని కాపాడుకునే లక్ష్యం మనలో బలం గా లేకపోవడం దురదృష్టకరం…కేవలం వాట్సాప్ లలో ఆధ్యాత్మిక మెసేజ్ లు ఫార్వర్డ్ చేసుకోవడమే హిందూయిజం అనుకుంటున్నాం తప్ప ఆచరణాత్మక హిందువులనిపించుకోవడంలో మాత్రం బలహీనులు గా ఉన్నాము. అన్ని మతాలూ సమానమని ఎవడైనా అన్నాడంటే వాడికి ఏ మతం పట్లా అవగాహన లేదని తెలుసుకోవాలి. ఇతరమతాలలో మానవులు రాసుకున్న గ్రంధాలకూ, హిందూ మతం లో సాక్షాత్తు దైవమే బోధించిన, అపౌరుషేయాలు గా ప్రసిద్ధి గాంచిన గ్రంథాలకూ పోలికెక్కడిది. తల్లి, తండ్రి, గురువు, అతిధి, 84 లక్షల రకాల జీవరాసులూ దైవాలే అని చెప్పే మన మతానికి – ఇతరమతాలకూ పోలిక ఎక్కడిది… హిందూ బంధువులారా జాగృతం కండి..! మన జాతి బలపడడానికి ఒకే మార్గం భగవద్గీత చదివి అర్ధం చేసుకుని ఆచరించడం…! భగవద్గీత కేవలం హిందూ జనోద్ధరణ కోసం బోధించబడింది కాదు. యావత్ మానవాళి ని ఉద్ధరించడం కోసం భోధించబడిన కర్తవ్యబోధ. మన దేశం జగద్గురు స్థానం..! జీవితం ఎలా గడపాలో తెలుసుకోవాలంటే భగవద్గీత తెలుసుకోవాల్సిందే. తల్లి తండ్రులు రోజుకొక్క శ్లోకం చొప్పున బాల్యదశనుండే పిల్లలకు గీత ను తాత్పర్యం తో సహా నేర్పించడం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. భగవద్గీతను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. భారత ప్రభుత్వం భగవద్గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలి. మన దేశం పేరును కూడా ‘భారత్’ గా మార్చాలి.” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీత ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్.వి. గంగాధర శాస్త్రి. హిందూ స్పిరిట్యుయల్ & సర్వీస్ ఫౌండేషన్ ( HSSF Air Jordan 4 Retro Off - CV9388 - White Sail - 100 - Jordan Brand quietly slipped in a new rendition of the low-top nike liberty paisley air max for sale philippines – Tgkb5Shops PF – ‘Air Max 90 WW’ sneakers Nike ) నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో 3 రోజులపాటు అత్యంత వైభవం గా నిర్వహించిన కార్యక్రమాలలో రెండో రోజు (8.11.2024) ఆయన పాల్గొని స్ఫూర్తి దాయకమైన గాన ప్రసంగం చేశారు. ఈ వేదికపై జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ శ్రీమతి విజయ భారతి శ్రీ గంగాధర శాస్త్రిని సత్కరించారు.





















