‘విశ్వశాంతి’ ని కాంక్షిస్తూ ‘భగవద్గీతా గాన ప్రచార శంఖారావం’ పేరుతో – భగవద్గీతాగాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగం గా మూడవ కార్యక్రమం – బ్రిస్బేన్ లోని, ‘తెలుగు లహరి’ సంస్థ ఆధ్వర్యం లో అద్వితీయం గా జరిగింది. గత రెండు దశాబ్దాల కాలం లో బ్రిస్బేన్ లో జరిగిన కార్యక్రమాలలో ఇటువంటి స్ఫూర్తి దాయకమైన గీతా ప్రవచనాన్ని, ప్రేక్షకుల విశేష స్పందన ని తాము చూడలేదని శ్రీ ప్రభాకర్ బచ్చు, శ్రీ హరి పంచుమర్తి తదితరులు పేర్కొన్నారు. “భగవద్గీతను అర్ధం చేసుకుని ఆచరించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిదాయకo గా నిలబడే స్థాయికి ఎదగ వచ్చు. మతాలు ఆవిర్భవించని కాలం లో సర్వదేశాలకు, సర్వ కాలాలకు, సర్వ జాతులకు వర్తించే విధం గా జగత్తులోని ప్రతి మానవుడిని ఉద్దేశించి మహోదాత్త మైన కర్తవ్యోపదేశo చేయడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. భగవద్గీత వృద్ధాప్యపు కాలక్షేపం కాదు. జీవిత ప్రారంభ దశలోనే చదివి అర్ధంచేసుకోవలసిన పాఠం. అందుచేత తల్లి తండ్రులు పిల్లలకు బాల్యదశనుంచే దీనిని నేర్పించాలి. ఇందువల్ల నైతిక విలువలు కలిగిన ఉత్తమ జీవితం గడపవచ్చు. మనం చేసే సత్కర్మల ద్వారా ఇతరులకు స్ఫూర్తిని అందించవచ్చు. ‘కర్మాచరణలో నైపుణ్యమే యోగం’ అని తెలుసుకోవడం ద్వారా సృజనాత్మకం గా పనులు చేసి ప్రపంచం చేత అభినందనలు పొందవచ్చు. మరణించిన తర్వాతకూడా ప్రజల హృదయాలలో జీవించే పనులు చేయవచ్చు. సుఖదుఃఖాల లో స్థితః ప్రజ్ఞతను సాధించవచ్చు. కర్మ ఫలితాన్ని భగవదర్పణం చేయడం ద్వారా ప్రశాంత జీవితాన్ని సాధించవచ్చు. మానసిక వత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు. ఏ ప్రాణి పట్ల ద్వేషభావాన్ని కలుగని సమభావనను అలవరచుకోవచ్చు. ఆత్మహత్యల ఆలోచన లేని జీవితం గడపవచ్చు. తెలిసిన తెలియకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మనమీద కనిపించినట్టే, తెలియకుండా చదివినా భగవద్గీత అనిర్వచనీయమైన ఆనందాన్ని,శక్తిని ఇస్తుంది.” అన్నారు శ్రీ గంగాధర శాస్త్రి. మాతృ భాషను, మాతృ భూమిని, మాతృ సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు. శ్లోకాలద్వారా సంస్కృతాన్ని, పద్యాలద్వారా తెలుగు భాషా మాధుర్యాన్ని పిల్లలకు తెలియజేయాలన్నారు. ‘విశ్వరూప సందర్శన యోగం’ లోని కొన్ని శ్లోకాలను కళ్ళకు కట్టినట్టు తాత్పర్య సహితం గా గానం చేసి ప్రేక్షక శ్రోతలలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపారు. ఈ సందర్భం గా తెలుగు సంస్కృతి, బ్రిస్బేన్ వెబ్సైటు ను శ్రీ గంగాధర శాస్త్రి చేత ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, షిర్డీసాయి సంస్థాన్, తెలంగాణా అసోసియేషన్ అఫ్ క్వీన్స్ ల్యాండ్, పలక- బలపం సంస్థలకు గంగాధర శాస్త్రి అభినందనాపూర్వక ఆశీస్సులందించారు. శ్రీమతి పద్మప్రియ నోరి తెలుగులో చేసిన సుమధురమైన వ్యాఖ్యానాన్ని, శ్రీమతి సుస్మితా రవి, శ్రీమతి రేణుక కరణం, చిరంజీవులు తియాన్సిక, యుక్త ల నాట్యకౌశలాన్ని అభినందిస్తూ, శ్రీ శ్రీధర్ పోపూరి, శ్రీమతి జ్యోత్స్న ల ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈపర్యటన ను దేవా (DEVAA air jordan 1 mid release date air jordan 2 cement grey – DHARMA ENLIGHTENMENT VEDIC ASSOCIATION OF AUSTRALIA off white air jordan 1 canary yellow sample release date info zapatillas de running hombre entrenamiento neutro apoyo talón) సంస్థ వ్యవస్థాపకులు శ్రీమాన్ పవన్ వఝల అత్యంత సమర్ధవంతం గా నిర్వహించినందుకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.