మాతృభూమికి దూరమైనా మాతృ సంస్కృతికి దగ్గరగా ఉంటూ మీరు అత్యంత ఘనం గా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక మహోత్సవం లో (5.7.2025)పాల్గొనడం మహానందం గా ఉంది… భారతీయుల అత్యుత్తమ భావజాలానికి ఎప్పటికీ కాలం చెల్లదు అని చెబుతూ – 5000 సంవత్సరాలక్రితం కృష్ణపరమాత్మ చేత మతాలకతీతం గా బోధించబడి, ఇటీవలే UNESCO చేత గుర్తింపు పొందిన భగవద్గీతను ఈ 24వ తానా మహా సభలలో నా చేత గాన ప్రవచన రూపం లో ప్రచారం కల్పించడం ఆనందదాయకం… ఇదే స్వధర్మం. ఈ ధర్మాన్ని కాపాడుతున్నందుకు … తానా నిర్వాహకులైన శ్రీ నరేన్ కొడాలి, శ్రీ గంగాధర్ నాదెండ్ల, శ్రీ ఉదయ్ కుమార్ చేపలమడుగు, శ్రీ గారపాటి ప్రసాద్, శ్రీ జగదీష్ ప్రభల గార్లకు కృతజ్ఞతలతో … శతమానం భవతి… ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి. తన గీతా గాన ప్రవచనం లో నిత్యజీవితం లో ఆచరించవలసిన కొన్ని గీతా శ్లోకాలను భావ సహితం గా వివరించారు. అవసరం కోసం బయట ఇంగ్లిష్ మాట్లాడినా ఇంట్లో పిల్లలతో తెలుగే మాట్లాడి మాతృ భాషను కాపాడాలన్నారు. మన సంస్కృతిని కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా సంవత్సరమంతా కొనసాగింపు ఉండాలన్నారు. మధ్య మధ్యలో అన్నమయ్య, ఘంటసాల గీతాలు ఆలపించారు. గంగాధర శాస్త్రి గానం చేసిన విశ్వరూపసందర్శన యోగం లోని తాత్పర్యసహిత శ్లోకాలకు విశేషమైన స్పందన లభించింది. చివరన TANA కన్వీనర్ శ్రీ ఉదయకుమార్ చేపలమడుగు, శ్రీ మానేపల్లి ప్రసాద్ లు శ్రీ గంగాధర శాస్త్రిని TANA APPRECIATION AWARD తో సత్కరించారు. తనకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీ రామ కృష్ణ ఎన్ సి, శ్రీమతి లక్ష్మి లకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.

“Though physically distant from our motherland, it is truly heartening to see you remain deeply connected to our mother culture. It has been an immense joy to participate in this grand cultural festival (July 5, 2025), which you are conducting with such dignity and devotion,” said Dr. L.V. Gangadhara Sastry, renowned Bhagavadgita singer, preacher and propagator, Founder Chairman of Bhagavadgita Foundation.

Highlighting the eternal relevance of Indian philosophical thought, he said,

“The timeless wisdom of the Bhagavadgita—imparted by Lord Krishna over 5,000 years ago as a universal message beyond all religions, and recently recognized by UNESCO—was shared by me at this 24th TANA Conference through a musical discourse. It brings me great joy to have carried out this sacred duty (swadharma).” Dr. Sastry expressed heartfelt gratitude to the TANA organizers—Sri Naren Kodali, Sri Gangadhar Nadendla, Sri Uday Kumar Chepalamadugu, Sri Garapati Prasad, and Sri Jagadeesh Prabala—saying, “May you all be blessed with a long and fulfilling life – Shatamaanam Bhavati.”

In his discourse, he explained the deeper meanings of select Bhagavadgita verses relevant to everyday life. He emphasized that while English may be necessary outside the home, Telugu must be spoken with children at home to preserve our mother tongue. He called on everyone not to limit our culture to just occasional events, but to make it a continuous way of life throughout the year. As part of the session, Dr. Sastry also rendered devotional songs by Annamacharya and Ghantasala, adding devotional vibrancy to the atmosphere. His soulful rendition of verses from the Vishwarupa Sandarshana Yoga, complete with profound commentary, received an overwhelming response from the audience.

To conclude the session, TANA Convener Sri Uday Kumar Chepalamadugu and Sri Manepalli Prasad honored Dr. L.V. Gangadhara Sastry with the TANA Appreciation Award. Dr. Sastry also extended his heartfelt thanks to Sri Ramakrishna N.C. and Smt. Lakshmi for their warm and affectionate hospitality.