ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, నిస్వార్ధ, నిష్కామ కర్మయోగి శ్రీరామ స్వామి (శ్రీరామ్ సర్) ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయం లో ( 10.2.2024 ) కాసేపు గడిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకేసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు వారిని స్వాగతించారు. అదే సమయం లో ఫౌండేషన్ లోకి తన తల్లిదండ్రులతో చిII అచ్యుత్ శర్మ అడుగు పెట్టాడు. తాను నేర్చుకున్న భగవద్గీత లోని శ్లోకాలు, పోతన భాగవతం పద్యాలు స్పష్టమైన ఉచ్చారణతో వినిపించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసాడు. ఇదంతా అతని పూర్వజన్మాభ్యాస ప్రభావమేనని, అతని తల్లి తండ్రుల పూర్వ జన్మ సత్కర్మ ఫలితమని గంగాధర శాస్త్రి అన్నారు. శ్రీ ఆజాద్ బాబు, గీతా గురువు శ్రీమతి శైలజ, ‘వేదమాతరం’ పత్రిక సంపాదకులు శ్రీ విశ్వనాథ శోభనాద్రి సమక్షంలో శ్రీ రామ్ స్వామి ఆనందభరితుడై అచ్యుత్ శర్మను ఆశీర్వదించారు.