తుర్కయాంజాల్ ( హైదరాబాద్ ) లోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల హనుమాన్ దీక్షితులు, వారి సోదరులు శ్రీమాన్ అర్వపల్లి వెంకట రఘురామ చక్రవర్తి తో కలిసి – తమ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భం గా, గీతా వైభవ ప్రవచనం కోసం – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని వారి ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భం గా – హనుమాన్ దీక్షితులు తాను స్వహస్తాలతో రాసుకున్న శ్రీమద్రామాయణ లిఖిత పారాయణ గ్రంథాలను శ్రీ గంగాధర శాస్త్రికి చూపించి, రామాయణ విశేషాలను పంచుకున్నారు. ఈ సమావేశం లో శాక్రమెంటో (అమెరికా) నుంచి వచ్చిన శ్రీ ప్రభాకర రావు, ‘భగవద్గీతా ఫౌండేషన్’ అడ్వొకసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు పాల్గొన్నారు.









