ప్రేక్షకులను అలరించే కార్యక్రమాల రూపకల్పనలో విశేషమైన ఖ్యాతి గడించిన 'వనిత' టీవీ ఛానల్ అధినేత శ్రీమతి తుమ్మల రమాదేవి తో - 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి సమావేశమయ్యారు. 'సంపూర్ణ భగవద్గీతా పారాయణ గాన యజ్ఞం' శీర్షికన ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రసిద్ధ ఛానల్ భక్తి టీవీ లో ప్రసారం చేయదలంచిన నేపధ్యం లో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భం గా 'భగవద్గీతా ఫౌండేషన్' అడ్వొకేసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ గంగాధర శాస్త్రి - శ్రీమతి రమాదేవి కి తాను గానం చేసి రూపొందించిన సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ను అందించారు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న భగవద్గీతా బంధువుల చే రోజుకొక అధ్యాయం చొప్పున 18 రోజులపాటు గీతా పారాయణం చేయించి, ఆయా అధ్యాయాలలోని ముఖ్యమైన శ్లోకాల వ్యాఖ్య తో నిత్యజీవితం లో భగవద్గీత ఆచరణం గురించిన గాన ప్రసంగం గా కార్యక్రమాన్ని రూపొందించదలచినట్టు గంగాధర శాస్త్రి చెప్పారు. ఈ సమావేశం లో భక్తి ఛానల్ ప్రోగ్రాం చీఫ్ శ్రీ రఘు పాల్గొన్నారు...