ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం - పాలకమండలి ప్రత్యేక సభ్యులు, తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ గోవిందహరి - హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి, సభ్యులు శ్రీ వి గిరిధరన్, శ్రీ ఆజాద్ బాబు లు శ్రీ గోవిందహరి కి స్వాగతం పలికి, దుశాలువాతో సత్కరించి, భారత దేశపు తొలి సంపూర్ణ భగవద్గీతా గాన ప్రతిని అందజేశారు. అంతకుముందు - భగవద్గీతా ఫౌండేషన్ పుష్కరం పాటు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటరీ ని శ్రీ గోవిందహరి అవగాహన కొరకు ప్రదర్శించారు. అనంతరం - ప్రస్తుతం తాము చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా చేయూత అందించడానికి తన వంతు కృషి చేస్తానని గోవింద హరి అన్నారు.