తెలంగాణ ట్రాన్స్ కో  & జెన్ కో  సి.ఎం.డి  శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు - హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు 'గీతాచార్య' శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కార్యాలయం లోని శ్రీ కృష్ణ విగ్రహానికి శ్రీ ప్రభాకర రావు తులసిమాల వేసి నమస్కరించి, అటుపై గీతా గాన రికార్డింగు ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రదర్శించిన లఘుచిత్రాన్ని తిలకించి, పులకించి గంగాధర శాస్త్రిని అభినందించారు. పరమాత్ముని అనుగ్రహం చేతనే ఇంతటి మహత్కార్యాన్ని గంగాధర శాస్త్రి సాధించగలిగారని అన్నారు. ఈ సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ భవిష్యత్తు ప్రణాళికలను శ్రీ గంగాధర శాస్త్రి వివరించగా , ఈ గీతా యజ్ఞం లో  తానూ ఒక సమిధగా ఉపయోగపడతానని శ్రీ ప్రభాకరరావు అన్నారు.  ఈ కార్యక్రమం లో శ్రీ ప్రభాకర రావు, శ్రీ  వై. రామారావు, Advocate, Telangana HighCourt, డాII హెచ్.ఆర్.వి. రాజ్ కుమార్, Dr. H.R.V. Rajkumar, Professor and Head of the Department of Microbiology and Infectious Diseases, Kamineni Academy of Medical Sciences and Research Centre, శ్రీ  మంతెన శ్రీనివాస రాజు, Chairman, Nalanda Group of Colleges లను శ్రీ గంగాధర శాస్త్రి, శ్రీ అజాద్ బాబు లు సత్కరించారు..
.