తెలంగాణా ప్రభుత్వ , ఢిల్లీ అధికార ప్రతినిధి డా II వేణుగోపాలాచారి - హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని ని సందర్శించారు. ఫౌండేషన్ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి - ఫౌండేషన్ కార్యక్రమాలను డాక్యుమెంటరీ రూపం లో చూపించి వేణుగోపాలాచారి కి వివరించారు. భవిష్యత్తులో భగవద్గీత తెలియని హిందువు అంటూ ఉండకూడదని..ఈ దేశం లో హిందూయిజం బలపడాలంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతను అధ్యయనం చేయాలని.. ఆ దిశగా ఫౌండేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఇప్పటికే గీతను మరణ గీత గా కాక జీవన గీత గా అందరూ ఉపయోగించేట్టుగా భగవద్గీతా ఫౌండేషన్ వివిధ కార్యక్రమాల రూపం లో ప్రచారం చేస్తోందని గంగాధర శాస్త్రి వివరించారు. ఫౌండేషన్ రూపొందించాలని సంకల్పించిన "గీతా సంస్థాన్ " వ్యవస్థ కి ప్రభుత్వ సహకారం అందించాలని సభ్యురాలు శ్రీమతి గీతామూర్తి కోరగా - ఫౌండేషన్ కార్యక్రమాలకు, చేపట్టబోయే ప్రాజెక్టులకు ప్రభుత్వం సహకరిస్తుందని వేణుగోపాలాచారి అన్నారు. ఈ సందర్భం గా డా II వేణుగోపాలాచారిని ఫౌండేషన్ సభ్యులు దుశ్శాలువాతోనూ, గంగాధర శాస్త్రి గానం చేసిన భారత దేశపు తొలి సంగీత భరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీత పేటిక తోనూ సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు శ్రీయుతులు బి ఎస్ శర్మ, లక్ష్మీనారాయణ, గిరిధర్ మామిడి,. రఘు, చలపతి రాజు, సూర్యప్రకాష్ , ధీరజ్ , శ్రీమతి గీతా మూర్తి తదితరులు పాల్గొన్నారు.