భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పీ మురళీధర రావు - రాజకీయాలకు అతీతం గా , రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే అనే నినాదం తో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ఔన్నత్యాన్ని తరువాత తరాల వారికి వారసత్వ సంపదగా అందించాలనే ధ్యేయం తో 'తెలుగు సంగమం'అనే సంస్థని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఈ నెల 19 న 'సంక్రాంతి సమ్మేళనం' కార్యక్రమాన్ని అత్యంత వైభవం గా నిర్వహించారు. తెలుగు జాతి సమైక్య గీతి ని విశేషం గా కాపాడుకున్న ఈ కార్యక్రమం లో పలువురు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళా, సేవా రంగాయాలకు చెందిన ప్రముఖులు వందలాదిగా తరలి వచ్చారు. శ్రీ పి మురళీధర రావు స్వాగత వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ విశేషమైన కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతాఫౌండషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి సమన్వయకర్త గా, వ్యాఖ్యాతగా, గాయకుడు గా వ్యవహరించి కార్యక్రమాన్ని రంజింపచేశారు. ఆయన గానానికి తాను పరవశించానని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ ప్రశంసించి గంగాధర శాస్త్రి ని సత్కరించారు.
ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ మరో విశిష్ట అతిథి గా విచ్చేసారు. ఈ కార్యక్రమం లో ప్రసిద్ధ సినీనటులు శ్రీ కృష్ణం రాజుని, గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ని తెలుగుసంగమం వేదిక ఘనం గా సత్కరించింది.