తాండూర్ లో "అఖండ గీతా పారాయణ కార్యక్రమం"

'సర్వ మానవాళికి ఉత్తమ జీవన విధాన మార్గాన్ని బోధించిన మతాతీతమైన,మహిమాన్వితమైన గ్రంథం భగవద్గీత' అన్నారు - ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ! ఆదివారం ( 5. 05. 2019) నాడు వికారాబాద్ జిల్లా తాండూర్ లో జరిగిన అఖండ గీతా పారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వెళ్లి భగవద్గీత వైశిష్ట్యం గురించి గాన ప్రసంగం చేశారు.

హిందువులు బలపడాలంటే భగవద్గీత పట్ల సంపూర్ణ అవగాహన అవసరమని ఆయన అన్నారు.. భారత దేశం లో పుట్టినందుకు భగవద్గీత, తెలుగు రాష్ట్రాలలో పుట్టినందుకు పోతన పద్యం మన బిడ్డలకు నేర్పించడం ద్వారా మన సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు.

నిస్వార్థమైన ఉత్తమ సమాజ నిర్మాణానికి భగవద్గీత కంటే ఉత్తమ బోధనా గ్రంథం మరొకటి లేదని అన్నారు... ఇది శ్రీకృష్ణుడు తాను భగవంతుడు గా ప్రకటించుకుని అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని సర్వ మానవాళికి బోధించిన సార్వజనీనమైన ఉపదేశమని, కాబట్టి గీతలో ఉపదేశించబడిన శ్లోకాలన్నీ శక్తివంతమైన మంత్రాలనీ గంగాధర శాస్త్రి అన్నారు. చివరన ఆయన గానం చేసిన కృష్ణ భజనకి భక్తులు పారవశ్యంతో నృత్యం చేశారు. గాన ప్రసంగం అనంతరం 'గీతాగానగంధర్వ' శ్రీ గంగాధర శాస్త్రి ని నిర్వాహక సభ్యులు శ్రీ క్రిష్ణయ్య తదితరులు ఘనం గా సత్కరించారు. అంతక్రితం సదానందరెడ్డి ఆధ్వర్యం లో శ్రీ గంగాధర శాస్త్రి అనంత గిరి లో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామీ వారికి పూజలు నిర్వహించి ఆలయమర్యాదలతో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు

.