'ఆల్ ఫోర్స్ జెన్ నెక్స్ట్' వార్షికోత్సవాలు

కరీంనగర్ లోని ప్రముఖ విద్యా సంస్థ 'ఆల్ ఫోర్స్ జెన్ నెక్స్ట్' వార్షికోత్సవానికి - ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ముఖ్య అతిథి గా హాజరై జ్యోతి ప్రకాశనం చేసి "కర్తవ్యం,లక్ష్యం, నైతిక విలువలు, భగవద్గీత ' అనే అంశాలపై విద్యార్థులను, తల్లి తండ్రులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం - వివిధ విభాగాలలో ప్రతిభా పాటవాలను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు శ్రీ గంగాధర శాస్త్రి బహుమతి ప్రదానం చేసారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నరేందర్ రెడ్డి - గంగాధర శాస్త్రి ని సత్కరించారు.