"రాజమండ్రి వైఎస్సార్సిపి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ మార్గాని భరత్ రామ్ - హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని ఆదివారం (9-6-2019) సందర్శించారు. ఫౌండేషన్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఫౌండేషన్ చేసిన, చేస్తున్న కార్యక్రమాలను డాక్యూమెంటరీ రూపం లో భరత్ రామ్ తెలుసుకుని అభినందించారు. ఈ సందర్భం గా తనకూ ఆధ్యాత్మిక ఆసక్తి ఉందని చెబుతూ శ్రీ సూక్తాన్ని స్వరితం గా పఠించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ద్వారకా తిరుమల లో- ప్రపంచం దర్శించి పునీతులయ్యే స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించాలనే తమ సంకల్పాన్ని గంగాధరశాస్త్రి కి వివరించి, భగవద్గీతా ఫౌండేషన్ త్వరలో నిర్మించబోతున్న ఆధ్యాత్మిక కేంద్రం "గీతా సంస్థాన్ " తో అనుసంధానమయ్యేందుకు సహకారాన్ని కోరారు భరత్ రామ్. ఈ సందర్భం గా భరత్ రామ్ ను ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శ్రీ బీకే శర్మ దుశ్శాలువాతో సత్కరించారు. ప్రపంచం లో అత్యాధునిక సాంకేతిక విలువలతో తాము రూపొందించిన సంగీతభరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీత ఆడియో ప్యాక్ ను సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి - భరత్ రామ్ కు అందజేశారు. ఈ కార్యక్రమం లో భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులతో పాటు చైనా మూర్తి , మహమ్మద్ అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.."