ప్రపంచ సోరియాసిస్ దినం (29.10. 2019) సందర్భంగా జూబిలీ హిల్స్, హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సోరియాసిస్ పై ప్రజలకు ఒక అవగాహన, సూచనల కార్యక్రమం జరిగింది.

సుప్రసిద్ధ డెర్మటాలజిస్ట్ డాII అంచల పార్థ సారధి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ గాయకులు, సంగీత దర్శకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి ముఖ్య అతిథి గా హాజరై - 'ఆధ్యాత్మిక ఆరోగ్యం' పై గాన ప్రసంగం చేశారు. జీవన శైలి, పాజిటివ్ థింకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి ఈ వ్యాధిని నిరోధించగలుగుతాయని ఆయన అన్నారు..

ఫలితాన్ని ఊహించి,ఆశించి పనులు చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని, మన చేతుల్లో లేని కర్మ ఫలాన్ని దైవానికి వదిలేసి త్రికరణ శుద్ధిగా, ధర్మబద్ధం గా పనులు చేయమని చెప్పే భగవద్గీతను అనుసరిస్తే... వ్యాధుల శాతం గణనీయం గా తగ్గుతుందని గంగాధర శాస్త్రి అన్నారు. ఇప్పుడు చాలా వ్యాధులకు మానసిక వత్తిడే ప్రధాన కారణమని, దానిని తగ్గించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని, ముఖ్యంగా సన్మార్గానికి, ఆరోగ్యవంతమైన జీవన ప్రయాణానికి - ఆహారము, నిద్ర అలవాట్లను క్రమబద్ధీకరించుకోవాలని భగవద్గీత చెబుతుందని అన్నారు. 'శరీర మాంద్యం ఖలు ధర్మ సాధనం' అన్నట్టుగా ధర్మాన్ని ఆచరించడానికి, లక్ష్యాన్ని చేరుకోడానికి ఆరోగ్యం అవసరమనీపాల్గొని, డాII అంచల పార్థసారథి వంటి వైద్యనారాయణుడు, ఆధ్యాత్మిక వేత్త, గేయరచయిత కి తాను మిత్రుడినని చెప్పుకోవడానికి గర్వ పడతానని గంగాధర శాస్త్రి అన్నారు. అన్నారు.

ఈ కార్యక్రమం లో డాII ఏ ఎస్ కుమార్, డా II రాజ్ కిరణ్, డా II గౌతమి, డా II శృతి తదితరులు పాల్గొని ప్రసంగించారు..