నర్సరావుపేట ఛాంబర్ అఫ్ కామర్స్ వారు - ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి చే గీతాగానప్రవచనాన్ని ఏర్పాటుచేశారు. నర్సరావుపేట, ప్రకాష్ నగర్ లోని టౌన్ హాల్ లో సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమం జరిగింది... మతాలకు అతీతమైన భగవద్గీత వైశిష్ట్యం గురించి రెండున్నర గంటలసేపు గంగాధర శాస్త్రి గారు చేసిన గాన ప్రసంగానికి విశేషమైన స్పందన లభించింది. భగవద్గీత ను మరణ సమయాలలో వినడం అర్ధరహితమనీ, అది బాల్యదశ నుండే అభ్యసించవలసిన జీవిత నిఘంటువనీ, ఇది దేశ కాల జాత్యాదులకు అతీతమైన సార్వజనీన గ్రంథమనీ, ముఖ్యం గా భగవద్గీతను ప్రతి హిందువూ భగవద్గీత నేర్చుకోవాలని, అప్పుడే ఈ దేశం లో హిదూత్వం బలపడుతుందని, తద్వారా స్వార్ధరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుందని గంగాధర శాస్త్రి అన్నారు. చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ చింతా కిరణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో - శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ శ్రీ బాల్ రెడ్డి పృథ్విరాజ్, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట శాసన సభ్యులు డాII గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ శ్రీ ఎం వెంకటేశ్వర్లు తదితరులు విశిష్ట అతిథులుగా హాజరై శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు..