లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ -II రీజన్ మీట్ - కరీంనగర్ లో వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు. ఆయనకు లయన్స్ క్లబ్ ఘన స్వాగతం పలికింది.. భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని బోధిస్తూ శ్రీ గంగాధర శాస్త్రి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వవికాస ప్రసంగం చేశారు. అనంతరం ఆయనను లయన్స్ క్లబ్ సభ్యులు గౌరవ సత్కారం చేసారు. సెల్ఫీ లతో పాటు ఆశీస్సులు తీసుకున్నారు.