చిII పద్మశ్రీజ కూచిపూడి నాట్య "రంగప్రవేశం"

శ్రీ కనుమూరి వెంకట నరసింహ సోమరాజు(డైరెక్టర్- శ్రీ గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్), శ్రీమతి కనుమూరి సౌజన్య దంపతుల కుమార్తె చిII పద్మశ్రీజ కూచిపూడి నాట్య "రంగప్రవేశం" హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో శనివారం ( 4. 5. 2019 ) అత్యంత వైభవం గా జరిగింది. ప్రసిద్ధ గాయకులు , భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి ఈ కార్యక్రమాన్ని , వ్యాఖ్యాత గా ఆద్యంతమూ స్ఫూర్తిదాయకమైన మార్గం లో నడిపించి, అలరించారు. నాట్య గురువు శ్రీ చిరంజోయ్ పోద్దార్ నేతృత్వం లో చిII పద్మశ్రీజ చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా చిII పద్మశ్రీజ ను ఆశీర్వదించడానికి విచ్చేసిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఏ వీ ఎస్ రాజు , మాజీ పార్లమెంట్ సభ్యులు, తి.తి.దే పాలకమండలి పూర్వ అధ్యక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి లను - నిర్వాహకులు ఘనం గా సత్కరించారు.