కంచి పీఠాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి హైదరాబాద్ లోని స్కందగిరి దేవాలయం లో బస చేసిన సందర్భం లో - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి  కుటుంబ సమేతం గా స్వామి ని దర్శించి ఆశీస్సులు పొందారు. తమ భగవద్గీత రికార్డింగ్ సమయం లో  కంచి కి వచ్చి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని కలిసి ఆశీస్సులు పొందిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వీడియో చూపించి, తమ భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న, చేపట్టిన కార్యక్రమాలను స్వామి వారికి వివరించారు. ఈ సందర్భం గా భక్తి గానాన్ని  వినిపించమని స్వామి కోరగా - గంగాధర శాస్త్రి - లింగాష్టకం, శివతాండవ స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం, శ్యామలా దండకం (మహాకవి కాళిదాసు), జయ జయ మహాదేవ శంభో హరా శంకరా  (కాళహస్తిమహాత్మ్యం), నీలకంధరా దేవా (భూకైలాస్), భగవద్గీతా శ్లోకాలను గానం చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి గంగాధర శాస్త్రి దంపతులను దుశ్శాలువ తోను సత్కరించి  కుమారుడు విశ్వతేజ, కుమార్తె కీర్తిప్రియల ను ఆశీర్వదించారు. గంగాధర శాస్త్రి ని ఆశీర్వదిస్తూ - భగవద్గీత ప్రచారానికే జీవితం అంకితం చేయడం పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యిందని,  హర్యానా లోని కురుక్షేత్రం లో భగవద్గీతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందని, అందుకు తమ సహకారం కూడా ఉంటుందని, 27 చరణాలు గల  'శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రాన్ని కూడా ప్రచారం చేయవలసిందని సూచించారు.
.