0

'ఏ పని చేసినా - ధర్మబద్ధం గా చెయ్యాలి. త్రికరణశుద్ధి గా చెయ్యాలి. ఫలితం పరమాత్మదని భావించి చెయ్యాలి. భవబంధాలను వదలి చెయ్యాలి. నిస్వార్ధం గా చెయ్యాలి. అహంకారరహితం గా చెయ్యాలి. లోకహితం కోసం చెయ్యాలి.... ఇదే భగవద్గీత సారాంశం...'


"ఓ అర్జునా... నేనే పరమ గతి అని నమ్మి, సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి, ఇంద్రియ విషయములపట్ల ఆసక్తిని త్యజించి, సమస్త ప్రాణులయందు వైరభావము లేని భక్తుడే నన్ను పొందును." అంటాడు.


'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి. విశ్వహిందూ పరిషత్ 'రాఖీపౌర్ణమి' సందర్భం గా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు."


ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్ బి సుధాకర్ వ్యవస్థాపకుడు గా ప్రసిద్ధ సాంస్కృతిక సంస్థ 'తేజస్విని కల్చరల్ అసోసియేషన్' - ప్రసిద్ధ సినీ నేపధ్య గాయనీమణి పద్మభూషణ్ పి సుశీలకు సి నా రే జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించిన సందర్భం గా..


"భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. రిటైర్మెంటు గ్రంథమూ కాదు. ఉత్తమ జీవన విధాన గ్రంథం. అజ్ఞానాన్ని పారద్రోలి, అనేక సందేహాలను నివృత్తి చేసి, జీవితం పట్ల ఒక స్పష్టత ఏర్పరిచే, మతాలకు అతీతమైన, స్ఫూర్తిదాయకమైన గ్రంథ


భారతానికి భగవద్గీత ఎలాంటిదో, రామాయణానికి సుందరకాండ అలాంటిదని చెబుతూ - సర్వాభీష్టప్రదాయిని, సకలారిష్ట నివారిణి అయిన సుందరకాండ ను నిత్యమూ దేవాలయ సౌండ్ సిస్టం ద్వారా ప్లే చెయ్యాలని,భక్తులు దర్శించుకుని సత్ఫలితాలను పొందవలసిందిగా,ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరారు


అ అంటే అమ్మ .. ఆ అంటే ఆవు అని తెలుగు పిల్లలకు పాఠం చెబుతూ అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చిన తెలుగు భూమిలో కూడా నిత్యం గోవధ జరగడం తెలుగు జాతి దురదృష్టం' అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి.


'భగవద్గీతా పఠనం పరమ లక్ష్యం ఏమిటంటే- అర్ధం చేసుకోవడం, ఆచరించడం... తద్వారా లోక హితమైన కర్మలు చేయడానికి స్ఫూర్తి పొంది శాశ్వతమైన కీర్తిని, జన్మరాహిత్య స్థితిని పొందగలం. కాబట్టే మోక్షగాములు భగవద్గీతను ఆశ్రయిస్తారు. అందుచేత మానసిక వత్తిడి లేని ఆనందాన్ని, మరణం తర్వాత కూడా లోకం దృష్టిలో చిరంజీవిత్వాన్ని పొందాలంటే భగవద్గీతను బాల్యదశనుండే అభ్యసించి సాధన చేయండి.. " అన్నారు భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ గంగాధర శాస్త్రి. స్వర్గీయ తిరుమలశెట్టి విజయలక్ష్మి స్మృత్యర్థం ఆమె భర్త నాగేశ్వరరావు, కుమారుడు రాజశేఖర్ లు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన గీతా గాన ప్రసంగం చేశారు. కృష్ణ పరమాత్మ 'అనిత్యమ్ అసుఖం లోకం' - అంటూ ఈ లోకo అశాశ్వతమని, ఇక్కడ సుఖం లేదని స్పష్టం చేసాడని, దేహ తత్వాన్ని చెబుతూ 'దుఃఖాలయమ్ అశాశ్వతం' అన్నాడని అన్నారు. జనన మరణాలు అనివార్యమని, కానీ వాటి మధ్య జీవితం ఆదర్శవంతంగా , స్ఫూర్తి దాయకంగా, నిస్వార్ధంగా, లోక హితం కోసం సాగాలని, ఇలాంటి భావజాలం, ఆదర్శవంతమైన ఆలోచనలు బాల్య దశనుండే కలిగిఉంటే మనo మరణాన్ని జయించగలిగే చిరంజీవులమవుతామని గంగాధర శాస్త్రి అన్నారు. అందుకే తల్లి తండ్రులు పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, భగవద్గీత నేర్పించడం ద్వారా ఆదర్శవంతమైన భావాల బీజాలను బాల్య దశలోనే వారి మనస్సులలో నాటాలని, తద్వారా మంచి సమాజాన్ని సాధించవచ్చని అన్నారు.


"కంచి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి హైదరాబాద్ లోని స్కందగిరి దేవాలయం లో బస చేసిన సందర్భం లో - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి కుటుంబ సమేతం గా స్వామి ని దర్శించి ఆశీస్సులు పొందారు. తమ భగవద్గీత రికార్డింగ్ సమయం లో కంచి కి వచ్చి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని కలిసి ఆశీస్సులు పొందిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వీడియో చూపించి, తమ భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న, చేపట్టిన కార్యక్రమాలను స్వామి వారికి వివరించారు. ఈ సందర్భం గా భక్తి గానాన్ని వినిపించమని స్వామి కోరగా - గంగాధర శాస్త్రి - లింగాష్టకం, శివతాండవ స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం, శ్యామలా దండకం (మహాకవి కాళిదాసు), జయ జయ మహాదేవ శంభో హరా శంకరా (కాళహస్తిమహాత్మ్యం), నీలకంధరా దేవా (భూకైలాస్), భగవద్గీతా శ్లోకాలను గానం చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి గంగాధర శాస్త్రి దంపతులను దుశ్శాలువ తోను సత్కరించి కుమారుడు విశ్వతేజ, కుమార్తె కీర్తిప్రియల ను ఆశీర్వదించారు. గంగాధర శాస్త్రి ని ఆశీర్వదిస్తూ - భగవద్గీత ప్రచారానికే జీవితం అంకితం చేయడం పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యిందని, హర్యానా లోని కురుక్షేత్రం లో భగవద్గీతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందని, అందుకు తమ సహకారం కూడా ఉంటుందని, 27 చరణాలు గల 'శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రాన్ని కూడా ప్రచారం చేయవలసిందని సూచించారు


" ఎన్టీఆర్ అంటే రాముడు .. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు ... ఎన్టీఆర్ అంటే తెలుగు భాష .... ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ అంటే నటుడుగా సంపాదించుకున్న శక్తిని రాజకీయం అనే సేవ ద్వారా ప్రజల హృదయాలలో స్థిరస్థానం ఏర్పరచుకున్న కారణజన్ముడు! అలాగే అమృత గానం అంటే ఘంటసాల ... ఈ ఇద్దరు తెలుగు మహనీయులనూ దయచేసి 'భారత రత్న' తో గౌరవించండి." అని భారత ప్రభుత్వాన్ని కోరారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. తాను సంగీతభరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేయడానికి ఈ ఎన్టీఆర్, ఘంటసాలలే స్ఫూర్తి అన్నారు. గాన సుధాకర్ స్థాపించిన 'తేజస్విని కల్చరల్ అసోసియేషన్' సంస్థ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఎన్టీఆర్ అవార్డు ను 'గాత్ర కంఠీరవ' సాయికుమార్ కు అందజేశారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి - ఎన్టీఆర్, ఘంటసాలలకు నివాళిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం లోని 'నను భవదీయ దాసుని' పద్యాన్ని ఆలపించారు. ఔచిత్యభరితమైన నటనతో, అద్భుతమైన గాత్రం తో ఘన కీర్తిని సంపాదించుకుని ఎన్టీఆర్ ప్రశంసలు పొందిన సాయికుమార్ 'ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారానికి' ముమ్మాటికీ అర్హులు అన్నారు. తమ భగవద్గీతా ఫౌండేషన్ రూపొందించిన "The Making of Bhagavadgita Documentary " కి సాయికుమార్ గాత్రo అందించడాన్ని ఈ సందర్భం గా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసారు.


ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతాఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి ని - మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఆ రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ నరోత్తం మిశ్రా, ఆ రాష్ట్ర బి జె పి పార్టీ ఇంఛార్జి శ్రీ మురళీధర రావు, శ్రీ పి. నరహరి IAS లు 'సరస్వతీ పుత్ర' అవార్డు తో ఘనం గా సత్కరించారు. ఇదే వేదిక పై సినీ నటుడు అలీ, కిన్నెర వాద్య కళాకారుడు 'పద్మశ్రీ' పురస్కృత దర్శనం మొగులయ్య లను కూడా సత్కరించారు. తెలుగు సంగమం-హైదరాబాద్, బాలాజీ భక్త మండలి-భోపాల్, తెలుగు సాంస్కృతిక పరిషత్తు-భోపాల్ సంయుక్త ఆధ్వర్యం లో భోపాల్ లో 'తెలుగు సమాగం' పేరుతో తెలుగు సాంస్కృతిక సంబరాలు ( ఏప్రిల్ 16, 2022 న ) ఘనం గా జరిగాయి. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ - స్వార్ధరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని భగవద్గీత ప్రచారం కోసమే అంకితం చేయడం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి తన గాన ప్రసంగం లో తనకీ పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ - ఆ రోజు హనుమజ్జయంతి సందర్భంగా 'మనోజవం మారుత తుల్యవేగం' శ్లోకాన్నీ, మధ్యప్రదేశ్ కు చెందిన భోజరాజు ఆస్థానం లోని మహాకవి కాళిదాసు ను స్మరిస్తూ 'మాణిక్యవీణాం' శ్లోకాన్ని, ఈదేశం ప్రపంచానికి అందించిన, మతాలకు అతీతమైన జ్ఞాన సందేశం భగవద్గీత లోని 'యదా యదాహి ధర్మస్య' శ్లోక ద్వయాన్ని, తెలుగు భాషా మాధుర్యాన్ని గుర్తు చేస్తూ 'యేనుంగునెక్కి' పద్యాన్ని మధురం గా గానం చేసి అలరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు, 'తెలుగు సంగమం' వ్యవస్థాపకులు శ్రీ మురళీధర రావు తెలుగు భాష, తెలుగు జాతి, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు గల వ్యక్తి కావడం తెలుగు వారి అదృష్టం అన్నారు. వృత్తి రీత్యా ప్రపంచం తో అనుబంధం ఏర్పరచుకోవడం కోసం ఇంగ్లీష్ కి దగ్గరవడం తప్పు కాదని, కానీ మన మాతృ భాష తెలుగు కి దూరమైతే మాత్రం అది బాధ్యతా రాహిత్యమవుతుందని, మన సంస్కృతీ వారసత్వాన్ని తర్వాత తరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని, ఈ దేశం లో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, తెలుగు వాడిగా పుట్టినందుకు పోతన పద్యం నేర్చుకుని మన ఉనికిని కాపాడుకోవాలని గంగాధర శాస్త్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు గంగాధర శాస్త్రి రూపొందించిన సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ను జ్ఞాపిక లు గా అందించడం విశేషం. కార్యక్రమానంతరం మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీ పి. నరహరి IAS శ్రీ గంగాధర శాస్త్రి కుటుంబానికి ఉజ్జయిని మహా కాళేశ్వరుని, గడ కాళీమాత దర్శనాన్ని ఏర్పాటు చేశారు.'గీతా జయంతి-2021' వేడుకలను 'భగవద్గీతా ఫౌండేషన్' వైభవం గా నిర్వహించింది. చిక్కడపల్లి, హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాజ గానసభ వేదికపై ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9. 30 ని||లకు గోపూజ తో గీతా జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం - పూజ్యశ్రీ శ్రీ రామప్రియ స్వామి,శ్రీ గోవింద పీఠం, 'శ్రీ వేదభారతి' అధ్యక్షులు డా|| ఆర్ వి ఎస్ ఎస్ అవధానులు, విశిష్ట అతిథి శ్రీ వి వి లక్ష్మీనారాయణ IPS (Retd.), తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ వై రామారావు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా వి ఎస్ జనార్దన మూర్తి, కార్యక్రమ ప్రాయోజకులు 'సమూహ ప్రాజెక్ట్స్ ప్రై.లి.' శ్రీ వెంకయ్య నాయుడు , భగవద్గీతా ఫౌండేషన్ అడ్వొకేసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి జ్యోతి ప్రకాశనం తో 'గీతాజయంతి-2021" వేడుకలు ప్రారంభమయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు భగవద్గీత ను బోధిస్తున్న శ్రీ వై. రామకృష్ణ కు 'గీతాచార్య-2021" పురస్కారం అందిస్తూ, దుశ్శాలువా, రు. 25,000/- నగదు, సన్మాన పత్రం తో సత్కరించారు. భగవద్గీత లోని 700 శ్లోకాలనూ నేర్చుకున్న విద్యార్థిని చి|| గొర్తి నాగ అనిష్క కు 'పార్థ పురస్కారం-2021' అందిస్తూ, దుశ్శాలువా, రు. 10,000/- నగదు, ప్రశంసాపత్రం తో సత్కరించారు. అలాగే నాలుగేళ్ల వయస్సుకే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతనూ ధారణ చేసి, వాటిని సంస్కృతం లో వ్రాయగలిగిన బాలమేధావి ఐదేళ్ల బాలుడు చిII కలగా అచ్యుతశర్మ కు 'గీతాబాల మేధావి'పేరుతో ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తూ రు. 10,000/- నగదు, ప్రశంసా పత్రం తో సత్కరించారు. అనంతరం అచ్యుతశర్మ ను వేదికపై ఉన్నవారూ, ప్రేక్షకులూ అడిగిన శ్లోకాలన్నీ స్పష్టమైన ఉచ్చారణతో చెప్పి అందరినీ అబ్బురపరచాడు. శ్రీమతి శైలజ నిర్వహణలో చిన్నారుల చేత భగవద్గీత లోని 12 వ అధ్యాయమైన 'భక్తి యోగము' పారాయణ జరిగింది. థియేటర్ లోని గీతాభిమానులందరూ ఈ పరాయణలో పాల్గొన్నారు. చివరిగా భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి అతిథులందరినీ సత్కరించి అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ సాధించిన ప్రగతిని వివరిస్తూ, భవిష్యత్తులో తాము చేయబోయే కార్యక్రమాలను తెలియజేసారు. తమ కార్యక్రమాలకు చేయూతనందించవలసిందిగా కోరారు. శ్రీమతి క్రాంతి నారాయణ్ స్వాగత నృత్యం తో కార్యక్రమం ప్రారంభం కాగా, శ్రీ గాంధీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. అనంతరం ప్రసాదవితరణ తో కార్యక్రమం ముగిసింది.


భగవద్గీతా ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు (2008-2017)... కీ,,శే ,, శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారికి I.A.S (Retd) ఘననివాళి..


భక్తి టీవీ ఛానల్ వారు - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి. గంగాధర శాస్త్రి గారి తో 25 రోజుల పాటు (12.7.2021-5.8.2021) చేయించిన 'సంపూర్ణ భగవద్గీతా పారాయణ గాన ప్రవచన మహా యజ్ఞం' విజయవంతమై - ప్రపంచవ్యాప్తం గా తెలుగు బంధువుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం లో ముఖ్యం గా- భగవద్గీత మత గ్రంథం కాదని కర్తవ్య బోధనా గ్రంథమని,ఇది కేవలం హిందూ జాతి సముద్ధరణ కోసం బోధించబడినది కాదని.., యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం బోధించబడినదని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీత ను కేవలం పారాయణ గ్రంథం గా కాక ఆచరణ గ్రంధం గా భావించాలని , మరణ గీత గా కాక జీవన గీత గా చూడాలని, వృద్ధాప్యపు పఠనా గ్రంధం గా కాక, విద్యార్థులకు యువతరానికి బోధించే గ్రంధం గా మారాలని శ్రీ గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు. ముఖ్యం గా విద్యార్థులను, యువతరాన్ని లక్ష్యం గా చేసుకుని ఈ 25 రోజుల కార్యక్రమం జరిగింది. ఊరూరా గీతా మందిరాల నిర్మాణం జరగాలని, తద్వారా గీతా ప్రచారం విస్తృతం గా జరగాలని, ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలని, ప్రతి ఒక్క హిందువూ సనాతన ధర్మ జ్యోతిగా ప్రకాశించాలని కోరుకుంటున్నామని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సందర్భం గా హిందువుల మతం మార్చడానికి ప్రయత్నించే వారిని తీవ్రం గా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 25 వ రోజు గీతా ప్రచార కంకణ బద్ధులవుతామని యువత చేత ప్రమాణం చేయించారు. ఈ 25 రోజుల గీతా కార్యక్రమం లో చివరన గంగాధర శాస్త్రి గారు చేయించిన కృష్ణ భజనకు విశేషమైన స్పందన లభించింది. స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత కు మించిన పాఠం మరొకటి లేదని, కాబట్టి పాఠశాలలలో ఒకటవ తరగతి నుండే విద్యార్థులకు భగవద్గీతను నేర్పించేటట్లు చర్యలు తీసుకోవాలని గంగాధర శాస్త్రి - రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే భగవద్గీతను జాతీయ గ్రంధం గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భగవద్గీత ద్వారా హిందువులలో హిందుత్వాన్ని పటిష్టం చేయడం తమ భగవద్గీతా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భం గా తనకీమహదావకాశాన్ని ఇచ్చిన భక్తి టీవీ అధినేతలు శ్రీమతి రమాదేవి, శ్రీ నరేంద్ర చౌదరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భం గా భక్తి టీవీ లో ప్రసారమైన సంపూర్ణ భగవద్గీతా పారాయణ, గాన ప్రసంగ కార్యక్రమం లోని కొన్ని చిత్రాలు మీ కోసం...


తెలుగు భాష కు ప్రాచీన హోదాను సాధించడంలో కీలక పాత్రను పోషించిన నిజమైన తెలుగు భాషాభిమాని, సాంస్కృతిక బంధువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉప శాసన సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఆహ్వానం మేరకు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి- భారత దేశ అత్యున్నత న్యాయస్థాన, 48 వ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్ వి రమణను మర్యాద పూర్వకం గా కలిశారు. హైదరాబాద్ లోని రాజభవన్ లో జరిగిన ఈ కార్యక్రమం లో శ్రీ రమణ ను తులసి మాల తోనూ, దుశ్శాలువాతోనూ సత్కరించి తాను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ప్యాక్ ను జ్ఞాపిక గా అందించారు. అనంతరం గీతలోని - 'యద్యదాచరతిశ్రేష్ఠ' శ్లోకాన్ని గానం చేస్తూ - భవిష్యత్తు తరాల న్యాయాధిపతులకు ఆదర్శం గా, ప్రమాణం గా నిలిచే నిర్ణయాలను తీసుకుంటూ, గీత ద్వారా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని బోధించిన ఈ దేశం లో - న్యాయ వ్యవస్థ లో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి తద్వారా స్థిరమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, అందుకు పరమాత్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తెలుగు వారు గర్వపడే భారత ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని శ్రీ రమణ అలంకరించడం ఆ ఏడుకొండల శ్రీనివాసుడి అనుగ్రహమే ననీ, అందుకే శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలపడానికి శ్రీ రమణ తిరుమల వెళ్లడం ఆయనలోని ఆధ్యాత్మికతను చాటిచెబుతోందని అన్నారు. పదవి కాలం పూర్తి అయ్యాక కూడా ప్రజలు శాశ్వతం గా గుర్తుంచుకునేలా, ఉత్తమ సమాజ నిర్మాణం కోసం, నిష్కామ కర్మ యోగి గా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. తనకు భగవద్గీత చాల ఇష్టమైన కర్తవ్యబోధా గ్రంధమనీ, తప్పకుండా శ్రీ గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీతను వింటానని, జస్టిస్ ఎన్ వి రమణ అన్నారు. ఈ కార్యక్రమం లో భగవద్గీతా ఫౌండేషన్ సభ్యులు శ్రీ చలపతి రాజు, శ్రీ అజాద్ బాబు కూడా పాల్గొన్నారు.

స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం 'భగవద్గీత' ప్రచారమే జీవిత ధ్యేయంగా,అందుకు 'భగవద్గీతా యూనివర్సిటీ' స్థాపనే అంతిమ లక్ష్యం గా - ప్రసిద్ధ గాయకులు, 'గీతాచార్య' శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి 2007 లో 'భగవద్గీతా ఫౌండేషన్' అనే ఆధ్యాత్మిక, సామాజిక సంస్థను స్థాపించి,ఒక దశాబ్ద కాలం పరిశోధనాత్మక కృషి చేసి, ప్రపంచం లోనే తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ను తెలుగు తాత్పర్యం తో వెలువరించడం జరిగింది. 'భారత రత్న' డాII ఏ పి జె అబ్దుల్ కలామ్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వంటి మహాత్ముల అభినందనపూర్వక ఆశీస్సులతో గత 15 సంవత్సరాలుగా దేశవిదేశాలలోనూ, సోషల్ మీడియా ద్వారానూ, ప్రసార మాధ్యమాల ద్వారానూ అనేక గీతా ప్రచార కార్యక్రమాలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శ్రీ గంగాధర శాస్త్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. కాగా ఆయన మార్గాన్ని అనుకరిస్తూ ఇటీవల మరొకరు తాము కూడా - తమ భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా గీతా యూనివర్సిటీ ని నిర్మించదలచామంటూ ఆన్ లైన్ లో విరాళాలు సేకరిస్తున్నట్టు మా ఫౌండేషన్ కార్యాలయానికి వ్యక్తిగతం గానూ, ఫోన్ల ద్వారానూ అనేకమంది తెలియజేస్తున్నారు. అయితే ఈ తాజా సంస్థ తో శ్రీ గంగాధర శాస్త్రి గారు స్థాపించిన భగవద్గీతా ఫౌండేషన్ కి ఎటువంటి సంబంధమూ లేదని తెలియజేస్తున్నాము. అన్ని విషయాలూ భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం ( 102, హిమసాయి పార్క్ వ్యూ అపార్టుమెంట్స్, రోడ్ నెంబర్ 5, బంజారా హిల్స్ , హైదరాబాద్ 500 034, ఫోన్ : 9030756555; Website : www.bhagavadgitafoundation.org ) ద్వారా వివరంగా తెలుసుకున్న పిమ్మట విరాళాలు అందించవలసిందిగా దాతలను విజ్ఞప్తి చేస్తున్నాము

భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను విస్తృతం గా ప్రచారం చేయడం కోసం స్థాపించిన ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీతా ఫౌండేషన్. ప్రతి ఏటా ఘనం గా నిర్వహిస్తున్నట్టే ఈ సారి కూడా భగవద్గీతా ఫౌండేషన్ - గీత జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ టి వి చానెల్స్ TV 5, హిందూ ధర్మం ప్రత్యక్ష ప్రసారం చేయగా - ప్రపంచవ్యాప్తం గా లక్షలాదిమంది గీతా బంధువులు వీక్షించి ఆనందాన్నీ, స్ఫూర్తినీ పొందారు. డిసెంబర్ 8 వ తేదీ, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ముందుగా వత్స తో కూడిన గోవు కు పూజ చేసి, అటుపై గీతా రథం పై శ్రీకృష్ణుడు, అర్జునుడు సుప్రతిష్టులై ఉండగా, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి జెండా ఊపి గీతా రథ యాత్ర ను ప్రారంభించారు. వందలాది మంది విద్యార్థులు,యువకులు- జై శ్రీ కృష్ణ, కృష్ణం వందే జగద్గురుమ్, జై భగవద్గీతా నినాదాలతో రథ యాత్రలో పాల్గొన్నారు. అటుపై గీతా జయంతి వేడుకల సభ టివీ 5 స్టూడియో సెట్ లో ప్రారంభమయ్యింది. తొలుత శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి జ్యోతి ప్రకాశనం గావించారు. అటుపై ఘనా ఘన సుందరా అంటూ కృష్ణప్రార్థన చేసి - దశాబ్ద కాలం లో, గీతా ప్రచారం లో 'భగవద్గీతా ఫౌండేషన్' సాధించిన ప్రగతి నివేదికను సమర్పిస్తూ, భగవద్గీత గొప్పతనం గురించి స్ఫూర్తి దాయకం గా తన గాన ప్రసంగం ద్వారా వివరించారు. ప్రతి తల్లి తన బిడ్డలకు బాల్యదశ నుండే భగవద్గీత నేర్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు భగవద్గీత ను పాఠ్యాంశంగా చేర్చాలనీ, కేంద్ర ప్రభుత్వం భగవద్గీత ను జాతీయ గ్రంథం గా ప్రకటించాలని గంగాధర శాస్త్రి కోరారు. అంతే కాక - భగవద్గీత మతాలకు, దేశ, కాల, జాత్యాదులకు అతీతమైన జ్ఞాన బోధ కాబట్టి భగవద్గీత బోధించిన దినాన్ని "international wisdom day" గా ప్రకటించాలని సూచించారు. భగవద్గీత పట్ల సాధారణ ప్రజలలో వీలైనంత అవగాహన కలిగించే ప్రయత్నం చేశామనీ, వ్యక్తుల మరణ ప్రదేశాలలోనూ, శవ యాత్ర వాహనాలలోనూ భగవద్గీతను ప్రదర్శించడాన్ని సాధ్యమైనంతగా అరికట్టగలిగామనీ గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న గీతా ప్రచారాన్ని యూట్యూబ్ ద్వారా ఇప్పటివరకూ 20 లక్షలమందికి పైగా ప్రేక్షకులు వీక్షించారనీ... పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో గీత ద్వారా వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలతో విద్యార్థులకు స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ కలిగించామనీ, ప్రపంచ వ్యాప్తం గా అనేక దేవాలయాలలోనూ, ఇంకా ఇతర సందర్భాలలో భగవద్గీతను ప్రచారం చేయగలిగామని గంగాధర శాస్త్రి వివరించారు. ఒక దశాబ్దం పాటు పరిశోధనాత్మక కృషి చేసి తాము రూపొందించిన సంగీతభరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతకు ప్రపంచ వ్యాప్తం గా విశేషమైన ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం భగవద్గీతను ఆంగ్ల తాత్పర్యంతో రూపొందిస్తున్నామని, త్వరలో దీనిని అమెరికా అధ్యక్షుడి చేతులమీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇంకా హిందీ, గుజరాతి, కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో భగవద్గీతను వెలువరించేందుకు 'భగవద్గీతా ఫౌండేషన్' యోచన చేస్తోందని, సర్వజన హితం గా గీతను బోధించిన గీతాచార్యుడికి 'గుడి' ని, ఆయన బోధించిన భగవద్గీతకు 'బడి' ని 18 ఎకరాలలో నిర్మించాలని, తద్వారా గీతా ప్రచారాన్ని విస్తృతం చేయడం కోసం భగవద్గీతా ఫౌండేషన్ సంకల్పించిందనీ గంగాధర శాస్త్రి అన్నారు. 'గీతాజయంతి' సందర్భం గా భగవద్గీతా ఫౌండేషన్ - 'గీతాచార్య' పురస్కారాన్ని రిటైర్డ్ డీజీపీ శ్రీ కరణం అరవింద రావు కు, 'పార్థ' పురస్కారాన్ని చిII వలివేరు సాయి శ్రీకర్ కు అందించింది. ఈ సందర్భం గా విశిష్ట అతిధులు గా విచ్చేసి, గీతా సందేశం అందించిన శ్రీ వి వి లక్ష్మీనారాయణ-జనసేన నాయకులు, శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం IAS, శ్రీమతి 'భారతీయం' సత్యవాణి, టీవీ 5 చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు లను ఫౌండేషన్ సత్కరించింది. శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి గీతాచార్యుడికి మహా హారతి ఇచ్చి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమాన్ని భావగంభీరమైన వ్యాఖ్యానం తో ధీ శ్రీనివాస్ నిర్వహించారు. 'బాహుబలి' చిత్రం ఫేమ్ శ్రీమతి ఆశ్రిత వేముగంటి శ్రీకృష్ణుడిని స్వాగతిస్తూ చేసిన నృత్యం అలరించింది. ఈ కార్యక్రమానికి శ్రీ ఘంటా అజాద్ బాబు సమన్వయ కర్త గా వ్యవహరించారు. శ్రీ సరస్వతి చలపతి రాజు, శ్రీ సతీష్ లు పర్యవేక్షించారు. అనంతరం గీతా ఫల శృతి ( యత్ర యోగేశ్వరః కృష్ణో 18-78) శ్లోకం తో, శాంతి మంత్రాలతో గీతా జయతి వేడుకలను మంగళప్రదం గా ముగించారు.ప్రసిద్ధ గాయకులు గంగాధర శాస్త్రి గానం చేసిన సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత - భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సువర్ణ హస్తాల లోకి బహుమతి గా చేరింది. ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు హాజరైన శ్రీ నరేంద్ర మోడీ ని బి జె పి నాయకులు అంత క్రితం బేగంపేట విమానాశ్రయం లో ఘన స్వాగతం పలికారు. బి జె పి నాయకురాలు, భగవద్గీతా ఫౌండేషన్ సభ్యురాలు అయిన శ్రీమతి గీతా మూర్తి - ఫౌండేషన్ తరపున గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీత ప్యాక్ ను శ్రీ మోడీ కి బహుమతి గా ఇచ్చి స్వాగతం పలికారు. ఇది దశాబ్ద కాలం కృషితో రూపొంది, అటుపై భారత రత్న డాII అబ్దుల్ కలాం ప్రశంసలు పొంది, తెలుగు జాతి కి అంకితం చేయబడ్డ విశిష్ట ప్రయత్నమని, గీతా మూర్తి మోడీ కి వివరించగా-మోదీ అభినందిస్తూ ఈ గీతను తాను తప్పక వింటానన్నారు. ఈ ప్రయత్నం జరుగుతున్న సమయం లో మోదీ - భగవద్గీతా ఫౌండేషన్ ను అభినందిస్తూ రాసిన లేఖని ఈ సందర్భం గా ఆమె ప్రస్తావించారు.

Bhagavadgita Foundation soulfully congratulates India's 14th President Sri. Ramnath Kovind.

Packs Available


Bhagavadgita Promo