గుంటూరు జిల్లా జగ్గాపురం గ్రామం లో జనవరి 14న సంక్రాంతి సంబరాలు వైభవం గా జరిగాయి... ఈ సందర్భంగా జాగర్లమూడి ఆదియ్య భవనం లో కళారత్న, 'గీతాగాన గంధర్వ' శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిచే భగవద్గీతా గాన ప్రవచనం ఏర్పాటు చేశారు. రెండున్నర గంటల పాటు జగ్గాపురం గ్రామ ప్రజలు శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన వాహినిలో తేలియాడారు. అనంతరం పోపూరి వెంకటేశ్వర్లు మరియు జగ్గాపురం గ్రామ ప్రజలు గంగాధర శాస్త్రి గారిని సత్కరించారు.