ఫిబ్రవరి 7వ తేదీన దుబాయ్ లోని - అల్ జుర్ఫ్, అజ్మాన్ లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ లో 'శ్రీనివాస కళ్యాణం' అత్యంత వైభవం గా జరిగింది. ఈ కార్యక్రమం లో భాగం గా - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారి చే గీతా గాన ప్రవచనం జరిగింది. గత దశాబ్ద కాలం గా 'భగవద్గీతా ఫౌండేషన్' కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా వీక్షించిన వందలాదిమంది అభిమానులు గంగాధర శాస్త్రి ప్రవచనానికి తరలివచ్చారు. భగవద్గీత గురించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సెల్ఫీ లు తీసుకున్నారు. గంగాధర శాస్త్రి గానం చేసిన సంపూర్ణ భగవద్గీత ఆడియో సిడి లను పొందారు. ప్రపంచం లో మిగతా మత గ్రంథాలు మానవుల చేత రచించబడినవనీ, భగవద్గీత - సాక్షాత్తూ పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడి ప్రపంచ మానవాళికి అందిన మహోత్కృష్టమైన దివ్య సందేశమని, దీనిని ప్రతి ఒక్కరూ విని, ఆచరించి, ప్రచారం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని స్థాపించవచ్చని, మానసిక వత్తిడి లేని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీ గంగాధర శాస్త్రి చెప్పారు.

ఫిబ్రవరి 8,9,10 తేదీలలో దుబాయ్ పరిసరాల లోని అబు ధాబి, రాస్ ఆల్ ఖైమా, షార్జా ల లో కూడా శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం తో నిత్య జీవన మార్గం లో భగవద్గీత ఆవశ్యకతను తెలియజేశారు.

.