కరీంనగర్ జిల్లా లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ధర్మపురి లో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

కరీంనగర్ జిల్లా లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ధర్మపురి లో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం గా జరుగుతున్నాయి.. పరమ ధార్మికుడైన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు.. ఈ బ్రహ్మోత్సవాల సందర్భం గా మూడవ రోజున ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిచే భగవద్గీతా గాన ప్రవచనం ఏర్పాటుచేశారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వేలాదిమంది భక్తులతో పాటు ధర్మపురి లో ఉన్న ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
ఈ సందర్భం గా దేవాలయ అధ్యక్షులు శ్రీ శ్రీకాంత రెడ్డి, ఆలయ ప్రధానాధికారి శ్రీ అమరనాథ్ లు కార్యక్రమ అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి ని ఆలయ మర్యాదలతో స్వామి వారి దర్శనం చేయించి అనంతరం సత్కరించారు.