శ్రీ శ్రీ శ్రీ చిద్రూపానంద స్వామి, చిన్మయ మిషన్ ( ఢిల్లీ శాఖ అధిపతి ) తన హైదరాబాద్ పర్యటనలో భాగం గా - భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, గీతాగాన ప్రవచన కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, సంస్థ అడ్వొకసి ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు, డాII పద్మ వీరపనేని, సభ్యులు శ్రీ బి ఎస్ శర్మ , శ్రీ ఎం రఘు తదితరులు చిద్రూపానంద కు ఘన స్వాగతం పలికారు. వారిని ఫల పుష్ప వస్త్రాలతొ సత్కరించి, సంపూర్ణ భగవద్గీత ఆడియో సి డి ని అందించారు. ఈ సందర్భం గా ప్రదర్శించిన The Making of Bhagavadgita - Documentrary ని తిలకించి శ్రీ చిద్రూపానంద - భగవద్గీతా ఫౌండేషన్ కి ఆశీస్సులు అందజేశారు. భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ గంగాధర శాస్త్రి ని అభినందిస్తూ, ఫౌండేషన్ తలపెట్టిన భవిష్యత్తు ప్రాజెక్టులు విజయవంతం కావాలని అందుకు తమ గురుదేవులు శ్రీ చిన్మయానంద ఆశీస్సులు తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. విచ్చేసిన భక్తులు అడిగిన అనేక సందేహాలకు సమాధానాలు చెప్పారు...
.