లాంగ్ ఐలాండ్, అమెరికా లోని తన స్వగృహం లో తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్లూరి, శ్రీమతి నీలిమ దంపతులు శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని, శివ విష్ణు దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ రఘు శర్మ గారి అద్వర్యం లో అత్యంత వైభవం గా (16.9. 2023) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిని విశిష్ట అతిథి గా ఆహ్వానించారు. ‘భక్తి యోగం’ పైన శ్రీ గంగాధర శాస్త్రి గాన ప్రవచనం చేస్తూ ఘంటసాల, అన్నమయ్య కీర్తనలు పాడుతూ కల్యాణానికి హాజరైన జయ్ తాళ్ళూరి బంధు మిత్రులతో గోవింద భజన చేయించారు.













