గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి – అమెరికా లోని న్యూయార్క్ రాజధాని అయిన ఆల్బని లోని తెలుగు సంఘం ( ATA ) ఆహ్వానం మేరకు వెళ్లి, కొన్ని కార్యక్రమాలలో పాల్గొని భగవద్గీత ద్వారా ఉత్తమ జీవన విధానాన్ని వివరిస్తూ గాన ప్రసంగాలు చేశారు. ఈ నేపధ్యం లో ‘వినాయక చవితి’, మరికొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా – గీతా ప్రవచన కార్యక్రమానికి ఆహ్వానించి, తనకు ఆత్మీయ ఆతిధ్యం అందించినందుకు ‘ఆల్బని తెలుగు అసోసియేషన్’ అధ్యక్షులు శ్రీ వెంకట్ జాస్తి, శ్రీమతి అనురాధ దంపతులకు కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు అందించారు. అలాగే ATA సభ్యులు శ్రీ యుగంధర్, హర్షిత దంపతులను, శ్రీ రమణ అల్లెన, శ్రీమతి నీరజ దంపతులను, శ్రీ వెంకటేశ్ చెరుకుమల్లి దంపతులను కూడా అభినందించారు.